బాబు బీద అరుపులు.. అర్థం చేసుకోరూ!

ఎంత‌సేపూ హామీల్ని అమ‌లు చేయ‌క‌పోవ‌డానికి వైఎస్ జ‌గ‌న్ చేసిన అప్పులే కార‌ణ‌మ‌ని ప్ర‌జ‌ల్ని క‌న్విన్స్ చేయ‌డానికే చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి బీద అరుపులు అర‌వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో అలివికాని హామీల్ని ఇస్తున్నావేమ‌య్యా , అమ‌లు ఎలా చేస్తావ‌ని చంద్ర‌బాబును ప్ర‌శ్నించ‌గా… త‌న మార్క్ స‌మాధానం ఇచ్చారు. సంప‌ద సృష్టించి జ‌గ‌న్ కంటే రెండింత‌ల సంక్షేమ ల‌బ్ధిని క‌లిగిస్తాన‌ని ఆయ‌న ఆర్భాటంగా ప్ర‌క‌టించారు. అధికారంలోకి వ‌చ్చిన రోజు నుంచి ఆయ‌న స్వ‌రం మారింది.

అమ్మో, ఇన్ని అప్పులా? తాను అస‌లు ఊహించ‌లేదని, సూప‌ర్‌సిక్స్ స్కీమ్స్ అమ‌లు చేయాలంటే భ‌య‌మేస్తోంద‌ని అసెంబ్లీ వేదిక‌గా ఆయ‌న అన్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో చంద్ర‌బాబు శుక్ర‌వారం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌కు ఎంతో చేయాల‌ని వుంద‌న్నారు. కానీ గ‌ల్లా పెట్టె చూస్తే ఖాళీగా వుంద‌న్నారు. జ‌గ‌న్ దెబ్బ‌తో అప్పులు ఇవ్వ‌డానికి కూడా ఎవ‌రూ ముందుకు రాలేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఎంత‌సేపూ హామీల్ని అమ‌లు చేయ‌క‌పోవ‌డానికి వైఎస్ జ‌గ‌న్ చేసిన అప్పులే కార‌ణ‌మ‌ని ప్ర‌జ‌ల్ని క‌న్విన్స్ చేయ‌డానికే చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదే చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పులు రూ.12 ల‌క్ష‌ల కోట్ల‌ అని ఒక‌సారి, రూ.14 ల‌క్ష‌ల కోట్లు అని మ‌రోసారి ఆరోపించారు. ఇప్పుడేమో గ‌ల్లా పెట్టె ఖాళీ అంటూ స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 2019లో తాను అధికారం నుంచి దిగిపోయే నాటికి కేవ‌లం రూ.100 కోట్లు మాత్ర‌మే గ‌ల్లా పెట్టెలో ఉంచి పోయాన‌ని చంద్ర‌బాబు మ‌రిచిన‌ట్టున్నారు.

అప్పుడు అధికారంలోకి వ‌చ్చిన వైఎస్ జ‌గ‌న్ ఏనాడూ హామీల్ని అమ‌లు చేయ‌డానికి ఆర్థిక ఇబ్బందుల‌పై సాకులు చెప్ప‌లేదే అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. అలాగే జ‌గ‌న్ హ‌యాంలో రెండేళ్ల పాటు కోవిడ్ మ‌హ‌మ్మారి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను రాష్ట్రంతో పాటు యావ‌త్ ప్ర‌పంచాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అయినా జ‌గ‌న్ వెనక‌డుగు వేయ‌లేద‌నే సంగ‌తిని వారు గుర్తు చేస్తున్నారు. ప‌దేప‌దే రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట ప‌రిస్థితిలో వుంద‌ని చెబుతూ, హామీల్ని అమ‌లు చేయ‌లేన‌ని, అర్థం చేసుకోవాల‌నే సందేశాన్ని పంపాల‌ని అనుకుంటున్నారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

7 Replies to “బాబు బీద అరుపులు.. అర్థం చేసుకోరూ!”

  1. డబ్బులు పంచేసి .. మిగిలినవి గాలికి వొదిలేయ బట్టే ఫ్యాన్ ఆగిపోయింది ..

      1. అంటే మీకు వొచ్చిన నలబై శాతం జనాలు వేయలేదా .. మరి ఎందుకు నలబై శాతం అని చొక్కలు చించుకుంటారు..

Comments are closed.