వేస‌వి అయ్యాక‌…బాబుకి వేడి ప్రారంభం!

చంద్ర‌బాబుకి వ‌చ్చేదంతా క‌ష్ట‌కాల‌మే. ఎన్ని విమ‌ర్శ‌లున్నా జ‌గ‌న్ కంటే చంద్ర‌బాబు మెరుగే.

ఎండాకాలం అయిపోగానే వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డుతుంది. కానీ జూన్ నుంచి చంద్ర‌బాబుకి అస‌లైన వేడి ప్రారంభ‌మ‌వుతుంది. స్కూల్ తెర‌వ‌గానే త‌ల్లికి వంద‌నం ఇవ్వాలి. జ‌గ‌న్ హ‌యాంలో ఆల్రెడీ కొన‌సాగుతున్న అమ్మఒడి ల‌బ్ధిదారులున్నారు. ఆ జాబితానే కొన‌సాగించి, అద‌నంగా ఆ ఇంట్లో పిల్ల‌ల్ని చేరిస్తే స‌మ‌స్య లేదు. కానీ ల‌బ్ధిదారుల్ని స‌గానికి త‌గ్గిస్తార‌ని వినిపిస్తోంది. లేక‌పోతే ప‌థ‌కం అమ‌లు సాధ్యం కాదు. వేల‌కోట్లు కావాలి. త‌గ్గించ‌డ‌మే జ‌రిగితే మ‌హిళ‌ల్లో నిర‌స‌న మొద‌లవుతుంది.

ప‌థ‌కం కోల్పోయిన మ‌హిళ‌లు వ్య‌తిరేకం అవుతారు. దీన్ని ముందుగానే గ‌మ‌నించిన బాబు తెలివిగా పీ4 ప‌థ‌కాన్ని ముందుకు తెచ్చారు. దీని కింద వెయ్యి మంది పిల్ల‌ల చ‌దువుకి స‌హ‌క‌రించినా ఆయ‌న మీడియా ప్ర‌తిరోజూ విద్యార్థులు, త‌ల్లిదండ్రుల ఇంట‌ర్వ్యూలు వేసి చంద్ర‌బాబు వ‌ల్ల బాగుప‌డిన కుటుంబాలు అని క‌థ‌నాలు ఇస్తుంది. త‌ల్లికి వంద‌నం కోతలు బ‌ట్ట‌బ‌య‌లు కాకుండా ఇదో ముంద‌స్తు చ‌ర్య‌.

జూన్ నాటికి విప‌రీతంగా టీచ‌ర్ల రిటైర్‌మెంట్ వుంది. ఇప్ప‌టి వ‌ర‌కు డీఎస్సీ ప్ర‌స్తావ‌నే లేదు. కాల‌యాప‌న చేస్తూ, వున్న‌ టీచ‌ర్ల‌నే స‌ర్దుబాటు చేయాల‌నే ఆలోచ‌న వుంది. దీంతో నిరుద్యోగుల్లో అస‌హ‌నం. వాళ్ల‌కి ఉద్యోగాలు రావు, భృతి రాదు. రెండో ఉచిత సిలిండ‌ర్‌కి టైమ్ ద‌గ్గ‌ర ప‌డింది. ప‌ల్లెల్లో రైతులు అస‌హ‌నంగా ఉన్నారు. జ‌గ‌న్ వుంటే ఈ పాటికి డ‌బ్బులు ప‌డేవ‌ని అనుకుంటున్నారు. ఆటో డ్రైవ‌ర్లు, లాయ‌ర్లు, వృత్తి ప‌నివాళ్లు, చేనేత ఇలా అంద‌రిలోనూ అంత‌ర్లీనంగా నిర‌స‌న వుంది.

ఇంకా బాహాటం కాక‌పోవ‌డానికి కార‌ణం ఇస్తాడ‌నే ఆశ‌. జూన్‌లో ప్ర‌భుత్వం ప్ర‌థ‌మ వార్షికోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుపుకుంటుంది. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కి స‌మాధానం కూడా చెప్పాల్సి వుంటుంది. బీజేపీకి అవ‌స‌రం లేదు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌నాత‌న ధ‌ర్మ అని ఉప‌న్యాసాలు ఇస్తూ త‌ప్పించుకుని తిరుగుతాడు. చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌కి జ‌వాబు చెప్పాల్సిన ప‌రిస్థితి.

జ‌గ‌న్ నిద్ర‌పోకుండా, జ‌నంలో తిరిగితే కూట‌మికి మ‌రీ ఇబ్బంది. అయితే చంద్ర‌బాబు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో దిట్ట‌. ఏదో ఒక కుంభ‌కోణం పేరుతో ఆయ‌న‌, అనుకూల మీడియా క‌లిసి కొంత‌కాలం దృష్టి మ‌ర‌లుస్తారు.

అమ‌రావ‌తి అద్భుతం అంటూ ర‌క‌ర‌కాల ఫొటో స్టోరీలు వ‌స్తాయి. వేల‌కోట్లు అప్పు తెచ్చి భ‌వ‌నాలు క‌డుతున్నారు, పునాదుల‌కి రెట్టింపు ఖ‌ర్చ‌వుతోంది. ఎందుకంటే ఆ నేల స్వ‌భావం అలాంటిది. భ‌వ‌నాలు క‌డితే న‌గ‌రాలు పుట్ట‌వు. మేస్త్రీల‌కి, కూలీల‌కి కొన్ని రోజులు ప‌ని దొరుకుతుంది. ల‌క్ష‌ల మంది అమ‌రావ‌తికి క‌దిలి రావాలంటే అక్క‌డ అంత ఉపాధి వుండాలి. చంద్ర‌బాబు మాట‌లే త‌ప్ప‌, అక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు రాలేదు. అమ‌రావ‌తి అనే బుడ‌గ పేల‌డానికి ఇంకొంచెం టైమ్ ప‌డుతుంది. ఈలోగా జ‌నం సొమ్ము వేల కోట్లు ఖ‌ర్చు అయిపోతుంది.

ప్ర‌తినెలా స‌గ‌టున 10 వేల కోట్ల అప్పు చేస్తున్నారు. పాత అప్పుల‌కి, కొత్త అప్పుల‌కి వ‌డ్డీలు క‌ట్టాలి. ఆల్రెడీ క‌రెంట్ చార్జీలు వ‌డ్డించారు. కొత్త‌గా పెట్రోల్‌, డీజిల్ కూడా వ‌డ్డిస్తారు. సైలెంట్‌గా మ‌ద్యం ధ‌ర‌లు పెరుగుతాయి.

చంద్ర‌బాబుకి వ‌చ్చేదంతా క‌ష్ట‌కాల‌మే. ఎన్ని విమ‌ర్శ‌లున్నా జ‌గ‌న్ కంటే చంద్ర‌బాబు మెరుగే. క‌నీసం ఈ వ‌య‌సులో కూడా జ‌నంలో క‌నిపిస్తారు. జ‌గ‌న్‌కి అధికారం వ‌స్తే స‌ల‌హాదారులే త‌ప్ప ఆయ‌న క‌నప‌డ‌డు.

30 Replies to “వేస‌వి అయ్యాక‌…బాబుకి వేడి ప్రారంభం!”

  1. P4 lo isthe enti..Thallaiki Vandanam peru lo isthe enti..End result pillala badi fees kattatam.>Adi evadu kadithe enti..Erri Pulka gadi laga matladathav

  2. ఏతా వాతా నువ్వు చెప్పేది ఏందంటే…రైతులనుండి, విద్యార్థులనుండి, లాయర్ల దాకా ప్రభుత్వ సొమ్ము మీదే ఆధారపడ్డారు అంటావ్ !!!!

      1. నేను చెప్పేది ఏముంది…రాష్ట్రం లో అందరూ అడుక్కుంటున్నారు….జగన్ గత అయిదు ఏళ్ళు డబ్బులు ఇచ్చి పోషించాడు అంత క్లియర్గా ఉంటే….అంటే అయిదు ఏళ్లలో వారి జీవన ప్రమాణాలు ఏమీ బాగుపడలేదు అని అర్థం

          1. మన న్యుడ్ ఎంపీ , గంట అరగంట మంత్రి, సంజనా మంత్రి వేషాల కన్న ఇప్పుడు పరిస్థితి చాల బెటర్

          2. పార్టీ ఆఫీస్ లో అది ఇంటర్నల్. బయట వేస్తే గబ్బుపట్టిపోయారు

          3. నీ ఇంట్లో ఏమైనా చెయ్యొచ్చు…విధుల్లో నాటకాలు దొబ్బితే వురికించి కొడతారు…అట్ల వీధి నాటకాలు చేస్తేనే 11 వచ్చింది

          4. ఎందుకు లేదు…వై నాట్ కుప్పం అని ఎగిరితే…ఎలెక్షన్ అయిన వెంటనే కుప్పం పార్టీ ఆఫీస్ అమరావతి రెస్టారెంట్ వాల్యూ కటింది. ఇదిగో నిన్నగాక మొన్న తాడేపల్లి పార్టీ సెంట్రల్ ఆఫీస్ కి టులేట్ బోర్డు పెట్టరుగా … ఎవరోకరు వాల్యూ కడతారులే

          5. అప్పులు పరిస్థితి మార్చడానికి మంత్రదండం ఉండదు కొత్త అప్పు చేయక పోయిన పాత అప్పుకు వాయిదా వడ్డీతో కలిపి కట్టాలి దానికోసమేనా అప్పు చేయాలి ఇక అభివృద్ధి పోలవరం శరవేగంగా ముందుకు వెళుతుంది కొత్త పరిశ్రమలు వస్తున్నాయి వైసీపీ హయం లో ప్రయాణానికి పనికి రాకుండా పాడైపోయిన రోడ్స్ ను బాగుచేసారు వైసీపీ వదిలి పెట్టి వెళ్లిన బకాయిలను కడుతున్నారు ముఖ్యం గ రోడ్ మీదకు వచ్చి ధర్నాలు నిరసనలు తెలియచేసే హక్కును తిరిగి పునరుద్ధరించారు బూతు పోస్ట్లు పెట్టి ఇతర బోర్డుర్ లను ఇబ్బంది పెట్టె వారిని అణచి వేస్తున్నారు ఈ విషయంలో ఇంకా వేగం పెంచాల్సివుంది నిరాశ లో వున్నా రాష్ట్రప్రజలకు భరోసా కల్పించి ఉత్సాహపరుస్తున్నారు ఏడాది కాకుండా ఇంకా ఏమిచేయాలి

      1. ఓరి కొండెర్రి అది కూడా అర్థం కాలేదా…ఇంత నిషానిగాడివి ఎలారా? బాబు చేసిన అభివృద్ధి ని కంటిన్యూ చెయ్యకుండా…మూడు రాజధానులు అని ఒకడు, vanpic, ఇందులకు దోచి ఒకడు రాష్ట్రాన్ని సంకనాకించారు

      2. ఓరి కొండె ర్రి అది కూడా అర్థం కాలేదా…ఇంత నిషానిగాడివి ఎలారా? బాబు చేసిన అభివృద్ధి ని కంటిన్యూ చెయ్యకుండా…మూడు రాజధానులు అని ఒకడు, vanpic, ఇందులకు దోచి ఒకడు రాష్ట్రాన్ని సంకనాకించా రు

          1. అందుకే సన్నసోడా మళ్ళీ ఆయనే కావాలి అని ముఖ్యమత్రి నీ చేసారు. ఇక మన తుగ్లక్ పాలన్ చూసాకా వాడికి ప్రతిపక్ష హోదా కూడా బొక్క అని చెప్పారు

          2. అందుకే సన్న సోడా మళ్ళీ ఆయనే కావాలి అని ముఖ్యమత్రి నీ చేసారు. ఇక మన తుగ్ల క్ పాలన్ చూసాకా వాడికి ప్రతిపక్ష హోదా కూడా బొక్క అని చెప్పారు

          3. lol. inko 2 months aagithe janam paccha chokka kanapadithe kotte kottuduki kootami karyakartha ani cheppukodaniki kooda bhayapadaataaru. already kaakameeda vunnaru vooralallo. velli kadipi choodu. zero real estate, zero jobs, zero pathakaalu, zero money rotation, negative gst, no PRC, no DA, – orey ee saari maatram vadiki vacchina 11 kooda raavu roi.

          4. lol. inko 2 months aagithe janam paccha chokka kanapadithe kotte kottuduki kootami janam ki maamool resound radu roi. already kaakameeda vunnaru vooralallo. zero real estate, zero jobs, zero pathakaalu, zero money rotation, negative gst, no PRC, no DA, – orey ee saari maatram vadiki vacchina 11 kooda raavu roi.

          5. lol. inko 2 months lo janam loki velli choodamana ra. already kaakameeda vunnaru vooralallo. zero real estate, zero jobs, zero pathakaalu, zero money rotation, negative gst, no PRC, no DA, – orey ee saari maatram vadiki vacchina 11 kooda raavu roi.

          6. Lol! In another two months Kootami karyakarthas will make zero sound in villages and towns. Zero free sand, zero steel plant, zero real estate, zero jobs, zero pathakaalu, zero money rotation, negative gst, no PRC, no DA. Talk about 2029 later. First let kootami survive until the end of 2026. We will see.

      3. ఒరెయ్ తిక్కల వెధవ …ఎవడిని పిచ్చ కొట్టుడు కొడతారో చూసుకో…గత పది నెలల నుండి సీఎం, డీసీఎం, మంత్రులు అందరూ ప్రజలలోనే ఉన్నారు… జనవరి నుండి తిరుగుతా అని ఇప్పటిదాకా ఇల్లు దాటనిది ఎవడో గజ గజ వనుకుతున్నది ఎవడో తెలుసు..వాడికి తాడేపల్లి బెంగళూర్ షటిల్ కి టైం లేదు.

  3. Amaravathi develop avvalante inka 30 yellu avutundi. Antavaraku TDP ruling lo undadu. Pallapu bhoomulu, panta bhoomulu nu capital ani nasanam chesaru. Future lo amaravathi janale anukuntaru Enduku pettadabba babu ikkada capital ni ani. Ye vijayavada, nellore , Ongole cheste bagundedi

Comments are closed.