బాబోయ్‌… ఆ ఎస్సీకి బంగారం ఇవ్వ‌లేక చ‌స్తున్నాం!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా… ఉత్త‌రాది ప్రాంతానికి చెందిన ఎస్పీకి కానుక‌లు ఇవ్వ‌డం.. బంగారు అంగ‌ళ్ల చావుకొచ్చింద‌ని సంబంధిత య‌జ‌మానులు ల‌బోదిబోమంటున్నారు.

ఇటీవ‌ల వివాహ‌మైన ఓ ఎస్పీకి పోలీస్‌శాఖ‌లో హోంగార్డు మొద‌లుకుని, అడిష‌న‌ల్ ఎస్పీ స్థాయి వ‌ర‌కూ అంద‌రూ బంగారు కానుక‌లు ఇవ్వ‌లేక ల‌బోదిబోమంటున్నారు. రాయ‌ల‌సీమ ప‌రిధిలో ఆ ఎస్పీ ప‌ని చేస్తున్నారు. ఉత్త‌రాదికి చెందిన స‌ద‌రు ఎస్పీకి ఇటీవ‌లే వివాహ‌మైంది. స‌ద‌రు ఎస్పీకి బంగారంపై మోజు ఎక్కువ‌. అందులోనూ కొత్త పెళ్లికొడుకు.

కొంద‌రు ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీలు త‌మ ప‌రిధిలోని బంగారు అంగ‌ళ్ల‌కు వెళ్లి, తోచిన రీతిలో కానుక‌లు స‌మ‌ర్పించుకున్న‌ట్టు తెలిసింది. అయితే ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా… ఉత్త‌రాది ప్రాంతానికి చెందిన ఎస్పీకి కానుక‌లు ఇవ్వ‌డం.. బంగారు అంగ‌ళ్ల చావుకొచ్చింద‌ని సంబంధిత య‌జ‌మానులు ల‌బోదిబోమంటున్నారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌కు చెందిన వాళ్లెవ‌రైనా ఏదైనా కొంటే, డ‌బ్బు ఏ మేర‌కు ఇస్తారో అంద‌రికీ తెలిసిందే.

త‌మ ద‌గ్గ‌ర బంగారు కానుక‌లు కొనుగోలు చేసి, అకౌంట్ రాసుకోమ‌ని చెప్పిన పోలీసు అధికారులు ఇటీవ‌ల కాలంలో బ‌దిలీ అయ్యారు. దీంతో బంగారు దుకాణ య‌జ‌మానులు ల‌బోదిబోమంటున్నారు. సెల్‌ఫోన్‌ల‌కు కాల్స్ చేస్తుంటే, డ‌బ్బు విష‌యం ప్ర‌స్తావించ‌గా ఫైర్ అవుతున్నార‌ని వాళ్లు ఆవేద‌న‌తో చెబుతున్నారు.

ఒక మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధి అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప్రాంతంలో ప‌ని చేస్తున్న ఎస్పీ గారి బంగారు కానుక‌ల గురించి పోలీస్‌శాఖ‌లో క‌థ‌లుక‌థ‌లుగా చెప్పుకుంటున్నారు.

7 Replies to “బాబోయ్‌… ఆ ఎస్సీకి బంగారం ఇవ్వ‌లేక చ‌స్తున్నాం!”

  1. ఇలాంటి వాటిలో మన ప్యాలెస్ పులకేశి గాడు బాగా ముదురు. వాడిని అడక్కపోయావా, ఎలా ప్యాలెస్ లో కూర్చుని రోజుకి వంద కోట్లు కమిషన్లు ఎలా బొక్కేసేవాడో అని ?

Comments are closed.