గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ ఊరికెళ్లినా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏలూరు జిల్లా పర్యటనలో శుక్రవారం కూటమి అపరిమిత అధికారంపై తనదైన శైలిలో సంబరంగా చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఇంతటి ఘన విజయాన్ని చూడలేదన్నారు. తనను చూసి, తనపై నమ్మకంతో 93 శాతం సీట్లను కట్టబెట్టారన్నారు.
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆ మధ్య జనసేన ఆవిర్భావ సభలో ఇదే రకంగా గొప్పలు చెప్పారు. బలహీనంగా ఉన్న టీడీపీకి మద్దతు ఇచ్చి, ఎన్నికల్లో గెలిచేలా చేసిన ఘనత తనదే అన్నారు. తన వల్లే మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి, అధికారాన్ని దక్కించుకున్నట్టు పవన్ పదేపదే చెప్పడం గురించి తెలిసిందే.
ఇలా అపరిమిత అధికారం దక్కడం వెనుక ఘనత తమ ఖాతాల్లో వేసుకోడానికి సీఎం, డిప్యూటీ సీఎం పోటీ పడుతున్నారనే భావన కలుగుతోంది. అయితే వీళ్లిద్దరూ ఎన్నైనా చెప్పుకోవచ్చు. వాస్తవం మాత్రం వేరే వుంది. ఎన్నికల మ్యానిఫెస్టోను 98 శాతం అమలు చేశానని వైఎస్ జగన్ ఎంతగా చెప్పినా, ఆయన్ను చూసే వైసీపీకి జనం ఓట్లు వేయలేదన్నది వాస్తవం. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల దోపిడీని జగన్ అరికట్టలేకపోయారు.
అలాగే వైసీపీ కార్యకర్తల్ని జగన్‌తో పాటు వైసీపీ ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. మూడు రాజధానుల ఏర్పాటు, మండలి రద్దు లాంటి పిచ్చి పనులు, ప్రజామోదం లేని నిర్ణయాలు… వెరసి జగన్ వద్దని జనం డిసైడ్ అయి, ప్రత్యామ్నాయంగా కూటమికి గంపగుత్తగా ఓట్లు వేశారు. అందుకే కూటమికి అపరిమితమైన అధికారం దక్కింది. ఇందులో చంద్రబాబు సూపర్‌సిక్స్ హామీలు తదితరాలు కలిసి వచ్చాయి. అలాగే తమ ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వైసీపీ పూర్తిగా విఫలమైంది. జగన్ వద్దని అనుకున్నారు. రాజకీయాల్లో ఐదేళ్లకోసారి ప్రజలు తీర్పు ఇస్తుంటారు.
పరిపాలనపై ఆధారపడి తీర్పు వుంటుంది. కూటమి పాలనపై రాబోయే రోజుల్లో ప్రజాతీర్పు ఎదుర్కోవాల్సి వుంటుంది. అంతే తప్ప, చంద్రబాబు పాలన గురించి జనానికి తెలియక ఓట్లు వేయలేదు. అన్నీ తెలిసే, జగన్ మళ్లీ వద్దనుకున్నారు. ఇదే ప్రజలు రేపు కూటమి వద్దనుకుంటే, మళ్లీ జగన్‌కే ఓట్లు వేస్తారు. అధికారం ఘనత… ప్రజలదే. తమది కాదని ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు గుర్తిస్తే మంచిది.
వీళ్ళు కాకపోతే వాళ్ళు , వాళ్ళు కాకపోతే వీళ్ళు . ప్రజలకి ఇంకో ఆప్షన్ లేదు. చచ్చిపోయిన జనసేన పార్టీ ని లేపి కొట్టించుకున్న ఘనత వై సి పి ది . ఏ పి లో ఇంకో పార్టీ కి జవసత్వాలు ఇచ్చి ఊపిరిపోసింది . వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అంచనా వేయడం కష్టం.
మర్రిచెట్టు నీడలో ఉన్న చెట్టు ఎదుగుతుందో లేదో మరి చెట్టి సైజు దాని కింద ఉన్న చెట్టు సైజును బట్టి ఉంటుంది, అది త్వరలోనే తేలిపోతుంది, కానీ కూకటి వేళ్ళతో పెకిలించిన చెట్టు బ్రతకటం కల్ల
మేం ఒప్పుకోము.. అతి మంచితనంతో అతి నిజాయితీగా 99.9% హామీలు అమలు చేసినా మావోడి గుద్దలోకి 11 ఇంచులు దించి పంగనామాలు పెట్టారు అంటే అంతా ‘EVM ల ఘనత.. So ‘EVM భజన చేస్తూ 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అధికారం మళ్ళీ ప్యాలెస్ gate తన్నుకుంటూ రాదా?? ఏంటీ
గతంలో ఇరవై మూడు సీట్లు గురించి హేళన చేసిన విషయం మర్చిపోతే ఎలా
జాయిన్ అవ్వాలి అంటే
హాయ్
వాళ్ళది కాదు ఘనత .. అంత మనదే .. విడిపోయినోళ్ళని కలిసేలా చేసి .. కుర్చీ వాళ్ళకి ఇచ్చేసి దిగిపోయాం ..
ఓటమి ఎలా ఉంటుందో చూడటానికి సరదాగా ఓడిపోయాడు అను నీ సరదా తీరుతుంది
వాళ్ళని గెలిపించిన ఘనత అంతా మన అతి ప్రజారంజకమైన పరిపాలన ది అయితే నువ్వేంటి వాళ్ళిద్దరిలో ఎవరికో క్రెడిట్ ఇచ్చేస్తావ్?
జాయిన్ కావాలి అంటే
టీడీపీ పవన్ గారి అండ లేకుండా గెలిచి ఉంటే గారంటీ గ వైసీపీ లోని నేరస్తులకు శిక్షలు పడి ఉండేవి కావు లోకేష్ గారిని కూడా ఆయన సముదాయించేవాడు కానీ పవన్ గారు బ్యాండ్ వెయ్యందే వదలడు అందుకే ఆ పాటి ఆక్షన్ అయినా ఇద్దరి కాంబినేషన్ నే జనాలు కోరుకున్నారు బాబు గారి అనుభవం పవన్ గారి స్పీడ్ రెండు అవసరమే