చాన్నాళ్ల తర్వాత బయటకొచ్చాడు తారక్. ఓ సినిమా ఫంక్షన్ కు వచ్చిన ఎన్టీఆర్ ను చూసేందుకు అతడి అభిమానులు ఎగబడ్డారు. అతడ్ని చూసి ఒకింత షాక్ అయ్యారు.
తారక్ చాలా సన్నబడ్డాడు. ఎంతలా అంటే గతంలో యమదొంగ, కంత్రి సినిమాల కోసం ఎంతలా తగ్గాడో, ఇప్పుడు మరోసారి ఆ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈమధ్య కాలంలో ఎన్టీఆర్ ఇంతలా బక్కచిక్కడం ఇదే తొలిసారి.
ప్రశాంత్ నీల్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ఎన్టీఆర్. నీల్ సినిమాలో హీరోలంతా కండలతోనే కనిపించారు. సలార్ లో ప్రభాస్ అయినా, కేజీఎఫ్ లో యష్ అయినా స్క్రీన్ పై దిట్టంగానే ఉన్నారు. దీనికి విరుద్ధంగా డ్రాగన్ కోసం ఎన్టీఆర్ ను ఇలా స్లిమ్ గా మార్చేశాడు నీల్.
ఎన్టీఆర్ కొత్త లుక్ పై మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. కొంతమంది బాగుందంటుంటే, మరికొంతమంది మాత్రం ఎన్టీఆర్ ను మరీ అంత స్లిమ్ గా చూడలేమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఎన్టీఆర్ తన కొత్త సినిమా కోసమే ఇంతలా తగ్గాడా? డ్రాగన్ లో అతడు ఈ స్లిమ్ లోనే కనిపించబోతున్నాడా? అవునంటున్నారు చాలామంది. సినిమా కోసమే కష్టపడి ఇంతలా తగ్గాడని చెబుతున్నారు.
War movie ki taggadu le
జాయిన్ అవ్వాలి అంటే
అభిమానులు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ నువ్వు మాత్రం తెగ ఫీలైపోతున్నట్టున్నావు అంటే ఆయన స్లిమ్ గా ఉన్నది నీకు నచ్చలేదా ?
సినిమాను బట్టి ఆహార్యం మారిపోతూ ఉంటుంది .
నటులు కదా వారు ఎలా పడితే అలా మారుతుంటారు. దానికి ఇంతలా రచ్చ రచ్చ చేయాల్నా ? గ్యాస్ ఆంధ్ర.