డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ వస్తోంది

పార్ట్-3ని వీలైనంత తక్కువ బడ్జెట్ లో పూర్తిచేసి విడుదల చేయాలని నిర్ణయించారు.

సూపర్ హిట్టయిన సినిమాలకు మాత్రమే సీక్వెల్స్ వస్తాయి. ఫ్లాప్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావు. ఒకవేళ విడుదలకు ముందు సీక్వెల్ ప్రకటించినప్పటికీ, డిజాస్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత సీక్వెల్ ఆలోచనల నుంచి తప్పుకుంటారు. అయితే భారతీయుడు-3 పరిస్థితి వేరు.

భారతీయుడు-2 పెద్ద ఫ్లాప్ అయినా భారతీయుడు-3 తీయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు. దీనికి కారణం పార్ట్-3 షూటింగ్ చాలా భాగం పూర్తవ్వడమే.

పార్ట్-2తో పాటే, పార్ట్-3 షూటింగ్ కూడా పూర్తి చేశారు. గతంలో మేకర్స్ ఇచ్చిన సమాచారం ప్రచారం భారతీయుడు-3 షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయింది. సో.. మిగతా 30 శాతం షూట్ పూర్తిచేస్తే, సినిమా సిద్ధమైనట్టే.

అయితే ఈ 30 శాతం పూర్తిచేయడానికి కూడా కండిషన్స్ పెట్టింది నిర్మాణ సంస్థ లైకా. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఈ సంస్థపై ఒక దశలో దివాళా తీసిందనే పుకార్లు కూడా వచ్చాయి.

మొత్తానికి పార్ట్-3ని వీలైనంత తక్కువ బడ్జెట్ లో పూర్తిచేసి విడుదల చేయాలని నిర్ణయించారు. శంకర్ ప్రతిపాదించిన ఓ ఖరీదైన పాటను కూడా పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. కమల్ హాసన్ ఈ సినిమాకు నెల రోజులు కాల్షీట్లు కేటాయించాల్సి ఉంది. ఆ స్పష్టత వచ్చిన తర్వాత సినిమా ప్రకటన చేస్తారు.

3 Replies to “డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ వస్తోంది”

  1. ఏమి చేసినా భారతీయుడు 2 చూసిన అతి కొద్ది మంది ప్రేక్షకులు చేసిన ప్రచారం వల్ల ఫ్రీగా మూవీ వేసినా చూసే పరిస్థితి లేదు

Comments are closed.