వర్మకు మారే కాలం లేదు!

తక్కువ బడ్జెట్‌, తక్కువ అభిరుచి, తక్కువ స్థాయి పాటలు… వర్మ సినిమాలకు ఇవి బ్రాండ్‌లాగా మారిపోయాయి.

పతనం మొదలై… వేగం పెంచుకుని… రాకెట్ స్పీడుతో పాతాళానికి పడిపోయిన దర్శకుడు అంటే — రామ్ గోపాల్ వర్మ! ఒకప్పుడు నవీన దర్శకశైలికి నిలువెత్తిన ఉదాహరణగా నిలిచిన వర్మ, ఇప్పుడు తనే రూపొందించుకున్న కలల ప్రపంచాన్ని ధ్వంసం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఒకానొకప్పుడు “నేను మారతాను”, “పాత వర్మలా మళ్లీ దృష్టిని ఫోకస్ చేస్తాను” అంటూ ఘాటు డైలాగులు పేల్చిన వర్మ… వాస్తవానికి మాత్రం ఎప్పటికీ మారడు. దర్శకుడిగా అతడు ఎంతటి ప్రతిభావంతుడో, అదే స్థాయిలో పతనాన్ని కూడా అనుభవిస్తున్నాడు. తాజాగా అతను చేసిన సినిమా ‘శారీ’ — దానికి తానే నిర్మాత, దర్శకత్వం మాత్రం తన శిష్యులకు అప్పగించాడు.

సినిమా స్టోరీ ఎలాంటిదంటే, ఓ మలయాళీ అమ్మాయి చీరకట్టుల్లో తిప్పుతూ, ఆమెను ఓ విలన్ మాయలోకి లాక్కోవడం… ఆమె దానిని గుర్తించి దూరం అవ్వడం — ఇదే కథ. మధ్యలో కొన్ని స్టిల్స్, కొన్ని సన్నివేశాలు, కొన్ని భావోద్వేగాల పేరుతో చీప్ చూపులు. కథ నడిచేలా లేదు, నిలిచేలా లేదు — అన్నీ తిరుగుతూ తిరుగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేవే.

తక్కువ బడ్జెట్‌, తక్కువ అభిరుచి, తక్కువ స్థాయి పాటలు… వర్మ సినిమాలకు ఇవి బ్రాండ్‌లాగా మారిపోయాయి. థియేటర్‌కు పొరపాటున వెళ్లిన ప్రేక్షకుడికి ఒక్క పాట, ఒక్క సంభాషణ కూడా గుర్తుండదు. అయినా వర్మ మాత్రం మునుపటి రోజుల్లో తాను సృష్టించిన విలక్షణతను నిలబెట్టుకున్నట్టు నటిస్తాడు.

“సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలి” అనే మెసేజ్ పెట్టుకున్నా, అసలైన సందేశం మాత్రం కనపడదు. తక్కువ ప్రమాణాల కంటెంట్‌తో ప్రేక్షకుల మీద తిట్ల వర్షం కొని తెచ్చుకోవడం… ఇదే ఇప్పుడు వర్మ స్టైల్.

ఒక్క మాటలో చెప్పాలంటే — వర్మలో దర్శకుడు ఎప్పుడో చనిపోయాడు. ఇప్పుడు మిగిలింది పేరు మాత్రమే. కాని ఆ పేరు వెనుక వున్న పాత గౌరవం మాత్రం చాలా కాలంగా శ్మశానవాతావరణంలోనే ఉంది!

20 Replies to “వర్మకు మారే కాలం లేదు!”

  1. Ikda rendu point lu niku clarity ivvali ..

    1, ayna mata mida nilabadanu ani enisarlu chepina miku chevina padadu ,buraki ekkadu

    2, nenu msg lu ivanu ani kuda chala sarlu cheppadu

    Aynadi em tappu ledu ..ayna nundi expectation petkuna midi tappu ..aynepdu nanu nammi randi cinema ki ani chepaledu

  2. Looks ordinary, however if he says in press meet that this movie is a true of a *powerful* star who trapped and used this saree dropping lady for his never won party alliance then it gains traction.. Lol.

    .. whom he prayed, whether his party won or not , how he became saint will be in part 2

    1. చిన్న కరెక్షన్.. వాడు నిజాలు చూపించడం కాదు, వాడి సినిమాలు చూసి ప్రజలకి నిజం అర్ధం అయ్యి 11కి పరిమితం చేసారు.

        1. ఆస్తి కోసం చె*ల్లిని, అధికారం కోసం త*ల్లిని, భా*ర్యను సంతోష పెట్టడానికి ఇంకో చె*ల్లిని తన్ని తరిమిన విషయాలు ఆ సినిమాలో పెట్టడం మర్చిపోయాడు అనుకుంట

Comments are closed.