అయ్యో టీడీపీ.. వైసీపీనీ ముంచాల‌నే తాప‌త్ర‌యం!

ఎటూ తాము మునిగిపోయామ‌ని, పోతూపోతూ వైసీపీ మెడ కూడా ప‌ట్టుకుని వెంట తీసుకెళ్లాల‌ని టీడీపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది.

ఎటూ తాము మునిగిపోయామ‌ని, పోతూపోతూ వైసీపీ మెడ కూడా ప‌ట్టుకుని వెంట తీసుకెళ్లాల‌ని టీడీపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా ముస్లింల‌లో టీడీపీకి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చిందనే ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌కు మైనార్టీల ఓట్ల‌పై ఎటూ న‌మ్మ‌కం లేదు. అందుకే ఆ రెండు పార్టీలు మైనార్టీల ఓట్ల‌ను వ‌దిలేసుకుని, స‌నాత‌న ధ‌ర్మం పేరుతో హిందువుల ఓట్ల‌పై దృష్టి సారించాయి.

కానీ టీడీపీ ప‌రిస్థితి అలా కాదు. సెక్యుల‌ర్ పార్టీగా టీడీపీపై బ‌ల‌మైన ముద్ర వుంది. బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసినా, రాజ‌కీయ అవ‌స‌రాల రీత్యా చంద్ర‌బాబుకు త‌ప్ప‌డం లేద‌న్న సానుకూల వైఖ‌రితో ముస్లింలు టీడీపీకి అండ‌గా నిలిచారు. కానీ వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుపై మాత్రం ముస్లింలు సీరియ‌స్‌గా ఉన్నారు.

ఆ బిల్లుకు మ‌ద్ద‌తు ఇచ్చిన వాళ్ల‌ను త‌మ శ‌త్రువుగా వాళ్లు భావించే ప‌రిస్థితి. అందుకే వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ముస్లింల ఓట్ల‌న్నీ పోగొట్టుకుంటున్నామ‌నే భ‌యం టీడీపీని వెంటాడుతోంది.

ఈ నేప‌థ్యంలో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు వైసీపీ వ్య‌తిరేకంగా ఓట్లు వేసింది. కానీ రాజ్య‌స‌భ‌లో వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ప‌రిమ‌ల్‌ స‌త్వానీ మాత్రం కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశార‌ని, లోక్‌స‌భ‌లో వ్య‌తిరేకించి, పెద్ద‌ల స‌భ‌లో అనుకూలంగా వేశారంటూ టీడీపీ ప్ర‌చారం మొద‌లు పెట్టింది.

కానీ రాజ్య‌స‌భ‌లో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేకంగా తాను మాట్లాడిన అంశాన్ని ఆ పార్టీ నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి వీడియోతో స‌హా సాక్ష్యం చూపుతున్నారు. కానీ టీడీపీకి కావాల్సింది మాత్రం… వైసీపీ ఆ బిల్లుకు అనుకూల‌మ‌నే ప్ర‌చారం చేయ‌డం. త‌ద్వారా త‌మ‌తో పాటు వైసీపీపై కూడా ముస్లింల‌లో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే చిన్న ఆశ‌. ఇవ‌న్నీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం టీడీపీ ఆడుతున్న పొలిటిక‌ల్ గేమ్‌లో భాగంగానే చూడాలి.

15 Replies to “అయ్యో టీడీపీ.. వైసీపీనీ ముంచాల‌నే తాప‌త్ర‌యం!”

  1. Wakf board ఉన్న leka పోయిన majority ముస్లిం లకు ఒరిగేదేం లేదు. దాని ఆస్తి. 9 లక్షల ఎకరాలు ఆదాయం మాత్రం 9 కోట్లు పయిన పెద్దలు చక్కగా తింటున్నారు వాళ్ళకి ఇబ్బంది ఇది అంతే .ఆర్టికల్ 40 ప్రకారం వక్ఫ్ ఒక వేలా భూమి నాది అంటే ఆపే దిక్కు లేదు ఎవరికి . ఎవరు మద్దతు చేసిన దేశానికి మంచి జరుగుతుంది వక్ఫ్ పేరుతో దోపిడీ ఆగుతుంది ఇలాంటి విషయాల్లో కూడా ఓట్ల కోసం పాకులాడుతున్నారు రెండు పార్టీ లకి దేశం ఎలా పోయినా పర్లేదు .

  2. మీడియా కూడా ప్రతి దాన్ని ఓట్ల కోణం లో చూడ కూడదు. Triple Thalaq రద్దు. ఆర్టికల్ 370 రద్దు. Wakf board. ఇవన్నీ దేశం కోసం చేస్తున్న మంచి పనులు మరీ ఇలాంటి విషయాల్లో చిల్లర పనులు వద్దు . దేశం అంటూ ఉంటే అప్పుడు పార్టీ లు అయిన ఎవరయినా మీడియా కూడా బాధ్యత గా ఉండాలి . టీడీపీ ఒక పక్క మద్దతు ఇస్తూ ఇంకో పక్క ycp ఏదో తప్పు చేసినట్లు చూపడం రాంగ్ .చేసిన దాన్ని ధైర్యం గా చెప్పేట్లు ఉండాలి

  3. The Commission of Sati (Prevention) Act, 1987 అని పెడితే దాదాపు 1990 వరకు దేశం అంతా ర్యాలీలు చేసేవారు ప్రజలు వ్యతిరేకంగా…. సమాజంలో సంస్కరణలు ఎప్పుడు జరిగినా మొదట వ్యతిరేకత ఉంటది…. ట్రిపిల్ తలాక్ అప్పుడు, ఆర్టికల్ 370 అప్పుడు, అయోధ్య మందిరం అప్పుడు, NRC అప్పుడు వ్యతిరేకత వచ్చింది….. అన్నీ సరి అయినవి అర్ధం కావడానికి సమయం పట్టింది….పడుతుంది….

    1. ఒరేయ్ అడుక్కుని తినే వల్లా కి కూడా ఆత్మ గౌరవం ఉంటుంది . ఇలా కాదు రా . ఈ రోజు చదువు వస్తె హ్యాపీ గా జోమట్టో లో పని చేసుకోవచ్చ. ఇలా ఎందుకు రా. తల్లి తండ్రి ఎలా పెంచార్ర మిమ్మలని

  4. అయితే ముస్లిం ఓట్ల కోసం వక్ఫ్ బిల్లుకు వైసీపీ సపోర్ట్ చేసిందంటావ్..అంతేనా..

    మరి హిందూ ఓట్లు వదులుకోడానికి సిద్ధమైపోయినట్టున్నారు..

    ఇక మిమ్మల్ని ముంచడానికి కష్టపడడమెందుకు.. మిమ్మల్ని మీరే ముంచేసుకున్నారు.. కంగ్రాట్స్..

  5. నీకు అర్ధం కావటం లేదు 70% ఉన్న హిందువులు ఎక్కమతున్నారు దూరం అవుతారు వైసీపీ కి ఈసారి 11 కూడా రావు రానివ్వం జై హిందూ జై తెలుగుదేశం

Comments are closed.