ఓటీటీని కాదని డేట్ వేయగలరా?

ఏ సినిమా ఎప్పుడు రావాలన్న నిర్ణయాధికారం నిర్మాత, హీరో, దర్శకుడి చేతిలోంచి జారిపోయి చాలా కాలం అయింది.

ఏ సినిమా ఎప్పుడు రావాలన్న నిర్ణయాధికారం నిర్మాత, హీరో, దర్శకుడి చేతిలోంచి జారిపోయి చాలా కాలం అయింది. ఓటీటీ వాళ్లు స్లాట్ ఇవ్వాలి, ఇంతకు కొంటామని చెప్పాలి. అది నిర్మాతకు ఓకే కావాలి. అప్పుడే విడుదల తేదీ వస్తుంది. తప్పదు. అందుకే తొందరపడి డేట్ ప్రకటించకూడదు. అలా ప్రకటిస్తే మళ్లీ మళ్లీ వాయిదాలు వేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఓటీటీ డబ్బులు అక్కరలేదు అని చెప్పి విడుదలకు రెడీ కావాల్సి ఉంటుంది. కానీ తొంభై శాతం సినిమాలకు అంత డేర్ స్టెప్ తీసుకునే సీన్ లేదు.

భైరవం సినిమాకు ఫిబ్రవరిలో డేట్ ఇచ్చారు. రాలేదు. తర్వాత ఎప్పుడు వస్తుందీ ఇప్పటివరకు ప్రకటించలేదు. కారణం సింపుల్… ఓటీటీ అమ్మకాలు.

మెగాస్టార్ విశ్వంభర పరిస్థితి అదే. ఇప్పటివరకు ఓటీటీ అమ్మకం జరగలేదు. అందుకే ఒకసారి వేసిన డేట్ వదిలేశారు. తర్వాత డేట్ వేయడమే లేదు.

కన్నప్ప సినిమా ఈ నెల మూడో వారంలో వస్తుందనుకున్నారు. కానీ రావడం లేదు. వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ అన్నారు. కానీ ఓటీటీ అమ్మకాలు కూడా ఓ కారణమే అని వినిపిస్తోంది.

సారంగపాణి జాతకం సినిమా విడుదల ఓసారి వాయిదా పడింది. ఓటీటీ అమ్మకాల అగ్రిమెంట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అది ఓకే అయితే ఈ నెలలో విడుదల ఉంటుంది.

ఇంకా మరో మూడు, నాలుగు సినిమాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఓటీటీ గీత దాటలేవు. అలా అని థియేటర్‌లోకి తెగించి రాలేవు. టాలీవుడ్ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పడానికి ఇదొక కారణం.

3 Replies to “ఓటీటీని కాదని డేట్ వేయగలరా?”

  1. ఈ సినిమాలు ott లో నే చూసేవేమో.. ఆ క్లారిటీ తో ఆవిధంగా ముందుకు పోతున్నారు

Comments are closed.