దేవిశ్రీ ప్రసాద్ కు మరోసారి ఎదురుదెబ్బ

ఓవైపు ఇది నడుస్తుండగానే, మరోవైపు పోలీసులు మాత్రం దేవిశ్రీ తలపెట్టిన కార్యక్రమానికి అనుమతులు ఇవ్వడం లేదు.

చూస్తుంటే, ఈసారి దేవిశ్రీ ప్రసాద్ అనుకున్నది జరిగేట్టు లేదు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. ఏకంగా 4 సార్లు ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి అతడికి ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. విశాఖలో జరగాల్సిన మ్యూజికల్ నైట్ మేటర్ ఇది.

లైవ్ ఇండియా టూర్ లో భాగంగా కొన్ని రోజులుగా మ్యూజికల్ కన్సర్ట్‌లతో దేవిశ్రీ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరులో సక్సెస్ ఫుల్ గా టూర్ కంప్లీట్ చేశాడు దేవిశ్రీ. ఇదే ఊపులో విశాఖలో సంగీత విభావరి పెట్టాలనుకున్నాడు.

ముందుగా ఒక తేదీ అనుకొని, అనుమతులకు అప్లయ్ చేశారు. కానీ పర్మిషన్ రాలేదు. దీంతో కార్యక్రమం వాయిదా వేశారు. మళ్లీ అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి కూడా అనుమతి రాలేదు. మరోవైపు కార్యక్రమానికి సంబంధించి టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టారు. భారీగా టికెట్లు కూడా అమ్ముడుపోయాయి.

ఓవైపు ఇది నడుస్తుండగానే, మరోవైపు పోలీసులు మాత్రం దేవిశ్రీ తలపెట్టిన కార్యక్రమానికి అనుమతులు ఇవ్వడం లేదు. అలా ఇప్పటికి 4 సాక్లు జరిగింది. దీంతో విశాఖలో జరగాల్సిన కన్సర్ట్ పై అనుమానాలు తలెత్తాయి. రీసెంట్ గా స్పోర్ట్స్ వాటర్ క్లబ్ లో జరిగిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు, దేవిశ్రీ కార్యక్రమానికి అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది.

ఎన్నిసార్లు ప్రయత్నించినా అనుమతి రాకపోవడంతో నిర్వహకులు ఆలోచనలో పడ్డారు. మరోసారి మ్యూజికల్ కన్సర్ట్ తేదీని వాయిదా వేయాలా లేక ఏకంగా వేదికనే మార్చాలా అనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

5 Replies to “దేవిశ్రీ ప్రసాద్ కు మరోసారి ఎదురుదెబ్బ”

Comments are closed.