దేవర-2పై చాలా డౌట్స్ వచ్చాయి ఈమధ్య. ఇక ఆ సీక్వెల్ రాదేమో అనే ప్రచారం కూడా నడిచింది. దీనిపై కొన్ని రోజుల కింద నిర్మాత సుధాకర్ క్లారిటీ ఇచ్చారు. దేవర-2 కచ్చితంగా ఉంటుందన్నారు. అదే టైమ్ లో జపాన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ కూడా అదే స్పష్టత ఇచ్చాడు.
ఇప్పుడు మరోసారి అభిమానుల సమక్షంలో దేవర-2పై పూర్తి స్పష్టత ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ సినిమా కచ్చితంగా వస్తుందంటున్నాడు.
“దేవర-2 లేదు అనుకోవద్దు. దేవర-2 ఉంది. కచ్చితంగా వస్తుంది. కాకపోతే చిన్న పాజ్ ఇచ్చాను. మధ్యలో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాను.”
ఇలా దేవర-2పై ప్రకటన చేసిన ఎన్టీఆర్, అదే టైమ్ లో మరో సీక్వెల్ పై కూడా స్పందించాడు. అదే అదుర్స్-2.
“కామెడీ పలికించడం ఓ నటుడికి చాలా కష్టమైన పని. అందుకే నేను అదుర్స్-2 చేయట్లేదు. ఆ సీక్వెల్ చేయడానికి భయపడుతున్నాను. మళ్లీ థియేటర్లలో అంత కామెడీ పండుతుందో లేదో అని భయం.”
ఇలా ఒక సీక్వెల్ చేస్తానంటూ ప్రకటించిన ఎన్టీఆర్, అదే టైమ్ లో మరో సీక్వెల్ చేయనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ హీరో ప్రశాంత్ నీల్ సినిమాపై దృష్టిపెట్టాడు.
“సీక్వెల్ చేయడానికి భయ పడుతున్నా” అని చెప్ప కుండా ఉండాల్సింది N T R !!!!
జాయిన్ కావాలి అంటే