“ఎప్పటికైనా ప్రేమదే అంతిమ విజయం”… త్రిష ఈ ట్వీట్ పెట్టి దాదాపు వారం రోజులు అవుతోంది. ఆమె ఏ ఉద్దేశంతో ఈ పోస్టు పెట్టిందనేది ఆమెకు మాత్రమే తెలుసు. కానీ జనం మాత్రం అది ఆమె ప్రేమ పెళ్లికి సంబంధించిన మేటర్ అని దాదాపు ఫిక్స్ అయిపోయారు.
ఎంతలా అంటే, ఇన్ని రోజులు గడిచినప్పటికీ ఇంకా త్రిష పెళ్లిపై కథనాలు, చర్చలు కోలీవుడ్ లో ఆగలేదు. త్రిష మనసులో ఉన్న ఆ అజ్ఞాత ప్రేమికుడు ఎవరంటూ తమిళనాట చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి.
41 ఏళ్ల త్రిషపై పెళ్లి పుకార్లు ఇప్పుడు కొత్తగా వస్తున్నవేం కాదు. ఆ మాటకొస్తే, దశాబ్ద కాలంగా ఆమె ప్రేమ-పెళ్లిపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. రానా, ప్రభాస్ లాంటి హీరోల పేర్లు కూడా తెరపైకొచ్చిన సందర్భాలున్నాయి.
అయితే ఏళ్లు గడుస్తున్నా త్రిష మాత్రం ఓపెన్ అవ్వలేదు. పెళ్లిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సెకెండ్ ఇన్నింగ్స్ లో ఆమె మరింత క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఆటోమేటిగ్గా ఆమె పెళ్లిపై మరోసారి పుకార్లు మొదలయ్యాయి. త్రిష మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.
హాయ్
ఆ ట్వీట్ లోనే పేరుంది.. మరోసారి చదువు
Antha ipoinaaa tharuvatha pelli pukaarlu yendhuku olfaaaa media