సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికిందర్ సినిమా రంజాన్ కానుకగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజు తొలి ఆటకే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. స్వయంగా సల్మాన్ ఫ్యాన్స్, సినిమా ఫ్లాప్ అంటూ పోస్టులు పెడుతున్నారు. బోరింగ్ స్క్రీన్ ప్లే అంటూ రివ్యూలిస్తున్నారు. సల్మాన్ కెరీర్ లో ఈ సినిమా మరో ఫ్లాప్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే ఇక్కడ మేటర్ సల్మాన్ గురించి కాదు. రష్మిక గురించి. భారీ విజయాలతో దూసుకుపోతున్న రష్మిక బాలీవుడ్ కెరీర్ కు ఇదొక పెద్ద స్పీడ్ బ్రేకర్. సికిందర్ ఆమె జోరుకు బ్రేకులేశాడు.
బాలీవుడ్ లో అడుగుపెట్టిన తక్కువ టైమ్ లోనే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది రష్మిక. ఆమె నటించిన పుష్ప-2, హిందీలోనే కాదు, ఆలిండియాలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక యానిమల్ సినిమా అయితే మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా వచ్చిన ఛావా కూడా రష్మిక కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ అనిపించుకుంది.
ఇలా వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్న రష్మికకు సికిందర్ సినిమాతో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఔట్ డేటెడ్ స్టోరీ ఆమెకు ఏమాత్రం కలిసిరాలేదు. దీనికితోడు విడుదలకు ముందే సినిమా ఆన్ లైన్లో లీక్ అవ్వడం మరో పెద్ద దెబ్బ.
ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో సల్మాన్ అభిమానులు చాలా తక్కువ అంచనాలతో సినిమాకు వెళ్లారు. ఆ అంచనాల్ని కూడా సికిందర్ అందుకోలేకపోయింది.
కథలో దమ్ము ఉంటే రష్మిక ఉన్నా రమ్యకృష్ణ ఉన్నా
జనం చూస్తారు. అంతేకానీ కథ బాగాలేక పోతే ఎవ్వరు వున్నా చూడరు.