పిఠాపురంలో వ‌ర్మ మూట‌ముళ్లె స‌ర్దుకోవాల్సిందే!

వ‌ర్మ‌తోనూ, టీడీపీతోనూ ఎలాంటి సంబంధం లేకుండా బ‌ల‌ప‌డాల‌నే వ్యూహంలో భాగంగానే జ‌న‌సేన త‌న ప‌ని తాను చేసుకెళుతోంది.

పిఠాపురానికి ఎమ్మెల్సీ కొణిదెల నాగ‌బాబు వెళ్లారు. ఆయ‌న‌కు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. పిఠాపురం, గొల్లప్రోలు మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా పేలుస్తూ, పూల వర్షం కురిపిస్తూ, జేజేలు పలికారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు నాగ‌బాబు చేశారు.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి ఇవాళ నాగ‌బాబు చేతుల మీదుగా జ‌రిగిన ప‌నుల్ని, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేయాల్సి వుంది. కానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ బిజీగా వుండ‌డం, నాగ‌బాబుకు పిఠాపురం బాధ్య‌త‌ల్ని అప్ప‌గించ‌డంతో ఇక‌పై ఆయ‌నే అన్నీ తానై వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్‌తో గొల్లప్రోలు నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని నాగ‌బాబు ప్రారంభించారు. అనంతరం గొల్లప్రోలు హెడ్ వాటర్ వర్క్స్ లో మంచినీటి సరఫరా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను, అలాగే అన్న క్యాంటిన్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ కుమార్, కాకినాడ అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ తుమ్మ‌ల‌ రామస్వామి, కాకినాడ కలెక్టర్ శ్రీ షణ్మోహన్ సగిలి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త వ‌ర్మ అటువైపు తొంగిచూడ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కూట‌మిలో టీడీపీ ప్ర‌ధాన భాగ‌స్వామ్య ప‌క్షం. అయిన‌ప్ప‌టికీ పిఠాపురంలో మాత్రం ఉప్పు, నిప్పులా టీడీపీ, జ‌న‌సేన నేత‌లు క‌ల‌హించుకుంటున్నారు. ఇక‌పై టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ వ‌ర్మ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిలా ఏ ప‌వ‌ర్ లేకుండా రాజ‌కీయ జీవితం గ‌డ‌పాల్సిన దుస్థితి ఏర్ప‌డింది.

ప్ర‌స్తుతం నాగ‌బాబు పిఠాపురంలో అడుగు పెట్ట‌డం వెనుక జ‌న‌సేన‌కు పెద్ద ప్లానే వుంది. వ‌ర్మ‌తోనూ, టీడీపీతోనూ ఎలాంటి సంబంధం లేకుండా బ‌ల‌ప‌డాల‌నే వ్యూహంలో భాగంగానే జ‌న‌సేన త‌న ప‌ని తాను చేసుకెళుతోంది.

23 Replies to “పిఠాపురంలో వ‌ర్మ మూట‌ముళ్లె స‌ర్దుకోవాల్సిందే!”

  1. జగన్ ని వదిలేసి వర్మ గారి మీద ఆశలు పెట్టుకున్నారు, ఎదో రకంగా గట్టెక్కిస్తాడని…. పిఠాపురంలో వర్మ గారిది ఏ పరిస్థితో తెలుగు దేశం గెలిచిన 133 నియోజకవర్గాలలో జనసేన, బీజేపీలది అదే పరిస్థితి…. టీడీపీ కి ఈ పరిస్థితి రాష్ట్రంలో 31 నియోజకవర్గాల్లో ఉంది బీజేపీ, జనసేనలు గెలిచిన చోట…. వైకాపాకి ఓడిపోయారు కనుక రాష్ట్రంలో 175 లోను అదే పరిస్థితి…. సానుభూతి అందరి మీద ప్రకటించు ఒక్క వర్మ గారి మీదే ఎందుకు….

  2. అందరికీ ఒకేసారి అవకాశాలు రాకపోవచ్చు. దానికే ముఠా ముల్లె సర్దుకోవటం ఏంటి ?

  3. ఈ న్యూస్ మొత్తం రెచ్చగొట్టేవిధంగా ఉంది నీకు చెప్పారా ముట ముల్లె సర్దుకోవాలి అని అవే మరి ఏ గస్ట్రాలు అంటే

  4. త్వరలో వర్మ గారి పవర్ ఎంటో జనసేన కి, చంద్ర బాబు నాయుడు గారి కి తెలుస్తుంది. ఇల్లు అలకగానే పండగ అనుకోవద్దు. ఎవరు ఏవిధంగా మూట, ముల్లె ఎవరు సర్దు కొంటారో కాలమే చెప్తుంది వేచిచూడండి.

  5. 20 ఏళ్ల నుంచి వర్మ ఏం చేశాడని ఎలా అయితేనేమి పవన్ కళ్యాణ్ పుణ్యమా అని పిఠాపురం ప్రజలు అభివృద్ధిని చూస్తారు

  6. గ్రేట్ ఆంధ్ర వాడు కూటమి లో చిచ్చు పెట్టాలని ట్రై చేస్తున్నాడు. జాగ్రత్త

  7. వివిధ త్యాగాలు చేసిన జనసేన నియోజక వర్గం ల లో అక్కడి గెలిచిన TDP BJP mla and ministers త్యాగం చేసిన జనసేన నాయకుల్ని నెత్తి మీద పెట్టుకొని ఊరెగుతున్నారా? మర్యాద ఇస్తే అదే మర్యాద తిరిగి వస్తుంది. కలసి ఉంటే డెవలప్మెంట్ లేదా మరల only బటన్ నొక్కుడు.

Comments are closed.