టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి టీటీడీకి సంబంధించిన గోశాలలో గోమాతల మరణాలను బయటపెట్టారు. మీడియా సమావేశంలో గోమాతలు విగతజీవులుగా పడి వుండడాన్ని ఫొటోలతో సహా ప్రదర్శించి, టీటీడీని, కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. గోమాతల మరణాలపై టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి మాటల్లోనే…
“సనాతన ధర్మానికి ప్రతినిధులం తామేనని, హిందూ ధర్మాన్ని పరిరక్షణలో భాగంగా తిరుమలలో పాప ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. కానీ ఇవాళ, అందుకు పూర్తి విరుద్ధమైన పాలన సాగుతోంది. టీటీడీ గోశాలలో గత మూడు నెలల్లో గోమాతల మృత్యు ఘోష వినిపిస్తోంది.కానీ ఈ వాస్తవాన్ని దాచి పెట్టారు. గోవులను తాకితేనే, గోప్రదక్షణ చేస్తేనే సకలతీర్థాలలో స్నానమాచరించినట్టుగా, సకల దేవుళ్ల దర్శనాలు అయినట్టుగా భావించే ఈ పవిత్ర భారతావనిలో …అత్యంత పవిత్రమైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పరిరక్షణలోని గోశాలలో గోమాతల మృత్యుఘోష వినాల్సి రావడం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోంది.
సాక్ష్యాత్తు తిరుమల ఆలయ తలుపులు తెరిచేది గోసంరక్షకుడే. అంతగా గోవులతో అన్యోన్య బాంధవ్యం ఉన్న తిరుమల క్షేత్రంలో, అది నడిపే గోశాలలో గోవుల స్థితి ఎలా వుందంటే.. మచ్చుకు కొన్ని చనిపోయిన దేశవాలీ ఆవుల దుస్థితి. భగవంతుడితో సమానమైన గోవులకు పట్టిన దుర్గతి. ఇవి మా పరిశోధనలో వచ్చిన కొన్నివి మాత్రమే. ఇవి ఎందుకు చనిపోయాయో కూడా పోస్టుమార్టం చేయలేదు. అమ్మకంటే అత్యంత పవిత్రంగా గోవుల్ని చూస్తారు. ఇదే విషయాన్ని మన వేదాల్లోనూ, సనాతన ధర్మాల్లోనూ ఉంది. కానీ మూడు నెలలుగా దిక్కూమొక్కూ లేకుండా 100కి పైగా గోవులు మరణించడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. కనీసం చనిపోయిన ఆవులకు పోస్టుమార్టం కూడా నిర్వహించిన దాఖలాలు లేవు.
మా పాలనలో 500 గోవులను దాతల నుంచి సేకరించి సంరక్షించాం. గతంలో వందే గో మాతరం అనే కార్యక్రమం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో చేపట్టాం. అయినా ఎల్లో మీడియా ద్వారా మాపై విషం చిమ్మారు. ఆ ఆవుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గోవుల సంరక్షణలో కూటమి సర్కార్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
లేగదూడలను పట్టించుకునేవాడు లేడు. చెత్తకు వేసినట్లుగా ఆవులకు గ్రాసం వేస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా గోశాల డైరెక్టర్ను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి గోశాలకు ఓ డైరెక్టర్ అంటూ లేడు. ఏ మాత్రం సంబంధం లేని అటవీ అధికారిని గోశాలకు ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆ గోశాల పరిరక్షణ అధికారికి, గోవులకు ఏ రకమైన సంబంధం లేదు. ఈ దారుణాలపై విచారణ జరిపించాల్సిన అవసరం వుంది. సాహివాల్ ఆవు గోశాలనుంచి బయటకు వెళ్లి ట్రైన్ కింద పడి చనిపోయింది. టీటీడీకి చెందినది కాదని నిరూపించేందుకు ఆ గోమాత చెవులు కట్ చేశారు. గోశాల.. గోవధశాలగా మారింది.
భగవంతుడితో సమానమైన గోవులకు ఈ దుస్థితికి, అలాగే ఈ మహా పాపానికి కూటమి సర్కార్, టీటీడీ అధికారులదే పూర్తి బాధ్యత. సనాతన ధర్మ పరిరక్షకుడిని అంటూ కాషాయ వస్త్రధారణలో వేషాలు వేసే పవనానంద స్వామి(పవన్‌కల్యాణ్) ఎక్కడ? ఏం చేస్తున్నారు? హైందవ సమాజం గోశాలలో ఘటనలపై స్పందించాలి” అని ఆయన కోరారు.
ఇదిలా వుండగా, గోమాతల మరణాలపై టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని ఆ సంస్థ పేర్కొనడం గమనార్హం. ప్రచారాన్ని టీటీడీ ఖండిస్తోందన్నారు. కానీ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. మీడియా సమావేశం నిర్వహించి, మరీ ఆయన ఫొటోలతో సహా ప్రదర్శించి, ఆరోపణలు గుప్పించగా, సోషల్ మీడియా ప్రచారమని టీటీడీ ప్రకటన చేయడం ఏంటో సంబంధిత అధికారులకే తెలియాలి.
కర్పూరం
Adi fake news ani TTD clear ga cheppindi..Aina Meeku ilanti fake news spread cheyadam alavategaa
జాయిన్ అవ్వాలి అంటే
Ayo
ప్రొఫైల్ ఓపెన్
ఎవ్వరికీ తెలియని తిరుమల వ్యవహారాలు ఈ యేసుపాదం కు ఎలా తెలుస్తున్నాయి. బహుశా ఇలాంటి వ్యవహారాలు అన్నీ ఇతని కనుసన్నలలో నడుస్తున్నాయా?ఏంటీ? అంటున్నారు జనాలు..
ఏమో అయిఉండొచ్చు ..
వినాశ కాలే విపరీత బుద్ధి! అధికారమదం తో కళ్ళు మూసుకు పోతే తాగిన శాస్తి తప్పకుండా తగులుతుంది ఎవ్వరికైనా.
2024 june lo choosam swamy ..