మ‌ద్యం కేసులో క‌సిరెడ్డికి షాక్‌

మ‌ద్యం స్కామ్‌లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది.

మ‌ద్యం స్కామ్‌లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ స్కామ్ ప్ర‌ధాన సూత్ర‌ధారి, పాత్ర‌ధారిగా క‌సిరెడ్డి పేరు బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌ద్యం కుంభ‌కోణం కేసులో సాక్షిగా హాజ‌రు కావాలంటూ సీఐడీ అత‌నికి నోటీసులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌ద్యం స్కామ్‌లో ప్ర‌ధాన నిందితుడు క‌సిరెడ్డే అని ఈ మ‌ధ్య విజ‌య‌సాయిరెడ్డి కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే సీఐడీ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రయ్యేందుకు క‌సిరెడ్డి సుముఖంగా లేరు. దీంతో హైకోర్టును ఆశ్ర‌యించాడు. త‌న‌ను హాజ‌రు కావాలంటూ ఇచ్చిన నోటీసుల్ని ర‌ద్దు చేయాల‌ని న్యాయ స్థానాన్ని క‌సిరెడ్డి కోరారు. అత‌ని పిటిష‌న్‌పై విచారించిన హైకోర్టు …నోటీసుల‌పై జోక్యం చేసుకునేందుకు నిరాక‌రించింది. అయితే ఈ ద‌ఫా విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులు ఇచ్చే ముందు, త‌గిన స‌మ‌యాన్ని ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది.

మ‌ద్యం కేసులో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఇప్ప‌టికే హైకోర్టును ఆశ్ర‌యించి, ఆశించిన ఫ‌లితాన్ని సాధించ‌లేక‌పోయారు. మిథున్‌రెడ్డిపై ఎలాంటి నేరారోప‌ణ‌లు లేవ‌ని, కేసు కూడా న‌మోదు చేయ‌లేద‌ని న్యాయ‌స్థానానికి సీఐడీ తెలిపింది. దీంతో అరెస్ట్ చేస్తార‌నే అంశ‌మే ఉత్ప‌న్నం కాదంటూ మిథున్‌రెడ్డి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టేసింది.

తాజాగా విచార‌ణ‌కు హాజ‌ర‌వ‌డానికి స‌సేమిరా అన్న క‌సిరెడ్డి ప‌ప్పులేవీ వుడ‌క‌లేదు. విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందే అని హైకోర్టు తేల్చి చెప్పింది.

5 Replies to “మ‌ద్యం కేసులో క‌సిరెడ్డికి షాక్‌”

  1. ఈ కసిరెడ్డి మన జగన్ రెడ్డి కి బంధువేగా..

    అతి మంచితనము .. అతి నిజాయితీ కలిగిన జగన్ రెడ్డి అయినా చెప్పొచ్చుగా.. ఈ కసిరెడ్డి ని కోర్ట్ కి వెళ్లి లొంగిపొమ్మని..

    కుదరదా..?

    మన బంధువులైతే.. ఎంత దోచేస్తే అంత మంచోళ్ళు.. అంతేనా..

Comments are closed.