విశాఖ మహా నగరం అంతర్జాతీయగా పేరు గడిస్తోంది. ఎప్పటికపుడు ఈ నగరం అభివృద్ధి సాధిస్తూ విస్తరిస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖ నగరంలో జనాభా పెరుతోంది. కల్చర్ కూడా మారుతోంది. దాంతో పాత చట్టాలకు మళ్ళీ పదును పెట్టి జనంలోకి తీసుకుని రావాల్సి వస్తోంది.
అలా 2003 నాటి కాట్సా చట్టాన్ని విశాఖలో మొదటి సారి అమలు చేశారు. ఈ చట్టం శుక్రవారం నుంచి అమలు చేస్తున్నట్లుగా పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడాన్ని నిషేధించారు. అలా ఎవరైనా చేస్తే వారికి రెండు వందల రూపాయలు జరీమానా విధిస్తారు.
అలాగే పాఠశాలలకు వంద మీటర్ల దూరంలో పొగాకు అమ్మకాలు చేయకూడదని చట్టం చెబుతోంది. అలా చేసిన వారి పట్ల కఠిన చర్యలే ఉంటాయని పోలీసుకు హెచ్చరిస్తున్నారు. విశాఖలో పాత చట్టాన్ని కొత్తగా అమలు చేసిన మొదటి రోజునే ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా పొగ తాగుతూ పోలీసులకు చిక్కారు. అలా వారికి జరీమానాను విధించారు.
ఈ చట్టం గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు. విశాఖ వంటి నగరాలలో బహిరంగంగ పొగ తాగడం నిషేధం అన్నవిషయం జనాలకు తెలియాల్సి ఉందని అన్నారు. జరీమానాలు విధించడం ద్వారా ఈ కల్చర్ ని కట్టడి చేస్తామని చెప్పారు. ఎదుగుతున్న నగరంగా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా విశాఖను తీర్చిదిద్దుతామని అద్ధికారులు చెబుతున్నారు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.
Pan parag ni namili ekkada barite akkada lose vallaki kuda fine veste bagundu