ఈసారి ఎలాంటి సమస్య లేదు

పెద్ది గ్లింప్స్ రెడీ అయిందని, 6వ తేదీ ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు.

లెక్కప్రకారం గత నెలలోనే రిలీజ్ అవ్వాలి పెద్ది గ్లింప్స్. కానీ ఆ వీడియోలో చిన్న ఆడియో ప్రాబ్లమ్ వచ్చింది. సమయానికి రెహ్మాన్ కూడా అందుబాటులో లేడు. అనారోగ్యంతో అతడు ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య పెద్ది గ్లింప్స్ రిలీజ్ ను వాయిదా వేశారు.

అలా పోస్ట్ పోన్ చేసిన గ్లింప్స్ ను శ్రీరామనవమికి విడుదల చేస్తామని ప్రకటించారు. అయినప్పటికీ అనుమానాలు అలానే ఉన్నాయి. ఎందుకంటే, రెహ్మాన్ నిన్నటివరకు స్టూడియోకి రాలేదు. ఎట్టకేలకు రెహ్మాన్ అందుబాటులోకి వచ్చారు. పెద్ది గ్లింప్స్, ఫైనల్ మిక్సింగ్ పూర్తి చేశారు.

ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పెద్ది గ్లింప్స్ రెడీ అయిందని, 6వ తేదీ ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.

ఫస్ట్ షాట్ పేరిట రిలీజ్ కాబోతున్న ఈ గ్లింప్స్ ను ఒకేసారి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. గ్లింప్స్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు మరో 2 కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

4 Replies to “ఈసారి ఎలాంటి సమస్య లేదు”

  1. Elanti samasyalu lekunna mee jaffa gadi paytm batch, aathu star gadi batch kotha samasylau srushtistharuga. Endukante vallu mega family and mimmalni padukopettesina pawan kalyan family kabatti

  2. వైసిపి పేటియం బ్యాచ్ గ్రేట్ ఆంధ్రకు నెగటివ్ న్యూస్ ఏమి దొరకలేదు మెగా ఫ్యామిలీ మీద

Comments are closed.