జ‌గ‌న్‌ది బ‌ట‌న్ షో, బాబుది గేమ్ షో

జ‌గ‌న్ చేస్తే అప్పు. రాష్ట్రం దివాలా. రిజ‌ర్వ్ బ్యాంక్ ముందు దేహి. బాబు చేస్తే రుణ స‌మీక‌ర‌ణ‌.

ఈ రోజు దిన‌ప‌త్రిక‌లు తిరగేస్తే వింత‌వింత వార్త‌లున్నాయి. ప్ర‌జ‌ల‌కి సంబంధించిన ముఖ్య‌మైన వార్త‌లు కూడా అనుకూల మీడియా ఏ విధంగా ప‌క్క‌న ప‌డేస్తుందో అర్థ‌మ‌వుతుంది.

ఈ నెల 7 నుంచి ఎన్టీఆర్ వైద్య‌సేవా ట్ర‌స్ట్ (ఆరోగ్య‌శ్రీ‌) అన్ని ర‌కాల సేవ‌లు నిలిపి వేస్తామ‌ని ఆస్ప‌త్రుల సంఘం తెలిపింది. రూ.3,500 కోట్ల బ‌కాయిలు ఆగిపోయాయి. ఇక త‌మ వ‌ల్ల కాద‌ని చెప్పింది. సాక్షిలో ఇది ఫ‌స్ట్ పేజీ, ఆంధ్ర‌జ్యోతి, ఈనాడుల‌కి ఇది లోప‌లి పేజీల్లో సింగిల్ కాల‌మ్ వార్త‌. అదే జ‌గ‌న్ హ‌యాంలో అయితే రోగుల‌కి న‌ర‌కం చూపిస్తున్న జ‌గ‌న్ అని బ్యాన‌ర్‌, ఒక‌వైపు వేల మంది రోగుల‌ మందుల‌కి డ‌బ్బుల్లేవు.

మ‌రో వైపు త్రీస్టార్ హోట‌ళ్ల‌లో బార్ ఫీజు రూ.66 ల‌క్ష‌ల నుంచి రూ.25 ల‌క్ష‌ల‌కి త‌గ్గించారు. ప్ర‌స్తుతం లైసెన్స్‌లు లేకుండానే బార్‌లు నిర్వ‌హిస్తున్నందున ఆర్థికంగా వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేద‌ట‌! లైసెన్స్ లేకుండా బార్ నిర్వ‌హిస్తే కేసు పెట్టాలి క‌దా? అది లేకుండా ఫీజు త‌గ్గించి య‌జ‌మానుల‌కి న్యాయం చేశారు. ఫీజు త‌గ్గిస్తే అక్క‌డ మ‌ద్యం ధ‌ర‌లేమీ త‌గ్గ‌వు. వాళ్ల‌కి లాభాలు పెరుగుతాయి.

మ‌రోవైపు గ్రామాల్లో సారా కాస్తే , బైండోవ‌ర్ కేసులు పెడ‌తామ‌ని ఎక్సైజ్ మంత్రి కొల్లు ర‌వీంద్ర అంటున్నారు. అన్ని గ్రామాల్లో బెల్ట్‌షాపులు న‌డుస్తున్న‌పుడు సారా ర‌హిత గ్రామ‌మంటే ఏమిటి?

మ‌ద్యం ఆదాయం పెంచ‌డానికి భారీ ప్ర‌ణాళిక‌లు వేస్తూనే మ‌ద్యం అల‌వాటు మానేందుకు (డీఅడిక్ష‌న్‌) ప‌ది కోట్లు విడుద‌ల చేశారు. వైజాగ్ రామానాయుడు స్టూడియో భూముల్లో 15.17 ఎక‌రాల్ని వెన‌క్కి తీసుకోవాల‌ని నిర్ణ‌యం. 2003లో చంద్ర‌బాబు ఇచ్చాడు. ఈ 22 ఏళ్ల‌లో ఆ స్టూడియోలో తీసిన సినిమాలెన్నో ఎవ‌రికీ తెలియ‌దు. ఇన్నేళ్ల‌లో ఒక్క‌డు కూడా అడ‌గ‌లేదు. ఇపుడు వైసీపీ నుంచి ర‌క్షిస్తార‌ట‌! చంద్ర‌బాబు త‌న అనుకున్న వాళ్ల‌కి సంప‌ద సృష్టించి ఇస్తుంటారు.

రుషికొండ ప్యాలెస్ నిస్సందేహంగా జ‌గ‌న్ చేసిన తెలివిలేని ప‌నుల్లో ఒకటి. ఇపుడు దాన్నేం చేయాలి? ఏదో ఒక‌రోజు చంద్ర‌బాబు దీన్ని 99 ఏళ్ల లీజుకిచ్చి ప్ర‌భుత్వానికి ఆదాయం తెస్తారు.

జ‌గ‌న్ చేస్తే అప్పు. రాష్ట్రం దివాలా. రిజ‌ర్వ్ బ్యాంక్ ముందు దేహి. బాబు చేస్తే రుణ స‌మీక‌ర‌ణ‌. గురువారం నాడు రూ.5,750 కోట్ల అప్పు చేశారు. ఇప్ప‌టికే ల‌క్ష‌ కోట్లు దాటించారు. 8 ఏళ్ల నుంచి 16 ఏళ్ల కాల‌ప‌రిమితితో విడ‌త‌ల‌వారీ అప్పు, వ‌డ్డీ గ‌రిష్టంగా 6.8 శాతం. ఈ మొత్తం అప్పు మ‌న నెత్తిన తీర్చేనాటికి రూ.20 వేల కోట్ల‌తో స‌మానం. ఇదేం పెద్ద విష‌యం కాదు. బాబు ఎలాగో రుణ విముక్తి చేసేస్తాడు.

క‌లెక్ట‌ర్లు రెండు రాత్రులు ప‌ల్లెల్లో నిద్రించాల‌ట‌! ఎందుకు దోమ‌ల‌తో కుట్టించుకోడానికా? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఇంట్లో నిద్రపోతున్నారా? త‌మ ప‌రిధిలోని గ్రామాల్లో ఏం స‌మ‌స్య‌లున్నాయో తెలియ‌నంత అజ్ఞానంలో ఉన్నారా? క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడి ప‌రిష్క‌రించుకోలేరా?

జ‌గ‌నేమో తాడేప‌ల్లి దాటి రాకుండా 11 సీట్లు రిట‌ర్న్ గిఫ్ట్ తెచ్చుకున్నాడు. బాబు జ‌నం మ‌ధ్య‌నే వుంటాడు కానీ, స‌మ‌స్య‌ల‌న్నీ ఎక్క‌డిక‌క్క‌డే వుంటాయి. జ‌గ‌న్‌ది బ‌ట‌న్ షో, బాబుది గేమ్ షో. ఆంధ్రుల్ని తిరుప‌తి వెంక‌న్న కూడా కాపాడ‌లేడు. ఆయ‌న‌కి రెస్ట్ లేకుండా భ‌క్తుల్ని చూపిస్తున్నారు.

20 Replies to “జ‌గ‌న్‌ది బ‌ట‌న్ షో, బాబుది గేమ్ షో”

  1. 3500crs pending bills lo maximum mee tuglak gadu pettinave… 9lakh crores appulu chesi kuda pending bills 1 lakh crores petti.poyadu.. asalu aa psycho gadu 2019 lo power loki rakunda undunte ap ki inni lakshala kotlu appulayyeva…neelanti chillara gallandarni mepadaniki AP ni nasanam chesadu

    1. హాహాహ.. నవ్వలేక చచ్చాను. టీడీపీ సోషల్ మీడియా ఆఫీస్ కి పంపించాను. అప్రూవల్ వస్తే వాట్సాప్ గ్రూప్ లో పెడతారు. tv5 లో చెమ్మ చెక్క మూర్తి డిబేట్ పెడతాడు. రేపు అమీర్పేట సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మొత్తం ఈ జోక్ నుంచి బాబు గారు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ని సృష్టించాడు అని రుద్దుతారు.

  2. ja*** గాడిది బఫూన్ show!! CBN గారిది one man show!! ఎంత నువ్వు కుక్క బిస్కట్ గాడివైతే మాత్రం గంజాయి మొక్కకి (ja***) తులసి మొక్కకి (CBN గారు) కంపారిజన్ ఏంట్రా ఎంకి!!

  3. ja*** గాడిది బఫూన్ show!! CBN గారిది one man show!! ఎంత నువ్వు కు*క్క బిస్కట్ గాడివైతే మాత్రం గం*జా*యి మొక్కకి (ja***) తులసి మొక్కకి (CBN గారు) కంపారిజన్ ఏంట్రా ఎంకి!!

  4. ja*** గాడిది బ*ఫూ*న్ show!! CBN గారిది one man show!! ఎంత నువ్వు కు*క్క బి*స్కట్ గాడివైతే మాత్రం గం*జా*యి మొ*క్కకి (ja***) తులసి మొక్కకి (CBN గారు) కంపారిజన్ ఏంట్రా ఎం*కి!!

  5. ja*** గా*డిది బ*ఫూ*న్ show!! CBN గారిది one man show!! ఎంత నువ్వు కు*క్క*బి*స్కట్ గాడివైతే మాత్రం గం*జా*యి మొ*క్కకి (ja***) తు*ల*సి మొక్కకి (CBN గారు) కంపారిజన్ ఏం*ట్రా ఎం*కి!!

  6. ఎవ్వడొచ్చినా షో మాత్రం ఆపేదే లే!! ఏం పీక్కుంటారో పీక్కోమని ప్రజలకి చెప్తున్నా .

  7. సొంత తల్లి, చెల్లి, మేన అల్లుడు, మేన కోడలు ఆస్తులు కాజేసిన మాడ గజ*న్.

    వాడు వేసిన బిచ్చం ఏరుకుంటూ వారికి వత్తాసు పలుకుతున్న నాట్ గ్రేట్ ఆంద్ర.

Comments are closed.