వైసీపీ ప్రాంచైజీలు!

ప్ర‌తి ఒక్క‌రికీ ఆత్మాభిమానం వుంటుంద‌ని జ‌గ‌న్ గ్ర‌హించాలి.

వైసీపీ ఘోర ప‌రాజ‌యంపాలైనా, ఇంకా ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు న‌డుస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు వీటి గురించి తెలిసినా, అరిక‌ట్ట‌లేని ద‌య‌నీయ స్థితి. వైసీపీలో ఎలా వుందంటే… కొంద‌రికి జిల్లాల‌ను ద‌త్త‌త‌కు రాయించారు. మీ రాజ్యం …మీ ఇష్టం అన్న‌ట్టు వైఎస్ జ‌గ‌న్ వాళ్ల‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో వైసీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్లు ఆడిందే ఆట‌, పాడిందే పాట‌గా వ్య‌వ‌హారం త‌యారైంది.

ఉదాహ‌ర‌ణ‌కు న‌గ‌రిలో రోజాకు వ్య‌తిరేక రాజ‌కీయాల్ని సొంత పార్టీకి చెందిన పెద్ద మ‌నుషులే చేస్తారు. రోజా అనేక‌మార్లు నెత్తీనోరు కొట్టుకుని చెప్పినా, వైఎస్ జ‌గ‌న్ ఏమీ చేయ‌లేక‌పోయారు. చంద్ర‌గిరిలో త‌న కుమారుడిని ఓడించ‌డానికి సొంత పార్టీకి చెందిన వాళ్లే ప్ర‌త్య‌ర్థుల‌కు భారీ మొత్తంలో నిధులు స‌మ‌కూర్చార‌ని జ‌గ‌న్‌కు అంత‌రండికుడిగా చెప్పుకుంటున్న చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి బ‌హిరంగంగానే ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.

అనంత‌పురం జిల్లాలో ఇదే గొడ‌వ‌. ఉర‌వ‌కొండ‌లో విశ్వేశ్వ‌ర‌రెడ్డికి వ్య‌తిరేకంగా ఎమ్మెల్సీ శివ‌రామిరెడ్డి కుటుంబం ఏ ర‌కంగా చేసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. హిందూపురంలో ఏకంగా మాజీ స‌మ‌న్వ‌య‌కర్త‌ను అప్ప‌టి వైసీపీ నాయ‌కుడైన ఎమ్మెల్సీ ఇక్బాల్ అనుచ‌రులు హ‌త్య చేశార‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

ఉత్త‌రాంధ్ర‌, కోస్తా జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి. మ‌రీ ముఖ్యంగా అధికారంలో ఉన్న‌ప్పుడు సొంత పార్టీ కేడ‌ర్‌ను అణ‌చివేసిన నాయ‌కులే, ఇప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లుగా కొన‌సాగుతున్నారు. దీంతో కేడ‌ర్‌లో వాళ్ల‌పై అసంతృప్తి పోలేదు. బ‌ల‌వంతంగా త‌మ‌పై నాయ‌క‌త్వాల్ని రుద్దుతున్నార‌నే వ్య‌తిరేక భావ‌న వుంది. ఇదంతా వ‌ర్గ రాజ‌కీయాల్లో భాగంగానే చూస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ మొద‌ట‌గా పార్టీలో వ‌ర్గ రాజ‌కీయాల‌పై దృష్టి సారించాలి.

పూర్వ కాలం సామంత రాజుల తీరును వైసీపీ గుర్తు చేస్తోంది. వైసీపీలో ఇంకా ఆ పోక‌డ‌లున్నాయి. కేవ‌లం ఐదారుగురు చేతుల్లోనే రాష్ట్ర స్థాయిలో వైసీపీని పెట్ట‌డం మంచిది కాదు. స్థానిక నాయ‌క‌త్వాన్ని ప్రోత్స‌హించాలి. ఇత‌రులు వెళ్లి , పెత్త‌నం చెలాయించ‌డాన్ని ఎవ‌రూ అంగీక‌రించరు. ప్ర‌తి ఒక్క‌రికీ ఆత్మాభిమానం వుంటుంద‌ని జ‌గ‌న్ గ్ర‌హించాలి. ఎవ‌రో వ‌చ్చి, త‌మ‌పై పెత్త‌నం ఏంట‌నే ధిక్కార భావ‌న‌తోనే వైసీపీ ప‌త‌న‌మైంది.

ఉదాహ‌ర‌ణ‌కు కొన్ని వ్యాపార సంస్థ‌లు త‌మ పేరుతో ప్రాంచైజీలు ఇస్తుంటాయి. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కూడా త‌న పార్టీని ప్రాంతాల వారీగా కొంద‌రికి ప్రాంచైజీలు ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. వైసీపీ అనేది రాజ‌కీయ పార్టీ అని, అన్ని ప్రాంతాల వాళ్ల‌ను క‌లుపుకెళ్లాల‌ని, కొంద‌రి చేతుల్లో పెట్ట‌కూడ‌ద‌ని ఇప్ప‌టికైనా జ‌గ‌న్ గుర్తించి, అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు చేప‌ట్టాలి. అప్పుడే ఆ పార్టీకి భ‌విష్య‌త్ వుంటుంది.

23 Replies to “వైసీపీ ప్రాంచైజీలు!”

  1. అదేంటి హెడ్డింగ్ జగన్ చేతకాని తనం.. అని పెట్టాలి కదా.. మన అన్న పార్టీ ఐతే అన్న అమాయకత్వం.. అదే చంబా ఐతే చేతకానితనం…. ఏమిటో న్యూట్రల్ మీడియా కష్టాలు…

  2. ఈ రోజే కొత్తగా వచ్చిన సమస్యలు కావాలి ముందు నుండి మన పార్టీ అంతే ఓడిపోయాం గనుక ఇవన్నీ వచ్చాయి . నార్త్ ఆంధ్ర ఒకరికి సీమ ఒకరికి ఇలా అన్ని పంచేసార్ గా సారు ఉత్తరాంధ్ర లో విజయ సాయి అన్న. చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు

  3. ఏతా వాత నువ్వు చెప్పేది ఏమిటంటే …అన్న పనికిరానోడు అనేగా? ఇంట్లో వదిన, పార్టీలో రీజినల్ కూరుడినటర్లు నడిపిస్తున్నారు అంటావా?

    1. ఎం మాటాడుతున్నారు మన అన్న చేసిన మంచి ప్రతి గడప లోను ఉంది ప్రతి ఇంట్లో ఉంది…నిన్ననే లెటర్ రాసి మోడీ మెడలు వంచారా ..నెక్ట్ ఎలేచ్షన్స్ లో 225 కి 225 పక్కా …

  4. ఆపరా గ్యాసు వెంకీ..

    నీకూ ఓ ప్రాంతం ఇచ్చి సమంతుణ్ణి చెయ్యలేదనే అక్కసు తప్ప… మావోడి లో ఇలాంటి తప్పులు వెదికి, తప్పుడు సలహాలు ఇచ్చి పంగనామాలు పెట్టావ్..

    ఇవన్నీ కాదు కానీ ఓట్లేసేది ‘ఈవీఎంలు.. నిజాయితీ గా, అతి మంచితనం తో, గట్టిగా కళ్ళుమూసుకుని 4 ఏళ్ళు నిద్రపోతే వచ్చే అధికారానికి ప్రతోడు సలహాలు ఇవ్వడమే..

  5. ప్యాలస్ పులకేశి గాడికి, ఒక్కో ఫ్రాంచైజీ నుండి నెల కి ఇంత అని వస్తూ వింటే చాలు.

    మిగతాది పట్టించుకోడు. అంత వె*దవ వాడు.

    ఇప్పుడు నువ్వే రాశావు అడి నిజం అని. శభాష్ వెంక*ట్రెడ్డి..

  6. అసలు పార్టీ నడిచేది మా అన్నయ్య ఇమేజ్ తో నాయకులు కార్యకర్తలు అంతా నిమిత్త మాత్రులు..

    పడే ప్రతి ఓటు మా అన్నయ్య ను చూసే వేస్తారు అటువంటప్పుడు అభ్యర్థి ఎవరు అయితే ఏంటి గెలిచిన వారు కూడా నిమిత్త మాత్రులే నడిపించేదంతా సఖల శాఖా మంత్రి గారిదే..

  7. అసలు పార్టీ నడిచేది మా అన్నయ్య ఇమేజ్ తో నాయకులు కార్యకర్తలు అంతా నిమిత్త మాత్రులు..

    పడే ప్రతి ఓటు మా అన్నయ్య ను చూసే వేస్తారు అటువంటప్పుడు అభ్యర్థి ఎవరు అయితే ఏంటి గెలిచిన వారు కూడా నిమిత్త మాత్రులే నడిపించేదంతా సఖల శాఖా మంత్రి గారిదే..

  8. వై*ఎస్ఆర్ కొడుకు అనే ట్యా*గ్ లేకపోతే, ఈ జ*గన్ అనే మరు*గుజ్జు మెద*డు వాడిని , జనా*లు తమ ఇంట్లో డిస్ట్బిన్ ఏరుకునే చెత్త రిక్షా ఉద్యోగం కూడా ఇవ్వరు.

    కేవలం వైఎస్ఆ*ర్ కొ*డుకు అనే ట్యాగ్ తో నెట్టు*కొచ్చాడు. కనీసం ఆ కృ*త్ణజ్ఞత లేకుండా వైఎస్ఆ*ర్ భా*ర్య పైనే కోర్టు*లో కే*సీ వేసిన పెం*ట వె*ధవ, ఆ ఆస్తులు ఏదో, వీడి సొంత తెలివి తో సంపాదించిఎంట్లు.

    వాడికి ఈ వె*బ్సైట్ వా*ళ్ళు బా*నిస గ బతు*కుతున్నారు. యా*క్.

  9. వైఎ*స్ఆర్ భా*ర్య మీద కే*సు పెట్టిన వాడిని ఇంకా సపో*ర్ట్ చేస్తున్న వైఎ*స్ఆర్ మొద్దు బుర్ర ఫ్యా*న్ లు ఎవ*రు?

Comments are closed.