తిరుప‌తి జ‌న‌సేన ఎమ్మెల్యే మ‌న‌సు మారుతోంది!

ఆర‌ణి శ్రీ‌నివాసులు మ‌న‌సు మెత్త‌బ‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం… రానున్న రోజుల్లో కూట‌మి మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం లేక‌పోవ‌డ‌మే

తిరుప‌తి జ‌న‌సేన ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు మ‌న‌సు మారుతోంద‌ని న‌గ‌రంలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. టీడీపీ, వైసీపీ, పీఆర్పీ త‌ర‌పున ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా అధ్య‌క్షుడిగా ప‌ని చేసిన ఏకైక నాయ‌కుడిగా ఆర‌ణి శ్రీ‌నివాసులుకు గుర్తింపు వుంది. రాజ‌కీయ వాతావ‌ర‌ణ మార్పును అనుస‌రించి ఆయ‌న కూడా త‌న‌ను తాను మార్చుకుంటూ వుంటారు. సూర్య భ‌గ‌వానుడి న‌డ‌క అనుస‌రించి పొద్దుతిరుగుడు పువ్వు తిరుగుతూ వుంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. అది ప్ర‌కృతి ధ‌ర్మం.

అయితే ఆర‌ణి శ్రీ‌నివాసులు నిత్యం అధికార ప‌క్షాన్నే వుండాల‌ని కోరుకోవ‌డం రాజ‌కీయ ధ‌ర్మ‌మ‌ని ఆచ‌రణ‌లో చూపుతుంటారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చి ప‌ది నెల‌ల‌వుతోంది. అప్పుడే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. అంద‌రి కంటే ముందుగా ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోవ‌డంలో ఆర‌ణి శ్రీ‌నివాసులు దిట్ట‌. అందుకే ఆయ‌న్ను రాజ‌కీయ వైద్యుడిగా కూడా ముద్దుగా పిలుచుకుంటుంటారు. ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా తిర‌గ‌కుండానే, వాళ్ల మ‌న‌సును చ‌ద‌వ‌డంలో ఆర‌ణి ఆరితేరార‌ని జ‌న‌సేన శ్రేణులు చెబుతుంటాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థుల‌పై రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డ‌మెందుక‌ని స‌న్నిహితుల వ‌ద్ద ఆయ‌న అంటున్నారు. రానున్న రోజుల్లో వైసీపీలో చేర‌డానికి ఇప్ప‌టి నుంచే ఆయ‌న గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుతోంది. త‌న కుమారుడు ఆర‌ణి మ‌ధును వైసీపీ త‌ర‌పున ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి నిల‌బెట్టాల‌నే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందుకే వైసీపీ ముఖ్య నాయ‌కుల‌తో ఆయ‌న లోలోప‌ల స‌న్నిహితంగా ఉన్నార‌నే చ‌ర్చ తిరుప‌తిలో విస్తృతంగా సాగుతోంది.

మ‌రీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై టీటీడీ మాజీ చైర్మ‌న్‌, మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి రెండురోజుల‌కోసారి ప్రెస్‌మీట్స్ పెట్టి విరుచుకుప‌డుతుంటారు. కానీ భూమ‌న‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు ఆర‌ణి సాహ‌సించ‌డం లేదని తిరుప‌తి న‌గ‌రంలో విస్తృతంగా చ‌ర్చ జరుగుతోంది. భూమ‌నపై విమ‌ర్శ‌లు చేస్తే, వైసీపీలోకి భ‌విష్య‌త్‌లో ప్ర‌వేశం ఉండద‌నే భ‌యంతోనే ఆర‌ణి ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తిరుప‌తిలో ఏ ఇద్ద‌రు క‌లిసినా మాట్లాడుకుంటున్నారు.

ఆర‌ణి శ్రీ‌నివాసులు మ‌న‌సు మెత్త‌బ‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం… రానున్న రోజుల్లో కూట‌మి మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం లేక‌పోవ‌డ‌మే అని జ‌న‌సేన శ్రేణులు అంటున్నాయి. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన ఆర‌ణి శ్రీ‌నివాసులు ప్ర‌త్య‌ర్థుల‌పై నోరు మెద‌ప‌డం లేదంటే, ఆయ‌న అంచ‌నానే స‌రైంద‌ని అనుచ‌రులు సైతం గుస‌గుస‌లాడుకుంటున్నారు. రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు.

11 Replies to “తిరుప‌తి జ‌న‌సేన ఎమ్మెల్యే మ‌న‌సు మారుతోంది!”

  1. ఇదే వ్యక్తి 2024 ఎన్నికలకు ముందు జనసేన లోకి మారినప్పుడు.. అతని అవినీతి, అరాచకాల మీద మన వెబ్సైటు లో ఎన్నెన్ని ఆర్టికల్స్ గుప్పించేశామో.. గుర్తు లేదనుకుంటా మీకు..

    అప్పుడు పని చేయలేదా తమరి.. బల్లి జ్యోతిష్యం..?

    ఇప్పుడు భూమన కరుణాకర రెడ్డి ని తిట్టడం లేదని.. 4 ఏళ్ళ తర్వాత వచ్చే ఎన్నికలకు లింక్ కలిపేసి.. మళ్ళీ జగన్ రెడ్డి వచ్చేస్తున్నాడు అని భజన మొదలెట్టేశావా..?

    మరి 2024 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి దిగిపోతున్నాడని ఎందుకు రాయలేదు.. తమరు..?

    ..

    ఈ చిలక జోస్యాలు, బల్లి జ్యోతిష్యాలు, కాకి అరుపులు, హస్త సాముద్రికాల మీద ఆధార పడకుండా..

    జగన్ రెడ్డి ని నిజాలు మాట్లాడుతూ నిజాయితీగా రాజకీయం చేయమని సలహా ఇవ్వండి.. ప్రతిపక్ష హోదా అయినా సాధించొచ్చు..

  2. పిచ్చి GA…..దీనిలో నీ యేడుపు కన్నా మీ bhumana యేడుపే యెక్కువ కనిపిస్తోంది….😂😂😂

  3. ga .. నీకు చిన్న సలహా .. అప్పుడు అప్పుడు అద్దం మందు నిలబడుతూ ఉండు ..సిగ్గు ఉండాలి ..

  4. Arani srinivasulu lost in 2009 & 2014..sarajakiya vaidhyudu, prajala manassulu gelichina dhitta ayithe endhuku odipoyadu… there were local issues with janasena Cadre ever since he joined the party…

Comments are closed.