మంత్రి నారా లోకేశ్ తీరుపై టీడీపీ సీనియర్లు మండిపడుతున్నారు. ఎంతసేపూ రెడ్‌బుక్ నామస్మరణే తప్ప, అధికారంలో ఉండగా కార్యకర్తలకు, నాయకులకు ఏదైనా మంచి చేద్దామన్న ఆలోచనే కొరవడిందని విమర్శిస్తున్నారు. అందుకే అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు బలవన్మరణానికి పాల్పడాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ఐటీడీపీ ఉపాధ్యక్షుడు వేల్పుల వెంకటేశ్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం టీడీపీలో కలకలం రేపుతోంది. లోకేశ్‌ను ఉద్దేశించి ఆయన ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషమే తప్ప, ఇంకేం లేదని అతను వాపోయాడు. టీడీపీని నమ్ముకుని చాలా నష్టపోయినట్టు ఆ వీడియోలో పేర్కొనడం గమనార్హం. చివరికి రాయితీ రుణానికి దరఖాస్తు చేసుకున్నా టీడీపీ నాయకులెవరూ సహకరించలేదని అతని వేదన.
కొంతకాలం క్రితం భార్యాపిల్లలతో కలిసి లోకేశ్‌ను అతను కలిశాడు. తన ఆర్థిక ఇబ్బందుల గురించి మొరపెట్టుకున్నాడు. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. దీంతో అతను చావే శరణ్యమని …ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి, అతన్ని కిందికి దింపారు. కానీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు.
రెడ్‌బుక్ గురించి తప్ప, కార్యకర్తల శ్రేయస్సుపై లోకేశ్ దృష్టి సారించి వుంటే, ఇవాళ వెంకటేశ్‌కు ఈ దుస్థితి వచ్చి వుండేదా? అనే ప్రశ్న ఎదురవుతోంది. మరీ ముఖ్యంగా తనను కలిసిన తర్వాత కూడా వెంకటేశ్‌ను లోకేశ్ ఆదుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంకటేశ్ సెల్ఫీ వీడియోలో చెప్పిన విషయాలు… ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలను ప్రతిబింబిస్తున్నాయని అంటున్నారు. చాలా మంది వెంకటేశ్‌లా ఆత్మహత్యా యత్నానికి పాల్పడలేదని, కానీ ఆర్థిక పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయని అంటున్నారు. ఇలాగైతే టీడీపీ కేడర్ నుంచి ముఖ్యంగా లోకేశ్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హాయ్
వ్యక్తిగత ఆర్దిక ఇబ్బందులు ఎ పార్టి నాయకుడూ తీర్చలెరు. ఇది ఎవరికి వారు మాత్రమె చొసుకొవాల్సిన అంశం!!
ఇదే మంచి చాన్స్.
తాడేపల్లి ప్యాలెస్ నీ అతనికి రాసేసి తాను ఏంటి అనేది ప్రూవ్ చేయాలి , ప్యాలెస్ పులకేశి.
first year lo extralu chesina y c p vadvalni bend teeayadame first target..
జాన్ బెన్ని లింగం ఎవరు???
వూచకొతె.. అన్న ఈయనకి Y.-.C.-.P కి సంబందం ఎమిటి? ఒక ఆర్టికల్ రాసి నిగ్గు తెల్చె దామ్ముందా?
కుల మత ప్రతీఎయ విద్వాషాలు రెచ్చకొట్టటం మీద పెట్టిన శ్రద్ద రాష్ట్ర పెట్టుబడుల మీద పెట్టి ఉంటె జగన్ ఎప్పుదొ బాగు పడెవాడు అంటవా?
greatandhra you should have given this type of lectures to your JAGAN GORU BABAI MURDER HOW HE IS TREATING HIS OWN MOTHER AND SISTER