మాదాపూర్.. అమరావతి.. విశాఖ.. గచ్చిబౌలి

అసలు కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు ముందుగా వేరే సంస్థకు చంద్రబాబు అప్పనంగా ఇచ్చేసినపుడు ఇప్పుడు మాట్లాడుతున్నవారంతా ఎక్కడ వున్నారు?

మేము చేస్తాం.. మీరు చేయకూడదు. తెలుగు రాష్ట్రాల్లో ఒక సెక్షన్ రాజకీయ నాయకులు, ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఇలాగే ఆలోచిస్తాయి. ఇలాగే చేస్తాయి. ఇలాగే మాట్లాడతాయి. ఇలాగే ప్రచారం చేస్తాయి. మాదాపూర్.. సైబరాబాద్ డెవలప్ మెంట్ ఒక్క కొండ కొట్టకుండా జరిగాయా? ఒక్క చెట్టు కొట్టకుండా జరిగిందా? వేలాది ఎకరాల్లో చెట్లు, చేమలు కొట్టి, కొండలు పిండి చేసి, అక్కడి జంతుజాలానికి నీడ లేకుండా చేయకుండా చంద్రబాబు అండ్ కో చెప్పిన అభివృద్ది సాధ్యమైందా? అమరావతి కోసం కొన్నివేల ఎకరాల పంటభూములు మాయం అవుతున్నాయి. మరి ఇది ప్రకృతి విధ్వంసం కాదా?

జగన్ విశాఖలో ఏదైనా ప్రభుత్వ భవనం తాకట్టు పెడితే గగ్గోలు పెట్టింది ఎల్లో మీడియా. ఏదైనా ప్రభుత్వ భూమి విక్రయిస్తామంటే నానా యాగీ. కానీ కోట్ల విలువైన షిప్ యార్డ్ హవుస్ ను లుల్లూ మాల్ కు ఇచ్చేస్తే అది అభివృద్ది, ఒక్క షిప్ యార్డ్ హవుస్ లో ఎన్ని వందల చెట్లు వున్నాయో ఎవరికైనా తెలుసా? అదంతా అభివృద్ధి.

అదే జగన్ రుషికొండ చుట్టూ, అదీ కింద ప్రాంతంలో కొన్ని కట్టడాలు కడితే ప్రకృతి విధ్వంసం. మరి అదే రుషికొండలో అంతకన్నా ముందే చంద్రబాబు టూరిజం రిసార్ట్ లు కట్టిన సంగతి ఎవరికైనా తెలుసా? చంద్రబాబు రుషికొండ కొంత కొట్టి రిసార్ట్ లు కట్టినపుడు ఈ సోషల్ మీడియా లేదు.

మాదాపూర్, గచ్చిబౌలి, సైబరాబాద్ టైమ్ లో సోషల్ మీడియా లేదు. అంతెంతుకు ఈ మధ్యన మాదాపూర్ యశోద ఆసుపత్రి, అరబిందో అపార్ట్ మెంట్స్ కట్టడం కోసం ఎలాంటి కొండలు కొట్టేసారు. విమానాశ్రయం, రింగ్ రోడ్ కోసం ఎన్ని కొండలు, చెరువులు, చెట్లు మాయం అయ్యాయి. రామోజీ ఫిలిం సిటీ కోసం?

అసలు కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు ముందుగా వేరే సంస్థకు చంద్రబాబు అప్పనంగా ఇచ్చేసినపుడు ఇప్పుడు మాట్లాడుతున్నవారంతా ఎక్కడ వున్నారు? ఇప్పుడు సోషల్ మీడియా జమానా నడుస్తోంది. అందరూ కలిసి నంది అంటే నంది…పంది అంటే పంది..దాన్ని గుడ్డిగా నమ్మే జనం. అదే ఇప్పుడు ట్రెండ్.

24 Replies to “మాదాపూర్.. అమరావతి.. విశాఖ.. గచ్చిబౌలి”

  1. ఇవన్నీ అక్రమాలు అయితే ఆ తరువాత వచ్చిన మహా మేత గాడు , ముక్కోడు కొనసాగించారు కదా , బాబు చేసింది తప్పైతే వాళ్లిద్దరూ అంటే మహా మేత గాడు,ముక్కోడు అక్కడ భూములు కొట్టేసి కిక్కురుమనలేదా

  2. సో మధాపూర్, సైబరాబాద్ అభివృద్ధి జరిగింది అంటావ్….దానికి కారణం చంద్రబాబు అంటావ్

  3. అమరావతి భూముల మీద బాగానే ఏడ్చవ్ కానీ, vanpic పేరుతో ధారాదత్తం చేసిన వేల ఎకరాల పరిస్థితి ఎంది? ఇందుకు ఇచ్చిన వందల ఎకరాల సంగతి ఏంది?

  4. లులు కి ఇచ్చారు సరే….మరి అదే వైజాగ్ లో రహేజ కి ఇనార్బిట్ మల్ కోసం తగలేసిన 17 ఎకరాల సంగతి?

  5. అసలు.. ఆ HCU లో ని 400 ఎకరాల.. వివాదంలో.. మొదట కుంభకోణం చేసిందే మన బొల్లి గాడు! IMG భరత్ కి అమ్ముకున్నాడు.. ముడుపులు తీసుకుని. ఇప్పుడు వాడి.. శిష్యుడు.. కుంభకోణాన్ని పూర్తి చేస్తున్నాడు!

    youtube.com/shorts/9Pzrdc1DAp0

    1. అసలు.. ఆ HCU లో ని 400 ఎకరాల.. వివాదంలో.. మొదట కుంభకోణం చేసిందే మన బొల్లి గాడు! IMG భరత్ కి అమ్ముకున్నాడు.. ముడుపులు తీసుకుని. ఇప్పుడు వాడి.. శిష్యుడు.. కుంభకోణాన్ని పూర్తి చేస్తున్నాడు!

  6. ఒరెయ్ తుగ్లక్!

    హిటెక్ సిటీ అన్నది అనివార్యం. అప్పడె అబిరుద్ది చెందుతున్నా IT అవసరాలాకి అవి కావాలి.

    అలానె ORR. ఇది హైదరాబాదు చొటూనె వెయాలి . నువ్వు చెప్పిన చొట కాదు!

    .

    రిషికొండ సముద్ర తీరం పక్కనె ఉంది. ఇక్కడ కట్టడాలకి కొన్ని పరిమితులు ఉన్నాయి? ముక్యమంత్రి కి అంత ప్యాలెస్స్ అన్నది అనివార్యం కాదు. అదికూడా సముద్ర తీరం లొ ఉన్న కొండని నిబందనలకి వ్యతిరెకంగా కట్టటం… అసలె మాత్రం అనివార్యం కాదు!

    .

    ఇవ్వాళ రిషికొండ అక్రమ కట్టడాల NGTకి 200 కొట్లు ఫిన్ వెస్తుంది? మరి నువు చెప్పింది నిజం అయితె హిటెక్ సిటీ కి NGT ఎందుకు ఫిన్ వెయ్యలెదు రా గూట్లె?

  7. నీకు విషయం అర్ధం అవ్వలేదు.. నువ్వు చెప్పిన ఉదాహరణల లో, చెట్లు కొ ట్టి ఎవరూ పా ల స్ కట్టుకోలేదు. పరిశ్రమలకు కేటాయించారు. వారి పా ల స్ లు బా త్ ట బ్ లు చూసి ప్రపంచం నిర్ఘాంత పోయింది.. మళ్ళీ ఎందుకు కెలుకుంటావ్

  8. ఆహా.. హైదరాబాద్ లో సైబర్ టవర్స్ కన్నా.. విశాఖ లో జగన్ రెడ్డి తన సొంతానికి కట్టుకున్న ఋషి కొండ పాలస్ అభివృద్ధికి పునాది అని ఇక్కడ కవి భావం..

    ఏమి రుద్దుతున్నారు రా.. సంకలనాకే జాతి..

Comments are closed.