వీక్ నెరేషన్ కు తోడు నెగెటివిటీ కూడా!

‘టెస్ట్’ సినిమా కంటెంట్ తో క్లిక్ అవ్వకపోగా, ధనుష్ ఫ్యాన్స్ నెగెటివ్ పబ్లిసిటీతో ఈ సినిమాకు మరింత నష్టం వాటిల్లింది.

నయనతార నటించిన టెస్ట్ సినిమా నిన్న నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎవ్వరికీ నచ్చలేదు. బలమైన స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, నెరేషన్ వీక్ గా ఉందని, కథనం చప్పగా సాగిందనే విమర్శలు వెల్లువెత్తాయి.

ఫలితంగా టెస్ట్ సినిమా ప్రేక్షకుల సహనాన్ని నిజంగానే టెస్ట్ చేసింది. అయితే ఇప్పుడీ ఫ్లాప్ టాక్ కు తోడు నయనతారపై కొన్ని నెలలుగా పేరుకుపోయిన నెగెటివిటీ కూడా బాగా పనిచేసిందంటున్నారు కోలీవుడ్ సినీ విమర్శకులు.

నయనతార-ధనుష్ మధ్య నడుస్తున్న కాపీరైట్ వివాదం, దానికి సంబంధించిన కోర్టు కేసు గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ధనుష్ ను బహిరంగంగానే విమర్శించింది నయనతార. దీంతో అతడి ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ఇన్నాళ్లకు వాళ్లకు అవకాశం వచ్చింది.

టెస్ట్ సినిమా ఇలా స్ట్రీమింగ్ కు వచ్చిన వెంటనే, అలా నెగెటివ్ పబ్లిసిటీ మొదలుపెట్టారు ధనుష్ ఫ్యాన్స్. కొంతమంది సినిమాపై నెగెటివ్ రివ్యూస్ ఇస్తే, మరికొంతమంది స్క్రీన్ షాట్స్ తో చెడుగుడు ఆడుకున్నారు. దీనికితోడు సినిమా కూడా క్షణాల్లో వైరసీకి గురైంది.

ఇలా ‘టెస్ట్’ సినిమా కంటెంట్ తో క్లిక్ అవ్వకపోగా, ధనుష్ ఫ్యాన్స్ నెగెటివ్ పబ్లిసిటీతో ఈ సినిమాకు మరింత నష్టం వాటిల్లింది. నెక్ట్స్ ఆమె నుంచి థియేట్రికల్ రిలీజ్ ఉంది. అప్పటికి కోపం చల్లారితే ఓకే, లేదంటే దానిపై కూడా నెగెటివిటీ గ్యారెంటీ.

5 Replies to “వీక్ నెరేషన్ కు తోడు నెగెటివిటీ కూడా!”

Comments are closed.