కాస్త ఆశ్చర్యకమైన సంగతి ఇది. సూపర్ స్టార్ రజనీతో రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన లింగా సినిమా టేబుల్ ప్రాఫిట్ 50 కోట్లు అట. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు నుంచి అయిదు వేల స్క్రీన్లలో ఈ సినిమా విడుదలవుతుందని అంచనా. దాదాపు అంతటా విడుదల హక్కులు సోలోగా ఈరోస్ సంస్థ తీసుకుంది.
అక్కడి నుంచి ప్రాంతాల వారీగా హక్కులు అమ్ముడయ్యాయి. లెక్కలన్నీ ఎలా వున్నా ఈ ప్రాజెక్టులో నిర్మాతకు యాభై కోట్ల వరకు మిగులు వుందని అంచనా అన్నది సినిమా వర్గాల్లో వినిపిస్తోంది. ఇంత భారీగా హక్కులు అమ్ముడుపోయిన సినిమాపై మంచి అంచనాలే వున్నాయి. అదే సమయంలో భయమూ వుంది.
రజనీ సినిమా ఏ మాత్రం బాగున్నా లాగేస్తుంది అన్న ధీమా..పైగా పాటలు, విజువల్స్ గ్రాండీగా వుండడం ప్లస్ పాయింట్. టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం సినిమాలో ఫ్లాష్ బ్యాక్, బ్రిటిష్ టైమ్ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చింది. పైగా కాస్త ఇలా వచ్చి అలా వెళ్లిపోదు. నిడివి కూడా వుంది. అందువల్ల అది ఏ మాత్రం జనాలకు పట్టినా, సినిమా బ్లాక్ బస్టరే.