ఏ సంస్థకు అయినా, అది సినిమా నిర్మాణ సంస్థ కావచ్చు, కార్పొరేట్ సంస్థ కావచ్చు. ఆతిధ్యం అన్నది తప్పని సరి. వాళ్ల వాళ్ల వ్యాపారాలకు సంబంధించిన గెస్ట్ లు వస్తుంటారు. వాళ్ల కోసం హోటళ్లలో రూమ్ లు బుక్ చేస్తుంటారు. పెద్ద కంపెనీలకు అయితే స్వంత స్వంత గెస్ట్ హౌస్‌లు ఉంటాయి. ఇది కామన్.
అయితే టాలీవుడ్ లోని ఓ ప్రొడక్షన్ హౌస్ ఇలా రెండు రూమ్ లు గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ స్టార్ హోటల్ లో రిజర్వ్ లో ఉంచుకుంది. ముందే చెప్పినట్లు అదేమీ కొత్త కాదు వింత కాదు. కానీ ఈ గదులకు వచ్చే అతిధులు ఎక్కువగా ముంబాయి నుంచే వస్తున్నారని, వారికి విశేష అతిధి మర్యాదలు జరుగుతున్నాయని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇలా వచ్చే వారు కేవలం ఆ సంస్థకు ఆర్థికంగా వెన్ను దన్నుగా వుండడమే కాకుండా, ఓటిటి అమ్మకాల విషయంలో మాట సాయం చేయడం, ఇంకా ఇతరత్రా పనులు ఏమైనా వుంటే సాయం చేయడం వంటివి చేస్తారని, వారికి వున్న పలుకుబడి ఈ సంస్థకు అన్ని విధాలా ఉపయోగపడుతోందని, అందువల్లే వారికి ఈ హోటల్లో సకల రాజభోగాలు అందిస్తున్నారని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.
ఈ రాజభోగాలు అందివ్వడం వృధా పోవడం లేదని, చాలా బలమైన ప్రయోజనాలు కలిగాయని, కలుగుతున్నాయని తెలుస్తోంది. కేవలం ఆర్థిక అండదండలు ఇవ్వడం, అరేంజ్ చేయడం అన్నది ఒక లాభం అయితే, అంతకు మించి అవసరమైన పనులు చక్కబెట్టడం ద్వారా గత ఏడాది సదరు సంస్థ మంచి పేరు ప్రతిష్టలు ఆర్జించేలా చేసారనే టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ లో.
మీకు కావాల్సింది నా dp లొ వుంది
ఇంట్రెస్ట్ వుంటే నా డీపీ చూడండి