ఫైబ‌ర్‌నెట్‌కు బాబు స‌ర్కార్ ఉరి

ఫైబ‌ర్‌నెట్‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ ఉరి తీయ‌డానికి సిద్ధ‌మైంది. ఫైబ‌ర్‌నెట్ ఎండీ తాజాగా ఇచ్చిన నోటీసు … ఈ నెలాఖ‌రుతో ఫైబ‌ర్‌నెట్ ఉసురు తీయనుంది.

ఫైబ‌ర్‌నెట్‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ ఉరి తీయ‌డానికి సిద్ధ‌మైంది. ఫైబ‌ర్‌నెట్ ఎండీ తాజాగా ఇచ్చిన నోటీసు … ఈ నెలాఖ‌రుతో ఫైబ‌ర్‌నెట్ ఉసురు తీయనుంది. ఫైబ‌ర్‌నెట్‌లో సూర్య ఎంట‌ర్ ప్రైజెస్‌కు ఈ నెల 30వ తేదీతో కాంట్రాక్ట్ గ‌డువు ముగియ‌నుంది. ఇక‌పై పొడిగింపు లేద‌ని ఆ సంస్థకు నోటీసు ఇచ్చారు. అందువ‌ల్ల ఇక‌పై ఉద్యోగులంద‌రినీ తొల‌గించ‌నున్న‌ట్టు ఫైబ‌ర్‌నెట్ సంస్థ అత్యున్న‌త అధికారి ఇచ్చిన నోటీసుతో వాళ్లంద‌రిలో తీవ్ర ఆందోళ‌న నెల‌కుంది.

నిజానికి గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలోనే ఫైబ‌ర్‌నెట్‌ను తీసుకొచ్చారు. త‌క్కువ ఖ‌ర్చుతో ఇంట‌ర్‌నెట్ సౌక‌ర్యం క‌ల్పించ‌డం ద్వారా విద్యార్థులు, ఇత‌ర రంగాల ప్ర‌జ‌ల‌కు మెరుగైన సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాల‌ని సంక‌ల్పించారు. టీడీపీ హ‌యాంలో ఫైబ‌ర్‌నెట్ మెరుగైన ఇంట‌ర్‌నెట్ సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ త‌ర్వాత వైసీపీ హ‌యాంలో కేవ‌లం పార్టీ శ్రేణుల‌కు ఉపాధి క‌ల్పించే సంస్థగా భావించి, కార్యాల‌యాల‌కు వెళ్ల‌కుండానే జీతాలు ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో అలాంటి ఉద్యోగుల్ని ఇటీవ‌ల తొల‌గించారు. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఫైబ‌ర్‌నెట్ నాసిర‌క సేవ‌ల్ని అందిస్తోంద‌నే విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి ప‌రిస్థితిలో సూర్య ఎంట‌ర్ ప్రైజెస్ కాంట్రాక్ట్ గ‌డువు పొడిగించ‌డం లేద‌ని, ఉద్యోగుల్ని తొల‌గిస్తున్న‌ట్టు ఎంపీ ప్ర‌క‌ట‌న వాళ్ల పాలిట పిడుగుపాటైంది. సుమారు 300 మంది ఉద్యోగులు టీడీపీ హ‌యాం నుంచి రెగ్యుల‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. వీళ్ల‌లో 75 శాతం కేవ‌లం టీడీపీ అభిమానులే కావ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ తొల‌గించ‌డం ద్వారా, వాళ్ల కుటుంబాల క‌డుపు కొట్టిన‌ట్ట‌వుతోంది.

ఈ ఉద్యోగుల్లో జీఎం, ఏజీఎం, మేనేజ‌ర్ త‌దిత‌ర స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నారు. క‌నీసం ప్ర‌త్యామ్నాయం కూడా చూసుకోకుండా ఉద్యోగుల తొల‌గింపున‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఈ చ‌ర్య‌తో ఫైబ‌ర్‌నెట్‌కు ప్ర‌భుత్వ‌మే ఉరి వేసినట్టు అవుతోంద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

కూట‌మి అధికారంలోకి వ‌స్తే, ఫైబ‌ర్‌నెట్ స‌ర్వీసుల్ని మెరుగ్గా తీర్చుదిద్దుతుంద‌ని, అలాగే అందులో ప‌ని చేసే రెగ్యుల‌ర్‌ ఉద్యోగాల‌కు భ‌ద్ర‌త వుంటుంద‌ని ఆశించిన వాళ్ల‌కు తీవ్ర నిరాశే మిగిలింది. ఈ నెలాఖ‌రుతో ఫైబ‌ర్‌నెట్ సేవ‌ల్ని శాశ్వ‌తంగా మ‌రిచిపోవ‌చ్చు. ఫైబ‌ర్‌నెట్ అనేది ఇక‌పై గ‌త చ‌రిత్ర‌. దీన్ని కూట‌మి ప‌రిభాష‌లో చెప్పాలంటే… ఫైబ‌ర్‌నెట్‌ను విధ్వంసం చేశారు.

3 Replies to “ఫైబ‌ర్‌నెట్‌కు బాబు స‌ర్కార్ ఉరి”

Comments are closed.