యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో ఓ విషయం అలా అలా నివురుగప్పిన నిప్పులా రగులుతోంది. గిల్డ్ లో వున్న పెద్దల్లో పలువురు ఎగ్జిబిటర్లు కూడా వున్నారు. వీరికి ఈ విషయం రుచించడం లేదు. దాంతో దాన్ని పట్టించుకోవడం లేదు. కానీ సీరియస్ నిర్మాతలకు మాత్రం మండిపోతోంది. విషయం ఏమిటంటే బుక్ మై షో యాప్ లో బోట్ రివ్యూలు, బోట్ లైకులు, బోట్ ఇంట్రస్ట్ లు ఎక్కువగా వుంటున్నాయని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.
టికెట్ కొనుక్కున్న వాళ్లు లైక్ నో, రివ్యూనో పెడితే ఓకె కానీ, ఇలా బోట్ రివ్యూలు, లైక్ లు ఎంకరేజ్ చేయడం సరికాదని, అసలు టాలీవుడ్ మీద ఆధారపడి వ్యాపారం చేస్తూ బుక్ మై షో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం సరికాదని, నిర్మాత నాగవంశీ గిల్డ్ గ్రూప్ ల్లో గట్టిగా వాదిస్తున్నారు.
కానీ గిల్డ్ పెద్దలు ఎవ్వరూ స్పందంచడం లేదు..కామెంట్ చేయడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే దాదాపు చాలా మంది గిల్డ్ పెద్దలకు బుక్ మై షో తో బంధాలు వుండడమే కారణం. సినిమా థియేటర్లు వున్న వారంతా బుక్ మై షో దగ్గర వడ్డీ లేని అప్పులు తెచ్చుకున్నవారే. కనీసం రెండు కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు. బుక్ మై షో ఇలా డబ్బులు పెట్టుబడి పెట్టి, ఆ ధియేటర్ల టికెట్ ల అమ్మకాన్ని తన చేతుల్లోకి తెచ్చుకుంటుంది. టికెట్ కు ఇంత అని యూజర్ చార్జీలతో డబ్బులు చేసుకుంటుంది. దాంతో పాటు కార్పొరేట్ బుకింగ్ లు, ప్రకటనలు అదనపు ఆదాయం.
గిల్డ్ లో వున్న దిల్ రాజు, ఆసియన్ సునీల్, యువి వంశీ. మైత్రీ నవీన్ ఇలా అందరికీ థియేటర్లు వున్నాయి. ఇంక వాళ్లు ఏం మాట్లాడతారు? వీళ్లందరి దగ్గర బుక్ మై షో డబ్బులు కోట్లకు కోట్లు వుందని తెలుస్తోంది. నగరంలో ఒక హీరో తయారు చేస్తున్న మల్టీ ప్లెక్స్ కు బుక్ మై షో 20 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.
ఇలా భారీగా పెట్టుబడులు పెడుతున్నందున తన డబ్బులు వెనక్కు ఎలా తెచ్చుకోవాలి అన్నది బుక్ మై షో ఆలోచనగా వుంటుంది. అందువల్ల ఎవరి మాట వినదు. ఈ సంగతి తెలిసిన ఎగ్జిబిటర్ కమ్ నిర్మాతలు ఇక మాట్లాడలేరు.
అందుకే గిల్డ్ లో నిర్మాత నాగవంశీ ఈ బుక్ మై షో విషయంలో వాట్సాప్ గ్రూపుల్లో గోలపెట్టడం తప్ప చేయగలిగింది ఏమీ వుండదు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Ayo