అలా చెప్పుకోవాలంటే సీఎం పీఠం కావాలి ప‌వ‌న్!

హోం మంత్రి ప‌ద‌వి తీసుకోలేక కాదు, శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అదుపులో పెట్ట‌లేక కాదు.. యోగి ఆదిత్య‌నాథ్ లా రెచ్చిపోలేక కాదు.. అంటూ రంకెలు వేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ను చూస్తే.. ఇంకెన్నాళ్లు ఇవే ప్ర‌గ‌ల్బాలు…

హోం మంత్రి ప‌ద‌వి తీసుకోలేక కాదు, శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అదుపులో పెట్ట‌లేక కాదు.. యోగి ఆదిత్య‌నాథ్ లా రెచ్చిపోలేక కాదు.. అంటూ రంకెలు వేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ను చూస్తే.. ఇంకెన్నాళ్లు ఇవే ప్ర‌గ‌ల్బాలు అనే ప్ర‌శ్న కూడా ఉత్ప‌న్నం అవుతూ ఉంది.

ఇద్ద‌రు ఎంపీల‌ను ఇచ్చి ఉంటే.. పార్లమెంట్ ను గ‌డ‌గడ‌లాడించే వాడిని, విశాఖ ఉక్కు సంస్థ అమ్మ‌కాన్ని అపేవాడిని, క‌నీసం న‌న్ను గెలిపించి ఉన్నా..అసెంబ్లీలో విజృంభించేవాడిని.. అంటూ గ‌త ఐదేళ్ల‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ బోలెడన్ని క‌బుర్లు చెప్పారు! ఇప్పుడు ఆయ‌న పార్టీకి ఎమ్మెల్యేలున్నారు, ఎంపీలున్నారు! అయితే.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అర్జెంటుగా హోంమినిస్ట్రీ కావాలి! శాంతిభ‌ద్ర‌త‌ల అంశం చ‌ర్చగా మారింది కాబ‌ట్టి, కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి కాబ‌ట్టి.. ఇప్పుడు ఇలా!

లేస్తే మ‌నిషిని కాదు .. అంటూ సంత‌లో రెచ్చిపోయేవ్య‌క్తి తీరున ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు కొన‌సాగుతూ ఉంది. ఎమ్మెల్యేలు లేన‌ప్పుడు త‌న‌ను గెలిపించి ఉంటే అని, ఎంపీలు లేన‌ప్పుడు త‌న‌కు ఎంపీల‌ను ఇచ్చి ఉంటే అని, ఇప్పుడు తీరా అధికారంలోకి వ‌చ్చాకా.. హోంమంత్రి అయ్యుంటేనా.. అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లుకుతున్నారు!

అయినా హోంమంత్రి ప‌ద‌వి తీసుకోలేక కాదు అంటాడేమిటి? ఫ‌లానా మంత్రి ప‌ద‌వి అంటూ ఎవ్వ‌రూ తీసుకోరు. రాజ్యాంగం ప్ర‌కారం మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వారికి సీఎం హోదాలోని వ్య‌క్తి శాఖ‌ల కేటాయింపు చేస్తారు! సీఎం హోదాలో చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పంచాయ‌తీ రాజ్ శాఖ‌ను కేటాయించారు. ఇప్ప‌టిక‌ప్పుడు ప‌వ‌న్ హోంమంత్రి కావాల‌న్నా ప‌వ‌న్ కు ఆ శాఖ‌ను కేటాయించాల్సింది సీఎమ్మే! అలాగే హోం మంత్రి కాగానే యోగి ఆదిత్య‌నాథ్ లా అని చెప్పుకోలేరు! అలా చెప్పుకోవాలంటే సీఎం ప‌ద‌వే కావాలి ప‌వ‌న్ సార్!

18 Replies to “అలా చెప్పుకోవాలంటే సీఎం పీఠం కావాలి ప‌వ‌న్!”

  1. నాకే ఉండుంటే….?

    నాకే ఒక ఎంపీ సీట్ ఉండుంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని ఒక్క చేత్హో ఆపేసేవాడిని..

    నాకే ఒక మ్మెల్యే సీట్ ఉండుంటే.. సుగాలి ప్రీతీ ని రేప్ చేసిన వాళ్ళని ఉరేయించేసే వాడిని..

    నాకే ఒక సర్పంచ్ సీట్ ఉండుంటే.. ఒక ఊరిని పూర్తిగా మార్చేసే వాడిని..

    అన్నీ వచ్చాక మూలాన ఉన్న ముసలమ్మా లా కూర్చుంటా…

  2. మెజారిటీ ఎంపీలని ఇస్తే మెడలు వొంచుతా అని చెప్పుకునితిరిగి .. 22 మందిని ఇస్తే .. ప్రతిదానికి చేతులు ఎత్తేసినోడి గురించి కూడా రాయి గ్రేట్ ఆంధ్ర .. అప్పుడు నీ రాతలకి విలువ ఉంటది .. లేక పోతే నువ్వు యాక్చి కి తమ్ముడివి ..

  3. మీకు అర్థం కావట్లేదా… లేక నటిస్తున్నారా? ఎవరినీ ఉపేక్షించకండి… దూల తీర్చేయండి అని చెప్తున్నారు.

  4. మా సిక్కోలు సింగం అచ్చెన్న పాపం ఎంత ముచ్చట పడ్డారో ఈ హోం మంత్రి పదవి కోసం, ఆయన కే ఇచ్చి ఉంటే ఒక్కొక్కడికి దూల తీరి దుకాణం బంద్ అయ్యేది. బాబు గారు చేసిన స్మాల్ మిస్టేక్ అనుకుందాం మరి

  5. మీ పార్టీ MLA పంతం నానాజీ అనే వాడు కాకినాడ ప్రభుత్వ వైద్య కళాశాల లో దౌర్జన్యం చేసినపుడు ఏమీ

    పికావు DCM అప్పుడు నీ నోరు లేవలేదు. ,

    నీ పార్టీ MLA నే అదుపులో పెట్టుకోలేని నీవు కూడా హోం మంత్రి గురించి మాట్లాడడం..,సి గ్గు లేదు…,

  6. రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అనడానికి ఈయన మరో ఉదాహరణ అవుతాడేమో అనిపిస్తుంది. DCM గా భాద్యతలు తీసుకున్న వివిధ శాఖల గురించి ఇంతవరకు వివరంగా మాట్లాడింది లేదు…జరుగుతున్న పనులు, చేయబోయే పనులు ఏంటో ప్రజలకి వివరణ ఇవ్వలేదు. మధ్యలో సంబంధంలేని దారినపోయే అనవసర విషయాలను గెలికి అభాసుపాలయ్యాడు… ఇప్పుడు ఇలా నేనే హోంమంత్రి అవుతా అని ప్రెస్ ముందు మరింత చెండాలం చేసుకుంటున్నాడు.

Comments are closed.