బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తికి ఎట్టకేలకు క్లీన్ చిట్ దక్కింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి సంబంధించి ఈమెపై ఫైల్ చేసిన కేసును సీబీఐ క్లోజ్ చేసింది. ఈ మేరకు కేసు క్లోజింగ్ రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తోంది.
ఐదేళ్ల కిందట, 2020న ముంబయి బాంద్రాలోని తన అపార్ట్ మెంట్ లో శవమై కనిపించాడు సుశాంత్ సింగ్. అప్పటికే సుశాంత్, రియా చక్రవర్తి బ్రేకప్ చేసుకున్నారు.
అయితే సుశాంత్ మృతికి రియానే కారణమంటూ ఆయన తండ్రి 2021లో రియాపై, ఆమె బంధువులపై కేసు వేశాడు. అదే ఏడాది రియా కూడా సుశాంత్ సోదరి, ఓ వైద్యుడిపై కేసు వేసింది. ఈ 2 కేసుల్ని సీబీఐ మూసి వేసింది. ఈ మేరకు ముంబయి స్పెషల్ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.
సుశాంత్ మృతి చెందిన తర్వాత ఈ కేసు ఎన్నో మలుపులు తీసుకుంది. డ్రగ్స్ కోణం బయటపడ్డంతో పాటు, మనీ లాండరింగ్ అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో నార్కోటిక్స్ బ్యూరో, ఈడీ కూడా రంగంలోకి దిగాయి.
ఇందులో భాగమైన ప్రతి దర్యాప్తు సంస్థ రియా చక్రవర్తిని విచారించింది. అలా ఆమె 27 రోజుల పాటు జైళ్లో గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత బెయిల్ పై బయటకొచ్చారు. ఇప్పుడీ కేసును సీబీఐ క్లోజ్ చేసింది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Phapham Riya… WhatsApp university, politics ki bali ayimdhi… Vaadu entha manchi vaadu Ayina, piriki thanam tho chesina paniki entha mandhi suffer ayyaru…
Bathi kunna Tarun fadeout kaledha…. They are passing stars…no need to think as super stars.
good..finally