టాలీవుడ్ లో ఈ వీకెండ్ ఖాళీ

టాలీవుడ్ ఈ వీకెండ్ బోసిపోయింది. ఏదైనా చూద్దామంటే చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటీ లేదు.

టాలీవుడ్ ఈ వీకెండ్ బోసిపోయింది. ఏదైనా చూద్దామంటే చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటీ లేదు. పేరుకి 7 సినిమాలు రిలీజయ్యాయి కానీ ఏదీ ఆకట్టుకోలేదు. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ బోసిపోయింది.

గత వారం రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, ఎంపురాన్ లాంటి సినిమాలొచ్చాయి. వీటిలో ఒకటి మాత్రమే ఆకట్టుకుంది. మిగతా 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి టైమ్ లో ఈ వీకెండ్ కాస్త అంచనాలతో ఇంకో సినిమా ఏదైనా వస్తే బాగుండేది. కానీ అలాంటి ప్రయత్నం జరగలేదు.

వృషభ, శారీ, శివాజ్ఞ, ఎల్వైఈ లాంటి చిన్న సినిమాలు చాలానే మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. ఇక ఆర్య-2, ఆదిత్య 369 లాంటి రీ-రిలీజ్ లు తక్కువ స్క్రీన్స్ కే పరిమితమయ్యాయి.

ఇలా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో మ్యాడ్ స్క్వేర్ కు అది మరింత కలిసొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో చూడ్డానికి ఈ సినిమా తప్ప ఇంకోటి లేదు. వచ్చే వారం జాక్ వస్తున్నాడు.

One Reply to “టాలీవుడ్ లో ఈ వీకెండ్ ఖాళీ”

Comments are closed.