డి.ఎ లు ఎప్పుడు ఇస్తారో?

ఇప్పటికీ ఒరిగింది ఏమీ లేదు. పిఎఫ్ డబ్బులను మళ్లీ అడ్జస్ట్ చేసింది ప్రభుత్వం. దాని వల్ల ఇప్పటికిప్పుడు ఉద్యోగులకు పెద్దగా లాభం ఏమీ లేదు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డి.ఎ లు వచ్చి చాలా కాలం అయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డి.ఎలు ప్రకటించడం జరుగుతోంది. కానీ జగన్ పాలన హయాం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డి.ఎ లు రేపు అని గోడ మీద రాసుకోవడంతో సరిపోతోంది. ఉద్యోగులకు సంబంధించి పలు నిధులను జగన్ ప్రభుత్వం అటు ఇటు మళ్లించింది. పిఎఫ్ డబ్బులు వేరే స్కీములకు వాడారు. మెడికల్ బిల్లులు పెండింగ్ పెట్టారు. దాంతో ఉద్యోగులంతా ఆగ్రహించారు. తెలుగుదేశం కూటమికి ఓటేసారు. బాగానే ఉంది.

కానీ ఇప్పటికీ ఒరిగింది ఏమీ లేదు. పిఎఫ్ డబ్బులను మళ్లీ అడ్జస్ట్ చేసింది ప్రభుత్వం. దాని వల్ల ఇప్పటికిప్పుడు ఉద్యోగులకు పెద్దగా లాభం ఏమీ లేదు. ఎవరైనా లోన్‌కు దరఖాస్తు చేసుకుంటే తప్ప. మెడికల్ బిల్లులు కూడా అవి పెట్టుకున్నవారి వరకే. అందరికీ లబ్ది చేకూరాలంటే డి.ఎ ల బకాయిలు ఇవ్వాలి. లేదా డి.ఎ అమలు చేయాలి. సాధారణంగా పండగ అంటే డి.ఎ ఇవ్వడం అన్నది ఒక ఆనవాయితీ.

దసరా వచ్చి వెళ్లింది. సంక్రాంతి వచ్చి వెళ్లింది. ఉగాది వస్తోంది. డి.ఎల అమలు లేదు. కొత్త డి.ఎల ప్రకటన లేదు. ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉంది. కోరీ హడావుడి చేసి, గోల గోల చేసి, ఓటేసి మరీ తెచ్చుకున్న ప్రభుత్వం కనుక ఇప్పుడేమీ మాట్లాడలేరు.

పోనీ ఏకంగా పే రివిజన్ కమిటీ వేసి, ఐ.ఆర్ ప్రకటిస్తారేమో అన్న ఆశ ఉంది. కానీ చంద్రబాబు అలాంటివి అన్నీ మళ్లీ ఎన్నికల ముందు కానీ చేయరని ఉద్యోగులు అర్థం చేసుకోవడానికి మరో మూడేళ్లు పడుతుంది.

16 Replies to “డి.ఎ లు ఎప్పుడు ఇస్తారో?”

  1. ఏందీ వెంకట్ రెడ్డి..

    ఉద్యోగుల డబ్బులన్నీ జగన్ రెడ్డి ప్రభుత్వం లో వేరే స్కీములకు మళ్లించేశారా..? అటు ఇటూ మళ్లించేసిందా..? మెడికల్ బిల్లు కూడా పెండింగులో పెట్టారా..?

    ఇదంతా గత అయిదేళ్లు ఏరోజూ.. ఏనాడూ నీ రోత రాతల్లో కనపడలేదే ..?

    మరి ఇవన్నీ అప్పులేగా .. ఈ అప్పుల లెక్కలు ఏ తాళ పత్ర గంధాల్లో రాశారు..?

    మరి ఈ లెక్కలు కాగ్ కి డాక్యూమెంట్స్ ఇచ్చేవాళ్ళా ..?

    గత ఐదేళ్లూ ఏనాడూ ప్రశ్నించని నీ కలం.. ఈ రోజు ఉద్యోగుల మీద తెగ ప్రేమ ఒలకబోసేస్తున్నావు..

    మరి వారం క్రితమే 6500 కోట్ల ఉద్యోగుల బకాయిలు వాళ్ళ అకౌంట్లలో వేశారు.. ఆ ముక్క కూడా రాయాలనిపించలేదు కదా నీకు..

    న్యూట్రల్ జర్నలిజానికి పరాకాష్ట.. కదా..

    ..

    వీళ్ళనే ఓటర్లు అంటారు.. ఇలాంటి వాళ్ళు నీ జగన్ రెడ్డి ఈ జన్మకి మళ్ళీ నమ్మరు.. నమ్మే ప్రసక్తే లేదు.

    1. నికర్సయిన జర్నలిజం. మా గ్రేట్బ్రెడ్డి ది. ఉద్యోగుల కు మొత్తం సొమ్ము బకాయిలు పెట్టీ వల్ల కు రావాల్సిన సొమ్ములు కూడా రాకుండా చేసిన చరిత్ర మనది సుమారు 6 వేల కోట్లు జమ చేసారు ఆఫ్ కోర్స్ అవి వెంటనే కనబడవు కానీ లోన్ లు పెట్టుకునే వారికి అవి ఒక va ram

    2. ///మరి వారం క్రితమే 6500 కోట్ల ఉద్యోగుల బకాయిలు వాళ్ళ అకౌంట్లలో వేశారు.. ఆ ముక్క కూడా రాయాలనిపించలేదు కదా నీకు..///

      .

      అబ్బె! GA కి అలాంటివి కనపడవు, వినపడవు!!

  2. అబ్బో…pf డబ్బులు పడ్డారోజు ఉద్యోగులు జగన్ ని తిట్టిన తిట్లు వింటే ఉరి వేసుకొనేవాడు

  3. PF డబ్బులు వేసేశారు అని DA లు గుర్తుకు వచ్చాయా…2019– 2024 వరకు ఏది ఇవ్వలేదు కదా..అప్పుడు గువ్వలో సీసం పోసుకొని ఉన్నావా

Comments are closed.