వారం గ్యాప్ లో ఇన్ని పెద్ద సినిమాలా!

వచ్చే ఏడాది మార్చికి జస్ట్ 7 రోజుల గ్యాప్ లో 4 పెద్ద సినిమాలు క్యూ కట్టాయి.

సాధారణంగా సంక్రాంతికి పెద్ద సినిమాల సందడి చూస్తాం. ఒకేసారి 2-3 పెద్ద సినిమాలు రిలీజైన సందర్భాలున్నాయి. మరి వారం తేడాలో 4 పాన్ ఇండియా సినిమాలొస్తే ఎలా ఉంటుంది? ఇది అలాంటి సందర్భమే.

వచ్చే ఏడాది మార్చికి జస్ట్ 7 రోజుల గ్యాప్ లో 4 పెద్ద సినిమాలు క్యూ కట్టాయి. మార్చి నెల 19వ తేదీకి టాక్సిక్ ను విడుదల చేయబోతున్నట్టు ఈరోజు హీరో యష్ ప్రకటించాడు. అదే టైమ్ కు ‘లవ్ అండ్ వార్’ అనే సినిమా కూడా విడుదల కాబోతోంది.

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 20న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే టాక్సిక్ కు, లవ్ అండ్ వార్ సినిమాకు పోటీ పెడుతూ బాలీవుడ్ లో కథనాలు మొదలయ్యాయి

ఈ సంగతి అటుంచితే, ఈ రెండు సినిమాలు రిలీజైన వారం రోజులకు నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇది ఎంత పెద్ద సినిమా అవుతోంది తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో అందరికీ అర్థమైంది. నాని ఈసారి ఏం టార్గెట్ చేశాడో కూడా తెలిసింది.

అయితే అదే రోజు రామ్ చరణ్ నటిస్తున్న కొత్త సినిమాను కూడా విడుదల చేయబోతున్నట్టు ప్రచారం నడుస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ చేస్తున్న సినిమాకు దాదాపు పెద్ది అనే పేరు ఫైనల్ చేశారు. ఈ సినిమాను మార్చి 26న రిలీజ్ చేస్తారనేది తాజా ప్రచారం.

మొత్తానికి వారం గ్యాప్ లో 4 పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి. అయితే ఇంకా ఏడాది టైమ్ ఉంది కాబట్టి, అప్పటికి వీటిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో చూడాలి.

3 Replies to “వారం గ్యాప్ లో ఇన్ని పెద్ద సినిమాలా!”

Comments are closed.