వివాదాస్పద సన్నివేశాలతో లూసిఫర్-2 సినిమా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే, ఇప్పుడీ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. లూసిఫర్-2 నిర్మాత ఆస్తులు, ఆఫీసులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్-ఈడీ మెరుపు దాడులు చేసింది.
తాజా నివేదికల ప్రకారం, ఈ దాడులు 1,000 కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారకద్రవ్య లావాదేవీల్లో ఉల్లంఘనలు జరిగాయనే ఆరోపణలపై ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. నిర్మాత గోపాలన్, అతడి కంపెనీ శ్రీ గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ కు చెందిన తమిళనాడు, కేరళలోని ఆఫీసులపై ఈ దాడులు ఏకకాలంలో జరిగాయి.
కోడంబాక్కం ప్రాంతంలోని శ్రీ గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ ఆఫీసులో సోదాలు జరిగాయి. మరో బృందం చెన్నైలోని నీలంకరైలోని గోపాలన్ ఫామ్‌హౌస్ లో సోదాలు నిర్వహించింది. ఇలా ఒకేసారి 5 లొకేషన్లలో ఈ దాడులు జరిగాయి. కొంతమంది ఎన్నారైలకు చెందిన వెయ్యి కోట్ల రూపాయల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీ చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది.
మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ రిలీజైన కొన్ని రోజులకే ఈ దాడులు జరగడంపై చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈడీ దాడులకు, సినిమాకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది.
గోపాలన్ ఎవరు?
కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఈ గోపాలన్. ఆతిథ్యం, లైఫ్ సైన్సెస్, విద్యారంగం, మీడియా, సినిమా, రవాణా రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు గోపాలన్. శ్రీ గోకులం గ్రూప్ అనే నిర్మాణం సంస్థను స్థాపించి, సౌత్ అంతటా విస్తరించారు గోపాలన్. అయితే ఈ పెట్టుబడులన్నింటికీ మూలం ఆయన చేసే చిట్ ఫండ్ వ్యాపారం. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, పలు దేశాల్లో గోపాలన్ చిట్ ఫండ్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
లూసిఫర్-2 నిర్మాణంలో లైకా, ఆర్థికంగా ఇబ్బంది పడటంతో, గోపాలన్ ఎంటరయ్యారు. సినిమాపై వివాదం చెలరేగినప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయింది ఇతడే. ఆ తర్వాత మోహన్ లాల్ కూడా స్పందించి, క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.
జాయిన్ అవ్వాలి అంటే