ఓదెల 2..విజువల్స్ వేరే లెవెల్

తమన్నా భాటియా లేటెస్ట్ మూవీ ‘ఓదెల 2’. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది.

తమన్నా భాటియా లేటెస్ట్ మూవీ ‘ఓదెల 2’. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం లో తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రను పోషిస్తున్నారు. ఈ ఏప్రిల్ 17న ఓదెల2 థియేటర్స్ లో విడుదల కానుంది. హారర్, రిలీజ్ డేట్ పోస్టర్ తమన్నాను ఊహించని లుక్‌లో ప్రజెంట్ చేసింది. ఈ సందర్భంగా యూనిట్ మీడియా మీట్ ను నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ.. నేను ఏ సినిమా చేసిన ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉండాలని కోరుకుంటాను. అలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ ని ఇచ్చే సినిమా ఇది. భైరవి క్యారెక్టర్ చేయడం యాక్టర్ గా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్ లో హైయెస్ట్ ఐషాట్ క్లోజప్స్ ఉన్న సినిమా ఇదే. భైరవి క్యారెక్టర్ ని బీలవబుల్, నేచురల్, మ్యాజికల్ గా చూపించడం నిజంగా బిగ్ ఛాలెంజ్. సినిమా ని చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఇది గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా. తప్పకుండా అందరికీ గ్రేట్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’అన్నారు

మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్ కి ఆర్గానిక్ గా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. దీనికి కారణం మీడియా, ప్రేక్షకులు, లార్డ్ శివ. ఈ సినిమా గురించి మంచి మాటలు రాసిన మీడియా వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓదెల సినిమా నాకు ఒక ఎమోషన్. ఉంది. తను లేడీ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది అన్నారు .

యాక్టర్ వశిష్ట సింహ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఓదెల సినిమాతో నాకు స్పెషల్ బాండింగ్ ఉంది. కరోనా తర్వాత అసలు మళ్లీ షూటింగులు జరుగుతాయా అనుకున్న సమయంలో సంపత్ నంది ముందుకొచ్చి ఈ సినిమాని మొదలుపెట్టడం జరిగింది. ఒక మంచి ఉద్దేశంతో మొదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమాలో తమన్నా తో కలిసి యాక్ట్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఇలాంటి సినిమాలు ప్రతి ఆర్టిస్ట్ కి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వరకు 40 సినిమాలు చేశాను కానీ ఇందులో నేను ఎప్పుడూ చేయని ఒక పాత్రని ఇచ్చారు. ఆ క్యారెక్టర్ ఆలోచనకి ఆశ్చర్యపోయాను, అద్భుతంగా వచ్చింది. మీరు తెరపై చూడాల్సిందే. మీ అందరి సపోర్టు కావాలి’అన్నారు

నిర్మాత మధు మాట్లాడుతూ.. మహా కుంభమేళాలో రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కి చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది . చాలా ఆర్గానిక్ గా ఒక విలేజ్ లో జరిగే స్టొరీ ఇది. కంటెంట్ ని నమ్ముకుని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా చేయడం జరిగింది. ప్రతి ఆర్టిస్టు మాకు ఎంతగానో సపోర్ట్ చేసి షూటింగ్ చేశారు. తమన్నా వచ్చిన తర్వాత బడ్జెట్ గురించి ఇంక ఆలోచించలేదు. అజనీష్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్ అదిరిపోయింది. సంపత్ నంది సూపర్ విజన్, డైరెక్టర్ అశోక్ దర్శకత్వం సినిమాని అద్భుతంగా మలిచాయి. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసి ప్రేక్షకులు గొప్పగా ఆస్వాదిస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ అశోక్ తేజ మాట్లాడుతూ.. ఆకలిగా ఉందని అన్నం కోసం సంపత్ నంది దగ్గరికి వెళ్లాను ఆయన నాకు బిర్యాని తినిపించారు. థాంక్యూ సో మచ్ సంపత్ నంది. తమన్నా ఎంతో గొప్పగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఈ సినిమాని చేశారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు.

2 Replies to “ఓదెల 2..విజువల్స్ వేరే లెవెల్”

Comments are closed.