జ‌న‌సేన‌లో అధిక ప్ర‌సంగి!

కూట‌మికి బీట‌లు ప‌డ‌కుండా చూసుకోవాలే త‌ప్ప‌, ఒక్క‌సారి బీజం ప‌డితే, ఆప‌డం ఎవ‌రిత‌రం కాదు.

అవ‌ధాన ప్ర‌క్రియ‌లో అప్ర‌స్తుత ప్ర‌సంగం చేసే క్యారెక్ట‌ర్ వుంటుంది. అవ‌ధానంలో అలాంటి వ్య‌క్తిని అధిక ప్ర‌సంగి అంటుంటారు. అన‌వ‌స‌ర‌మైన విష‌యాల్ని మాట్లాడినా అవ‌ధాని, వాటిని ఇంపుగా ప‌ద్య రూపంలో పేర్చుతుంటారు. అయితే రాజ‌కీయాల్లో అధిక ప్ర‌సంగం అన‌ర్థ‌దాయకం.

రాజ‌కీయాల్లో నాయ‌క‌త్వం వ‌హించే వాళ్లకు ఓర్పు, వినే గుణం ఎక్కువగా వుండాలి. నాయ‌కుల‌కు నోటి దురుసు వుంటే, ఇబ్బందులు త‌ప్ప‌వు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న‌, ఆ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు నోరు పారేసుకోవ‌డంలో ఆరితేరారు. అవ‌ధానంలో అధిక ప్ర‌సంగి క్యారెక్టర్‌ను ఆయ‌న జ‌న‌సేన‌లో పోషిస్తున్నార‌నే విమ‌ర్శ వుంది.

పిఠాపురంలో ఏ రోజైతే ప‌వ‌న్‌ను గెలిపించింది తామే అని ఎవ‌రైనా వ్య‌క్తులు అనుకుంటే, అది వాళ్ల ఖ‌ర్మ అంటూ నొక్కి చెప్పారో, ఆ రోజే నాగ‌బాబుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కూట‌మికి బీట‌లు ప‌డ‌కుండా చూసుకోవాలే త‌ప్ప‌, ఒక్క‌సారి బీజం ప‌డితే, ఆప‌డం ఎవ‌రిత‌రం కాదు. ఆ రోజు నుంచి పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్‌విఎస్ఎన్ వ‌ర్మ జ‌న‌సేన‌పై త‌న అక్క‌సంతా ర‌క‌ర‌కాల రూపాల్లో వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. అస‌లే వ‌ర్మ ఒక‌రు చెబితే వినే ర‌కం కాదు.

తాజాగా ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో క‌లిసి సంబ‌రాలు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన వాళ్లకు కండువాలు క‌ప్పారు. ఆ కండువాల్ని గ‌మ‌నిస్తే, వైసీపీ కండువాల్ని పోలి ఉన్నాయి. సాధార‌ణంగా టీడీపీ వాళ్ల తీరు ఎలా వుంటుందంటే… ప్ర‌తిదీ ప‌సుపుమ‌యం కావాల‌ని కోరుకుంటారు.

అలాంటిది వైసీపీ కండువాల రంగుల్ని పోలిన వాటిని వేసుకోవ‌డం ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. వ‌ర్మ ఏమైనా వైసీపీలో చేరారా? అనే అనుమానం క‌ల‌గ‌క‌మాన‌దు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన తీరుకు నిర‌స‌న‌గా, వ‌ర్మ ర‌క‌ర‌కాల విన్యాసాలు చేస్తున్నారు. వీట‌న్నింటికి కార‌ణం… జ‌న‌సేన అధిక ప్ర‌సంగే అని టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. నాగ‌బాబు త‌మ‌ను గౌర‌వించ‌క‌పోయినా ఫ‌ర్వాలేద‌ని, అవ‌మానించార‌ని, అందుకే తమ సత్తా ఏంటో చూపుతామ‌ని వాళ్లు హెచ్చ‌రిస్తున్నారు. కూటమిలో నాగ‌బాబు పెట్టిన చిచ్చు… నెమ్మ‌దిగా ద‌హించేలా వుంది.

17 Replies to “జ‌న‌సేన‌లో అధిక ప్ర‌సంగి!”

  1. మన సమస్య ఏమిటీ అంటే వైకాపా కండువా ఏ రంగులో ఉంటుందో కూడా తెలియకపోవడం….కలర్ బ్లైండ్ ప్రాబ్లెమ్ ఉందొ ఏమిటో…. అక్కడ 5 రకాల కండువాలు కనిపిస్తున్నాయి…. ఏది కూడా వైకాపా వారి ఒక వైపు నీలం, ఒక వైపు పచ్చ రంగులో లేవు…. ఊళ్లలో పెద్ద మనుషులు అలానే తెల్ల చొక్కా వేసి పైన ఒక కండువా వేస్తారు….అది మామూలే….ఆ కార్యక్రమం పార్టీ పని కాదు అనుకుంట, అందుకే తెలుగు దేశం జెండాలు, కండువాలు లేవు…. వర్మ వైకాపా లో జాయిన్ అయినా, ఏకంగా వైకాపా పార్టీ ప్రెసిడెంట్ అయిపోయినా పిఠాపురం లో పవన్ కళ్యాణ్ ని ఢీకొట్టలేడు…. ఇంకా ఎంతకాలం వర్మ కలలు కంటారు….మిగతా 174 నియోజిక వర్గాలు ఏమవుతున్నాయో చుడండి

  2. అందుకే నోరు మంచిది ఐతే ఊరు మంచిది అవుతుంది…అన్న సామెత ఊరికే రాలేదు…

  3. 2014 లోనే కుల సమీకరణాలలో పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి 47 వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందిన వ్యక్తి వర్మ గారు. ఎప్పుడు ఆయన కులాన్ని నమ్ముకోలేదు. ఎప్పుడు ప్రజల కష్టాలలో వాళ్ళ వెన్నంటే ఉన్నారు. 2019 లో కూడా మూడు పార్టీలు పోటీ చేసిన ఎన్ని ఓట్లు పడ్డాయో కొంత మంది నోరు పరేసుకునే నాయకులు గమనించాలి.మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం ఉంది. కానీ ఇలాంటి వ్యక్తుల మాటలు వల్ల ఆయన గురించి కూడా మాట్లాడవలసి వస్తుంది. 2019 లో మీ నాయకుడికి గాజువాక లో ఎన్ని ఓట్లు పడ్డాయి. మీ సామాజిక వర్గ ఓట్లు ఉన్నందుకేగా మీరు ఇక్కడినుండి పోటీ చేసి గెలుపొందింది. మీరా వర్మ గారి గురించి మాట్లాడేది. కొంచెం అయిన సిగ్గు ఉండాలి.

    1. పవన్ కి గాజువాకలో పడకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి…. దానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు…. 1999-2024 వరకు 6 ఎన్నికల్లో 5 సార్లు కాపులు గెలిచారు 2014 మినహా…. వర్మ గారు కూడా 2014 లో గెలిచింది కాపుల ఓట్లతోనే ప్రత్యేక పరిస్థితుల్లో…. 2009 లో ప్రజారాజ్యం తరుపున వంగా గీత గారు గెలిచారు, అనంతరం ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిపెయ్యడం నచ్చని పిఠాపురం కాపులు 2014 లో వైకాపా పందెం దొరబాబు గారిని, టీడీపీ విశ్వం గారిని కాపు అభ్యర్ధులని పెడితే, కాపుల ఓట్లు ఇండిపెండెంట్ అయిన వర్మ గారికి వేశారు…. కులానికి వచ్చిన కోపాన్ని నమ్మే ఆయన ఇండిపెండెంట్ గా గెలిచారు…. 2019 లో కాపు అభ్యర్థి దొరబాబు గెలిచారు, జనసేన శేషు కుమారి మరో కాపు అభ్యర్థి 28000 చీల్చినా… వర్మ గారు 2019 లో గెలవలేదేమి మరి

      1. అక్కడ ఆ సామాజికవర్గ ఓట్లు ఉన్నాయి కాబట్టే ఇక్కడ పోటీచేశారు. కానీ వర్మకి సొంత సామాజికవర్గ ఓట్లు లేకపోయినా ఆ స్టేజ్ లో ఉన్నారు అంటే అది ఆయనకు ప్రజలలో ఉన్న మంచితనమే కదా. ఆయనని పొగడమని అనట్లేదు. కించపరచకుండా ఉంటే చాలు.

  4. Ok kapu gaa chuputhanaa naga babu valla janasenna ku nastham thappa labbam ledu

    actual gaa varma ki antha scene ledu

    Yavaru cheparu last election low Varma pawan support chesadani

    Epudu manam anava Saravangaa scene echammu

    Manam

    BC kulallu low

    Neglected castes support chasthu

    Example palli/ gavaraa/goudaa/devaga/ other small populated caste thow cadre build chyalli

    Next election ki pawan cm chyalli

  5. నాయనా మీ వైసీపీ సన్నాసులు ఇంతకంటే పనికిమాలిన అవధానాలు చాలా చేశారు ముందు నీ గుద్దను కడుక్కో మీ సన్నాసులు గ**** వీలైతే నువ్వే కడిగేయాలి

  6. వర్మ గారికి సరైన శాస్తి జరిగింది. వర్మ గారు తీసుకున్న గోతిలో తానే పడ్డాడు అన్న చందంగా తయారయింది వర్మ గారు రాజకీయ పరిస్థితి. ఇప్పుడైనా టిడిపితో, వైసీపీతో, జనసేనతో, కూడా పోటీ పడాలి. అన్నిటికీ చెడ్డాలా తయారయింది వర్మ గారి రాజకీయ భవిష్యత్తు.

Comments are closed.