టాలీవుడ్ – విదేశాల్లో నివాసాలు

ఇటీవల ఒక్కో హీరో విదేశాల్లో ఓ అకామిడేషన్ ఏర్పాటు చేసుకోవడం అన్నది ప్రారంభించారు.

టాలీవుడ్ జనాలకు విదేశాలంటే మోజు. సామాన్యులకైనా, సంపన్నులకైనా విదేశాల్లో వుండడం అంటే ఇష్టమే. అందువల్ల డబ్బు బాగా వున్న టాలీవుడ్ జనాలకు ఎందుకు ఇష్టం వుండదు. అందుకే తరచు, గ్యాప్ దొరికినపుడల్లా విదేశాలకు వెళ్లి వస్తుంటారు. ఇటీవల ఒక్కో హీరో విదేశాల్లో ఓ అకామిడేషన్ ఏర్పాటు చేసుకోవడం అన్నది ప్రారంభించారు. మరి కొందరు అక్కడే ఎక్కువ కాలం వుండడం మొదలుపెట్టారు. ఇంకొందరు పిల్లల్ని అక్కడే చదివిస్తున్నారు.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇటలీ అవుట్ స్కర్ట్స్ లోని ఓ విలేజ్ లాంటి ఏరియాలో ఇల్లు తీసుకున్నారు. ఏ మాత్రం గ్యాప్ దొరికినా అక్కడ వాలిపోతున్నారు. రిలాక్స్ అవుతున్నారు. లండన్ లో మహేష్ బాబు ఓ ఇల్లు తీసుకున్నారు. కొడుకు గౌతమ్ అక్కడ చదువుతున్నారు. త్రివిక్రమ్ కొడుకు కూడా లండన్ లోనే సినిమా కోర్స్ నేర్చుకుంటున్నారు. నిర్మాత ఆసియన్ సునీల్ సోదరుడు భరత్ కొడుకు కూడా అక్కడే ప్రోడక్షన్ కోర్స్ చేస్తున్నారు.

మంచు విష్ణు తన పిల్లలను, అత్తగారి సంరక్షణలో వుంచి చదవిస్తున్నారు. దుబాయ్ అని కొందరు అంటారు. లండన్ అని కొందరు అంటారు. మొత్తానికి అక్కడే చదివిస్తున్నారు. భవిష్యత్ లో దుబాయ్ లో స్కూల్ స్టార్ట్ చేయబోయే ఆలోచనలో కూడా వున్నారు.

పవన్ కళ్యాణ్ భార్య తన పిల్లలతో విదేశాల్లోనే వుంటున్నారు. పిల్లల చదువులు అక్కడే సాగుతున్నాయి. మెగాస్టార్ మూడో తనయ కూడా దుబాయ్ కు షిఫ్ట్ అవుతున్నారని తెలుస్తోంది. అక్కడ ఇల్లు తీసుకుని, పిల్లలు ఇద్దరినీ అక్కడే చదవించబోతున్నారని తెలుస్తోంది.

ఇక మన నిర్మాతలు చాలా మంది ఏ మాత్రం టైమ్ దొరికినా దుబాయ్ లో వాలిపోతున్నారు. దాదాపు అందరికీ అమెరికా వీసాలు వున్నాయి. అందువల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు దుబాయ్ వెళ్లి వచ్చేస్తున్నారు.

20 Replies to “టాలీవుడ్ – విదేశాల్లో నివాసాలు”

    1. మ్యూజియం లో ఉండాల్సిన సరుకు(Metal బుర్ర కలిగిన మేధావుల)ని website లోకి తీసుకోవడమే Ga ప్రత్యేకత!😜😜😜

    2. అమెరికాలో దుబాయ్ అనే ఒక ఊరుని మన ga లో ఈ ఆర్టికల్స్ వ్రాసినవాడు కనిపెట్టాడు లే, అది మీకు తెలియదు..!😜😜😜

      1. ఇంత నిగూఢ అర్ధాలు నావంటి సామాన్యులకు అర్ధం అవుతాయా, ఈ author దృష్టిలో..?

  1. అమెరికా వీసాతో దుబాయ్ పంపించే అపర మేధావులంతా మన ga లో ఆర్టికల్స్ వ్రాస్తుంటారు! ఇది నీ వల్ల ఎలా వీలవుతుంది ga కట్టప్పా?

  2. మన ap లో ఒకడును ఆడు…వాడు చాలా సార్లు వెళ్లే డ్3సామ్ ప్రకటించిఅడు…వాడి కొట్టేలు వాడెక్కడికి వెళ్లిన దేశం కోసం అని దప్పేసుకుని తప్పుడు సమాచ్ఆఆర్ఆఆమె దేశానికిస్తుంటారు…వాడి కు…లే ఇక్కడ అరుస్తున్నాయి

  3. Italy outskirts అంటే కొంచెం వెరైటీగా ఉంది. సిటీ outskirts విన్నాము. కంట్రీ outskirts ఇదే ఫస్ట్.

Comments are closed.