రుషికొండ భవనాలపై స్కెచ్ సిద్ధం చేసిన చంద్రబాబు!

ఎవరు ఏం చెప్పారో ఎవ్వరికీ తెలియదు గనుక.. ఫైనల్ గా తాను చేయదలచుకున్నదే ఆయన చేసేసి.. కార్యం చక్కబెట్టేస్తారని అంతా అనుకుంటున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇది చాలా కాలంగా అలవాటైన పద్ధతి. ఆయన ముద్ర గల రాజనీతిలో ఇది కూడా ఒక పద్ధతి అంతే! ఏదైనా ఒక కీలకమైన/ వివాదాస్పదమైన వ్యవహారం తెరమీదకు వచ్చినప్పుడు.. తన చేతికి మట్టి అంటకుండా.. తాను తలచినరీతిగా దానిని పరిష్కరించేందుకు ఆయన వద్ద ఒక రెడీమేడ్ పద్ధతి ఉంటుంది.

ఆ అంశం గురించి తన సహచరులందరి అభిప్రాయాలను సేకరిస్తారు. లేదా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుందాం అంటూ పిలుపు ఇస్తారు. ఆ రకంగా సహచరులు చెప్పే అభిప్రాయాలు గానీ.. ప్రజలు చెప్పే అభిప్రాయాలు గానీ.. బహిరంగ విషయాలు కావు. ఎవరు ఏం చెప్పారో ఎవ్వరికీ తెలియదు. తీరా చివరికి.. చంద్రబాబు తాను ఏం చేయదలచుకుంటున్నారో.. ఆ విషయాన్ని బయటపెట్టి.. అందరూ ఇదే కోరుకుంటున్నారని ప్రకటించి.. అక్కడితో ఆ వ్యవహారం ముగిస్తారు.

ఇది చంద్రబాబునాయుడు మార్కుగల రాజకీయం. ఇప్పుడు విశాఖపట్టణంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు టూరిజం శాఖ కోసం నిర్మించిన అత్యంత అధునాతనమైన అతిథి భవనాల విషయంలో కూడా చంద్రబాబునాయుడు ఇదే సూత్రం అవలంబిస్తున్నారు.

గురువారం నాడు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. భేటీ తర్వాత.. మంత్రులతో చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా ఇష్టాగోష్టి ముచ్చట్లు పెట్టారు. జగన్ సర్కారు.. విశాఖ పట్నం రుషికొండలో నిర్మించిన టూరిజం అతిథి భవనాలు ఎందుకూ పనికిరాకుండా వృథాగా మారాయని ఆయన తీర్మానించారు. ఇప్పుడున్న స్థితిలో వాటిని ఏ రకంగానూ వాడుకోలేం అని ఆయన తేల్చేశారు. జగన్మోహన్ రెడ్డి నివాసం కోసం కట్టుకున్న భవనాలు అని ఆధారాలు లేని నిందలు వేయడం తర్వాత.. వాటిని టూరిజం ఆధ్వర్యంలో ఏ ప్రయోజనాల కోసం నిర్మించాం అని జగన్ సర్కారు అధికారికంగా ప్రకటించినదో అదే అవసరాలకు వినియోగిస్తే బాగుండేది.

విశాఖపట్టణానికి ఒక అంతర్జాతీయ స్థాయి అతిథి భవనాలు టూరిజం ఆధ్వర్యంలో ఉండేవి. అయితే అలా వాటిని సక్రమంగా వాడుకుంటే.. మంచి నిర్మాణాలు చేపట్టిన క్రెడిట్ జగన్ ఖాతాలోకి వెళుతుంది కదా..! బురద చల్లడం కుదరదు కదా! అందుకే ఆయన వెరైటీ ప్లాన్ వేశారు.

మంత్రులందరినీ రుషికొండ భవనాలను సందర్శించాలని పురమాయించారు. ఆ తరువాత.. వాటిని ఏ రకంగా వాడుకోవచ్చునో ప్రతిపాదనలతో రావాలని సూచించారు. పవన్, పయ్యావుల కేశవ్ వంటి వాళ్లు కొన్ని ప్రతిపాదనలు చేసిన తోసిపుచ్చారు.

ఆల్రెడీ చంద్రబాబు మదిలో రుషికొండ భవనాలను ఎలా వినియోగించుకోవాలనే విషయంలో ఒక స్కెచ్ సిద్ధమయ్యే ఉన్నదని.. తానుగా దానిని బయటకు చెప్పకుండా.. మంత్రులనుంచి అభిప్రాయాలు ఆహ్వానిస్తున్నారు. ఆయనకు అలవాటైన పద్ధతి ప్రకారం.. ఎవరు ఏం చెప్పారో ఎవ్వరికీ తెలియదు గనుక.. ఫైనల్ గా తాను చేయదలచుకున్నదే ఆయన చేసేసి.. కార్యం చక్కబెట్టేస్తారని అంతా అనుకుంటున్నారు.

18 Replies to “రుషికొండ భవనాలపై స్కెచ్ సిద్ధం చేసిన చంద్రబాబు!”

  1. టూరిజం కోసం కట్టిన భవనాలలో అంత రహస్యం ఏమిటో? ఎవరిని చూడకుండా నిషేధం ఎందుకు పెట్టినట్లో?టూరిజం భవనాలలో నలభై లక్షల బాత్ టబ్ ఎందుకో? బాత్రూం లో షాండ్లియర్ ఏమిటో?అంత ఖరీదైన భవనాలు బుక్ చేసుకునే టూరిస్టులు ఎవరో? ఆ భవనాల maintainance కి ఖర్చు ఎంతో?

    1. మీరు ఇలాంటివి అడిగితే ఎలా .. అన్న ఏమి చేసిన లోక కల్యాణార్థం .. ప్రజా ప్రయోజనర్ధం అని సరి పెట్టేసి కోవాలి ..

  2. అబ్బబ్బ… ఎటువంటి కల్మషం లేని స్వచ్ఛమైన ఆర్టికల్. టూరిజం కోసం కట్టిన ఆ బిల్డింగులను ఎలా వాడుకోవాలో అన్నకు ఓ కమిటీ, అప్పటి టూరిజం మంత్రిగారు ఆల్రెడీ సెలవిచ్చారు కదా

  3. “ఇప్పుడు విశాఖపట్టణంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు టూరిజం శాఖ కోసం నిర్మించిన అత్యంత అధునాతనమైన అతిథి భవనాల విషయం”

    rastram lo chinna pillalni adigina cheptharu ee vishayam…

  4. నవరత్నాలు ఇవ్వడం వల్ల తానే ఉంటాననే నమ్మకం తో మా అన్నయ్య కట్టించుకున్న కలల సౌధం పాపం ఓటర్లు అడియాశలు చేశారు గా ..

  5. మా అవినాష్ అన్న కి కొన్ని రోజులు ఉండటానికి అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను.

  6. vision lekunda builds kadithe ela amma. how aa how. Now visionary needs to create a vision for this. Public lands pooling lekunda Government lands ki gundu kottadam oka vision a. Abbe.

  7. దాన్ని సెంట్రల్ జెయిల్ గా మార్చి అయినా సరే మావాడికిస్తేనే అర్ధం పరమార్ధం !

  8. For the record, Rushikonda Tourism buildings was actually built by the Tourism Ministry under the previous YSRCP regime, which envisioned Vizag as one of the state capitals for administrative purposes. More importantly, the government aimed to host investment summits and provide world-class accommodations for investors, eliminating the need to spend cr0res on luxury hotel stays during such events.

    Our Bolli .. as usual, deliberately maligns the previous government, downplaying the good initiatives undertaken during YSRCP’s tenure!

  9. For the record, this structure was actually built by the Tourism Ministry under the previous YSRCP regime, which envisioned Vizag as one of the state capitals for administrative purposes. More importantly, the government aimed to host investment summits and provide world-class accommodations for investors, eliminating the need to spend crs on luxury hotel stays during such events.

    Our Bolli alias 420 as usual, deliberately malign the previous government, downplaying the good initiatives undertaken during its tenure.

Comments are closed.