క‌ల్యాణి ప్ర‌శ్నించింది.. క‌ల్యాణ్ స్పందించారు!

వైసీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు, ఆ పార్టీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ల్యాణి గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించారు.

వైసీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు, ఆ పార్టీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ల్యాణి గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించారు. రాజ‌మండ్రిలో ఫార్మ‌సీ విద్యార్థిని నాగాంజ‌లి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డంపై విప‌క్షాలు భ‌గ్గుమ‌న్నాయి. ముఖ్యంగా వైసీపీ తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ అయ్యింది.

ఈ నేప‌థ్యంలో వ‌రుదు క‌ల్యాణి మీడియాతో మాట్లాడుతూ న‌ర‌రూప రాక్ష‌సుడి వేధింపులు భ‌రించ‌లేక సూసైడ్ నోట్ రాసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌న్నారు. 12 రోజులు మృత్యువుతో పోరాడి చివ‌రికి తుది శ్వాస విడిచింద‌ని ఆమె వాపోయారు. త‌న చావుకు ఏజీఎం దీప‌క్ కార‌ణ‌మ‌ని సూసైడ్ నోట్‌లో నాగాంజ‌లి రాయ‌డాన్ని ఆమె గుర్తు చేశారు. దీప‌క్ ప‌నిచేసే కిమ్స్‌లోనే నాగాంజ‌లికి వైద్యం అందిస్తే, స‌రైన ట్రీట్మెంట్ ఎక్క‌డ దొరుకుతుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు.

నాగాంజ‌లి ఆత్మ‌హ‌త్య‌పై సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, హోంమంత్రి అనిత క‌నీసం స్పందించిన దాఖ‌లాలు లేవ‌ని క‌ల్యాణి విమ‌ర్శించారు. ఆడ‌పిల్ల‌ల‌కు అన్యాయం జ‌రిగితే తాట‌తీస్తామ‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ హెచ్చ‌రించార‌ని గుర్తు చేశారు. దీప‌క్ తాట ఎందుకు తీయ‌లేద‌ని డిప్యూటీ సీఎంను ఆమె నిల‌దీశారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎట్ట‌కేల‌కు స్పందించారు. ఫార్మ‌సీ విద్యార్థిని నాగాంజ‌లి ఆత్మ‌హ‌త్య దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేర్కొన్నారు. ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన వ్య‌క్తిపై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. నాగాంజ‌లి సూసైడ్ నోట్ మేర‌కు ఏజీఎంకు చెందిన దీప‌క్‌ను ఇప్ప‌టికే పోలీసులు అరెస్ట్ చేశార‌న్నారు. విద్యార్థిని కుటుంబానికి అండ‌గా వుంటామ‌ని ఆమె తెలిపారు.

5 Replies to “క‌ల్యాణి ప్ర‌శ్నించింది.. క‌ల్యాణ్ స్పందించారు!”

Comments are closed.