నెరవేరిన మెగా తనయ కోరిక

తన కూతురు తనతో సినిమా చేయాలని సరదా పడుతున్న సంగతి చెప్పి, మెగాస్టార్ ఈ మేరకు మార్గం సుగమం చేసారు.

తన తండ్రి మెగాస్టార్ తో సినిమా చేయాలన్నది మెగా తనయ సుష్మిత కోరిక. ఇది ఎప్పటి నుంచో వార్తల్లో వినిపిస్తూ వస్తోంది. ఇప్పటికి తీరింది. మెగా తనయ తన తండ్రితో సినిమా తీయాలని ఓ కథ ఓకె చేసి పెట్టుకున్నారు. బివిఎస్ రవి కథ అది. దానికి దర్శకుడు కావాలి.

మెగాస్టార్ అందుకోసం ఒక్కొక్కరినీ పిలవడం, డిస్కషన్లు పెట్టడం, కొన్నాళ్లు ఆ కథను పట్టుకుని, వాళ్ల స్టయిల్ స్క్రీన్ ప్లే తయారు చేయడం, నచ్చలేదని పక్కన పెట్టడం అలా జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఒక దశలో మోహన్ రాజా ఫిక్స్ అనుకున్నారు. కానీ ఆయనా వెనక్కు వెళ్లిపోయారు.

అసలు సైరా సినిమా అనుభవంతో స్వంత ప్రొడక్షన్ చేయడం అన్నది మెగాస్టార్ కు అంతగా ఇష్టం లేదని, కుమార్తె కోరిక కాదనలేక అలా వెనక్కు వెనక్కు నెట్టుకు వస్తున్నారని ఫీలర్లు కూడా వినిపించాయి. ఈ క్రమంలో అనిల్ రావిపూడి సినిమా సెట్ అయింది. సాహు గారపాటి నిర్మాణం. ఇప్పుడు ఈ సినిమాకు మెగా తనయ సుష్మిత స్వంత బ్యానర్ ‘గోల్డ్ బాక్స్’ ను యాడ్ చేసారు. ఈ మేరకు సినిమా లాజిస్టిక్స్ మాట్లాడుకునేటప్పుడే డిసైడ్ చేసారు.

తన కూతురు తనతో సినిమా చేయాలని సరదా పడుతున్న సంగతి చెప్పి, మెగాస్టార్ ఈ మేరకు మార్గం సుగమం చేసారు. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలోని సినిమాను సాహ గారపాటి నిర్మిస్తారు. సుష్మిత కూడా భాగస్వామిగా వుంటారు. లాభాలు చెరిసగం తీసుకుంటారు.

4 Replies to “నెరవేరిన మెగా తనయ కోరిక”

  1. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలోని సినిమాను సాహ గారపాటి నిర్మిస్తారు. సుష్మిత కూడా భాగస్వామిగా వుంటారు. లాభాలు చెరిసగం తీసుకుంటారు. నష్టం మాత్రం సాహ గారపాటి ఒక్కరే తీసుకుంటారు

Comments are closed.