సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియాలే ఎక్కువ. ప్రతి సినిమాకు వందల కోట్ల బడ్జెట్. టాలీవుడ్ కు సంబంధించినంత వరకు సంస్థాగత ఫైనాన్సియర్లు తగ్గిపోతున్నారు. వాళ్లు కూడా భారీగా వందల కోట్ల ఫైనాన్స్ ఇవ్వడం లేదు. అతి కొద్ది సెలక్టివ్ నిర్మాతలకు, సెలక్టివ్ సినిమాలకు మాత్రమే ఇస్తున్నారు. దీంతో ఎక్కువ మంది బలమైన స్లీపింగ్ పార్టనర్ల కోసం చూస్తున్నారు. అలాంటి భాగస్వాములు వున్న నిర్మాణ సంస్థలు నడుస్తున్నాయి. లేనివి కిందా మీదా అవుతున్నాయి.
మరోపక్క ఫండింగ్ కోసం బాలీవుడ్ బడా సంస్థల మీద కూడా ఆధారపడుతున్నాయి. నార్త్ ఇండియా పంపిణీ, నాన్ థియేటర్ లాంటి వ్యవహారాలు అడ్డం పెట్టుకుని ఆ సంస్థలు ఫండింగ్ చేస్తున్నాయి. ఇలా ఫండింగ్ అందుకున్న సంస్థకు, ఇచ్చిన సంస్థకు ఓ భారీ సినిమా విషయం మీద వివాదం నడుస్తోందని తెలుస్తోంది.
ఓ ఫాన్ ఇండియా సూపర్ స్టార్ నటించిన ఓ భారీ సినిమా గత రెండు మూడేళ్లుగా నిర్మాణంలో వుంది. ఈ సినిమా మీద ఇటీవల బోలెడు గ్యాసిప్ లు వినిపించడం మొదలైంది. హీరోకి కొంత కంటెంట్ నచ్చలేదని, రీ షూట్ చేయమన్నారని, గ్రాఫిక్స్ వర్క్ ఎప్పుడు వస్తాయో ఇంకా ఫుల్ క్లారిటీ లేదు. ఇలాంటి టైమ్ లో ఈ సినిమాకు ఫండింగ్ ఇస్తున్న బాలీవుడ్ సంస్థ నుంచి 300 కోట్లకు పైగా డ్రా చేసేసారట. దాంతో ఆ సంస్థ ఈ విషయం మీద కాస్త సీరియస్ గా వుందని తెలుస్తోంది.
ప్రోడెక్ట్ ఎప్పుడు వస్తుందని, ఎప్పుడు రెడీ చేస్తారనే విషయం మీద ఇటు ఫండింగ్ సంస్థకు, నిర్మాణ సంస్థకు నడుమ వివాదం నడుస్తోందని తెలుస్తోంది. ఈ వివాదం కాస్తా లీగల్ ఫైట్ గా మారే అవకాశం వుందని తెలుస్తోంది. అదే జరిగితే ఈ సినిమా విడుదలకే బ్రేక్ పడుతుంది.
హీరో కూడా ఈ సినిమాను మెల్లగా అలా వెనక్కు జరిపి, తరువాత సినిమాను ముందుకు తెచ్చే ఆలోచన చేస్తున్నారని, అయితే తరువాత సినిమా కూడా భారీ సినిమా కావడం, గ్రాఫిక్స్, షూటింగ్ చాలా టైమ్ పట్టడంతో ఆ అవకాశం లేదని తెలుస్తోంది.
ఆ ప్రొడక్షన్ హౌస్‌కు ఈ సినిమా చాలా కీలకం. ఇది కనుక తేడా చేస్తే పరిస్థితి దారుణంగా వుంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.
రాజసాబ్ – పీపుల్స్ మీడియా
the rajasaab
https://www.facebook.com/share/r/14qvF5v46z/
జాయిన్ కావాలి అంటే
హాయ్
How much
How much.
Krish4