నష్టపోయింది సురేష్ బాబే కదా?

ఆ స్థలం చాలా విలువైనది, ప్రభుత్వం తీసుకుంటే ఏ స్టార్ హోటల్ కు అయినా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది.

విశాఖలో రామానాయుడు స్టూడియో వ్యవహారంపై ప్రభుత్వం ముందు అడుగు వేసింది. ఆ స్టూడియోకి ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో కొంత మేరకు లేఅవుట్ గా మార్చే వ్యవహారం జగన్ ప్రభుత్వ హయాంలో జరిగింది. అది ఇప్పుడు రివర్స్ చేసి, ప్రభుత్వం వెనక్కు తీసుకోవడానికి చర్యలు చేపడుతున్నారు. అసలు ఈ వ్యవహారం ఏమిటి? పూర్వాపరాలు చూస్తే.

విశాఖలో అద్భుతమైన పాయింట్ లో, బీచ్ కు ఎదురుగా వున్న కొండను చంద్రబాబు హయాంలో రామానాయుడు స్టూడియోకి ఇచ్చేసారు. అది దాదాపు 35 ఎకరాలు. ఎకరా జస్ట్ అయిదు లక్షల ఇరవై వేల వంతున స్టూడియో నిర్మాణం అని చెప్పి ఇచ్చేసారు. అప్పటికే అక్కడ ఎకరా విలువ కోటి పైనే. పైగా బీచ్ ఎదురుగా ఓ కొండ అంటే ఎంత క్రేజీగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఆ కొండకు రోడ్ వేసి, జస్ట్ కొన్ని భవనాలు నిర్మించి అలా వదిలేసారు. పెద్దగా షూటింగ్ లు జరిగిందీ లేదు. సముద్రం ఎదురుగా భవనాలు నిర్వహించడం అంటే అంత సులువు కాదు. మెయింటెనెన్స్ చాలా కష్టం. అందుకే పెద్దగా శ్రద్ద పెట్టలేదు. పేరుకు అలా వుంది.

ఇలాంటి టైమ్ లో జగన్ సిఎమ్ గా వచ్చారు. ఆయనకు బీచ్ ఎదురుగా ఇల్లు కట్టుకోవాలనిపించింది. ఆయనేమీ అన్యాయంగా లాగేసుకోవాలని అనుకోలేదు. తెలివిగా ఓ ప్లాన్ వేసారు. హైదరాబాద్ లో ఎలా అయితే కొన్ని స్టూడియోలను వేరే ప్రయోజనాలకు వాడుకునేందుకు అనుమతులు ఇచ్చారో అదే విశాఖలో వాడారు. గతంలో హైదరాబాద్ రెండు స్టూడియోలకు ఇచ్చిన భూములను ఇతర అవసరాలకు వాడుకునేలా అనుమతులు ఇచ్చారు. అప్పుడు ఏ అభ్యంతరం రాలేదు.

జగన్ ఇదే స్కీమును మరి ఎలా మాట్లాడారో, ఎవరు మాట్లాడారో, ఎవరితో మాట్లాడారో తెలియదు కానీ మొత్తానికి ఒప్పించారు. ఖాళీగా వున్న 15 ఎకరాల కన్వర్షన్ కు దరఖాస్తు చేయించేసారు. చకచకా ఫీజులు కట్టారు. అనుమతులు వచ్చాయి. నిజానికి ఇది సురేష్ బాబుకు లాభసాటి బేరం. ఎప్పుడో ఎకరా అయిదులక్షల వంతున కొనుక్కున్న భూములు. జగన్ కూడా కొంత భూమి కొనుక్కునేందుకే అడిగారు. పోనీ ఆయన ఓ ఎకరా భూమి తక్కువ రేటుకు కొనేసుకుంటేరేమో అనుకున్నా, మిగిలిన 14 ఎకరాలు సురేష్ బాబే అమ్ముకుంటారు. లాభం ఆయనకే.

కానీ ఈ లోగా లోకల్ తెలుగుదేశం జనాలు దీని మీద యాగీ ప్రారంభించారు. కోర్టుకు వెళ్లారు. జగన్ తీసేసుకుంటున్నారు స్టూడియో భూములు అంటూ ప్రచారం జరిగిపోయింది. తెర వెనుక వైనం ఎవరికీ తెలియదు కనుక అదే ప్రచారం సాగింది. మొత్తం మీద వ్యవహారం ఆగింది.

ఇప్పుడు ప్రభుత్వం అలా కన్వెర్షన్ కు ఎందుకు దరఖాస్తు చేసారు, స్టూడియో అంటే స్టూడియోనే కదా. మీ స్టూడియోకి అక్కర లేదు అంటే ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుంది అని నోటీస్ ఇవ్వబోతోంది. ఇప్పుడు ఆ స్థలం చాలా విలువైనది, ప్రభుత్వం తీసుకుంటే ఏ స్టార్ హోటల్ కు అయినా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. అందువల్ల ప్రభుత్వం అవసరం అయితే వెనక్కు తీసుకుంటా అంటోంది. ఎందుకు తీసుకోకూడదో కారణం చెప్పమని రామానాయుడు స్టూడియోస్ కు షోకాజ్ నోటీస్ ఇవ్వబోతోంది.

దీని వల్ల ఏమీ జరిగిపోదు. సురేష్ బాబుకు తెలుగుదేశం పెద్దలతో డైరక్ట్ యాక్సెస్ వుంది కనుక స్టూడియో స్థలాన్ని నిలబెట్టుకుంటారు. కానీ ఎప్పటికీ అలా ఖాళీగా వుంచుకోవాల్సిందే. అమ్ముకోవడం అన్నది ఇక ఎప్పటికీ జరగదు. భవిష్యత్ లో చేయాలన్నా, ప్రతిపక్షం అడ్డు పడుతుంది. కోర్ట్ తీర్పులు అడ్డం పడతాయి.

అలా అని స్టూడియో ఎక్స్ పాన్షన్ అన్నది కూడా అయ్యేది కాదు. ఎందుకంటే స్టూడియోలు అంత లాభదాయకం కాదు. ముఖ్యంగా విశాఖలో. అందుకే ఎవరూ పెద్దగా అటెంప్ట్ చేయడం లేదు. ఎప్పుడో జస్ట్ కోటి రూపాయిలు ఖర్చు చేసిన ప్రాపర్టీ. పెద్ద అమౌంట్ కాదు. అలా వుంచుకోవడమే.

భవిష్యత్ లో ఏ విధంగా మార్చాలన్నా పాత కథలు అన్నీ బయటకు వస్తాయి. బండి ముందుకు జరగదు. నిజానికి జగన్ ఉభయకుశలోపరి లాంటి పథకం వేసారు. దాని వల్ల జగన్ కే బ్యాడ్ నేమ్ వచ్చింది. సురేష్ బాబుకు మంచి డీల్ పోయింది.

26 Replies to “నష్టపోయింది సురేష్ బాబే కదా?”

  1. ///పోనీ ఆయన ఓ ఎకరా భూమి తక్కువ రేటుకు కొనేసుకుంటేరేమో అనుకున్నా, మిగిలిన 14 ఎకరాలు సురేష్ బాబే అమ్ముకుంటారు. లాభం ఆయనకే.////

    .

    అయ్యొ! పాపం ఒక్క ఎకరం కొనుకుందాం అని కన్వెర్షన్ కి అనుమతి ఇచ్చారా? అయ్యొ! అయ్యొయ్యొ!!!

    చివరికి ఆ 14 ఎకరాలు కూడా ఎవరి కాతాలొకి వెల్తాయొ తమరికి తెలీదా గురువిందా???

    .

    KV రావు లాంటి వాడె ఎమి చెయలెక వెల కొట్ల విలువ చెసె కాకినాడ SEZ/Port అప్పగిస్తె, ఈ సురెష్ బాబు ఎమన్న పీకగలడా???

    1. aa prbhthyam .. ee prabhuthyam antto emi ledu . andaru chesedi ide lol

      raaghavendra rao Hyd lo chesindi enti .. antha enduku banglore appolo BG road hospital got the land for cancer research and built commercial hospital

  2. “ఇలాంటి టైమ్ లో జగన్ సిఎమ్ గా వచ్చారు. ఆయనకు బీచ్ ఎదురుగా ఇల్లు కట్టుకోవాలనిపించింది. ఆయనేమీ అన్యాయంగా లాగేసుకోవాలని అనుకోలేదు. తెలివిగా ఓ ప్లాన్ వేసారు”…omg, che ddi batch now writing articles without even an ounce of shame…sad

    1. ///ఆయనేమీ అన్యాయంగా లాగేసుకోవాలని అనుకోలేదు. తెలివిగా ఓ ప్లాన్ వేసారు///

      .

      Ha! Ha!! LoL!!!

      మరి అన్యాయంగా లాక్కొవటం అంటె ఎమిటొ???

      1. CBN allotted 800 acres to binami company just before 2004 election .

        so many people who got the land from CBN utilizing different purpose like Raghavenndra rao .

        it is big business in all the states . Bangalroe BG road Apollo got the land for cancer research ( subsidize price) but constructed private hospital .

  3. If tdp govt give that permission then all ethics, castes corruption will come into play. If tdp taking it back from suresh babu you should support it not opposing.

Comments are closed.