మెగా-బాబీ సినిమాకు నిర్మాత ఎవరు?

ఇంత రిస్క్ చేసి, సగం లాధం ఇవ్వడం అన్నది టాలీవుడ్ జనాలకు అంతగా రుచించడం లేదు అన్నది అంతర్గత వర్గాల బోగట్టా.

వాల్తేర్ వీరయ్య లాంటి హిట్ ఇచ్చారు దర్శకుడు బాబీ. మెగాస్టార్-రవితేజ కాంబినేషన్ అది. ఆ తరవాత డాకూ మహరాజ్ సినిమా చేసారు బాలయ్యతో. యావరేజ్ హిట్ అయిన సినిమా అది. ఆ తరువాత మళ్లీ మెగాస్టార్ తోనే సినిమా చేయాలనే దిశగా ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. మధ్యలో అనిల్ సినిమా రాకుండా వుంటే సెట్ అయ్యేదేమో.. కానీ అది ఇప్పుడు ముందుగా సెట్ మీదకు వెళ్లబోతోంది. బాబీ వెయిటింగ్ లిస్ట్ లో వున్నారు. బాలయ్యతోనే మరో సినిమా చేయాలన్నా ఆయన ఖాళీ లేరు. రవితేజ ఖాళీ లేరు. ఇంకెవరు బాబీకి అందుబాటులో వుండేలా లేరు. అందువల్ల బాబీకి మెగాస్టార్ మాత్రమే దిక్కు.

కానీ మెగాస్టార్ అనిల్ సినిమా ఓకె అన్నారు. దసరా డైరక్టర్ తో సినిమా వుంది కానీ అది ఎప్పుడు అన్నది ఫిక్స్ కాలేదు. ఇలాంటి టైమ్ లో మెగాస్టార్ తో సినిమా చేతిలోకి రావడం బాబీకి పెద్ద కష్టం కాదు. కానీ కష్టం అంతా నిర్మాత ఎవరు అన్నదాని కోసమే.

బాబీ అంటే ఖర్చు తెగబారెడు పెట్టిస్తారనే టాక్ వచ్చేసింది. పైగా మెగాస్టార్ అంటే 75 కోట్ల రెమ్యూనిరేషన్. అంటే బాబీ, మెగాస్టార్ రెమ్యూనిరేషన్ కలిపి 90 కోట్లు. ఇక నిర్మాణానికి మరో 80 కోట్లు. అంటే దాదాపుగా 170 కోట్లు. అందుకే బాబీ-మెగాస్టార్ ప్రాజెక్ట్ మీద పెద్ద నిర్మాతలు పెద్దగా ఆసక్తిగా లేరు అని టాక్ వినిపిస్తోంది. మైత్రీ సంస్థ, డివివి దానయ్య బాబీ ప్రాజెక్ట్ విషయంలో మౌనంగా వున్నారని ఇండస్ట్రీలో వినినిపిస్తోంది.

పైగా ఇటీవల మెగా తనయ కూడా రంగ ప్రవేశం చేసారు. అనిల్ రావిపూడి సినిమాలో మెగా తనయకు లాభాల్లో సగం వాటా. పెట్టుబడి ఎలాగూ ఫైనాన్స్ నే కనుక సమస్య ఏమీ లేదు. ఇంత రిస్క్ చేసి, సగం లాధం ఇవ్వడం అన్నది టాలీవుడ్ జనాలకు అంతగా రుచించడం లేదు అన్నది అంతర్గత వర్గాల బోగట్టా. అందుకే బాబీతో సినిమాకు నిర్మాత ఎవరు అన్నది పెద్ద పజిల్ గా వుంది.

6 Replies to “మెగా-బాబీ సినిమాకు నిర్మాత ఎవరు?”

  1. Oka pani chey

    Mega family మీద పడి ఏడవటం కాకుండా జర్నలిజం చేసి బ్రతుకు

    నాలుగు కాలాలు పాటు చల్లగా ఉంటావ్

Comments are closed.