దాదాపు ఏడాదిన్నర కిందటి సంగతి. సంపత్ నంది, సాయిధరమ్ తేజ్ గాంజా శంకర్ అనే సినిమా ప్రకటించారు. అదే టైమ్ లో ‘ఫస్ట్ హై’ అంటూ వీడియో కూడా విడుదల చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాపై తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో దృష్టి పెట్టింది. గాంజా శంకర్ టైటిల్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
హీరో సాయితేజ్, నిర్మాత నాగవంశీ, దర్శకుడు సంపత్ నందితో పాటు పలువురికి నోటీసులు జారీచేసింది యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో. సినిమా టైటిల్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూనే, టైటిల్ మార్చాలని తమ నోటీసులో సూచించింది. అంతే, అక్కడితో ఆ సినిమా ఆగిపోయింది.
అధికారులు సూచించినట్టు టైటిల్ మారిస్తే సరిపోతుంది కదా. ఏకంగా సినిమానే ఆపేయడం దేనికి? ఇదే ప్రశ్న ఈరోజు దర్శకుడికి ఎదురైంది.
“టైటిల్ మార్చమని నోటీసులిచ్చారు. సినిమాకు సంబంధించి ముఖ్యమైన ముగ్గురు వ్యక్తులకు నోటీసులిచ్చినప్పుడు జర్క్ లా ఫీలయ్యాను. నేను వెళ్లి అందర్నీ ఒప్పించే బదులు, నన్ను నేను కన్విన్స్ చేసుకుంటే బెటర్ కదా. అందుకే ఆగిపోయా.”
గాంజా శంకర్ కంటే మంచి స్టోరీ రాసుకొని, ఇప్పుడు ఓదెల-2 సినిమా తీశానంటున్నాడు సంపత్ నంది. అప్పుడు గాంజా శంకర్ ఆగిపోయినా, తిరిగి శంకరుడి మీదే కథ రాసి, సినిమా తీయడం ఆనందంగా ఉందంటున్నాడు. నిజానికి గాంజా శంకర్ ఆగిపోయింది నోటీసులిచ్చినందుకు కాదు, నెగెటివ్ సెంటిమెంట్ గా ఫీలై ఆపేశారు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Ayo