డీలిమిటేషన్: దామాషా సూత్రమే దక్షిణాదికి న్యాయం!

నిర్దిష్టంగా జనాభా అత్యంత ఎక్కువగా ఉండే ఒక రాష్ట్రాన్ని కొలబద్దలాగా తీసుకొని అక్కడ జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్యను పెంచి, దానిని ప్రాతిపదికగా పెట్టుకోవాలి.

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అని అనడం కంటె.. డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఏర్పాటైన తొలి అఖిలపక్ష సమావేశం చెన్నైలో సఫలవంతంగానే జరిగింది. మరో పాతికేళ్లదాకా డి లిమిటేషన్ చేపట్టాలనే ఆలోచన మానుకోవాలని ఐక్య కార్యాచరణ సమితి ప్రతిపాదిస్తోంది.

1971 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేసిన లోక్ సభ స్థానాల ప్రస్తుత సంఖ్యనే అప్పటిదాకా కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతున్నారు. మరో పాతికేళ్ల దాకా ఈ ప్రక్రియను వాయిదా వేయడానికి కేంద్రం సుముఖంగా ఉంటుందో లేదో తెలియదు కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా డీలిమిటేషన్ జరిగే లాగా మధ్యంతర మార్గాలను జేఏసీ ప్రతిపాదిస్తే ప్రయోజనం ఉండవచ్చును అనేది పరిశీలకుల వాదన.

ప్రస్తుతం రెండు రకాలుగా డీ లిమిటేషన్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న 543 స్థానాలను అలాగే ఉంచుతూ పునర్వ్యవస్థీకరించడం ఒక పద్ధతి. అలాకాకుండా జనాభా దామాషాలో నియోజకవర్గాల సంఖ్య సుమారుగా 850 వరకు పెంచుతూ.. తదనుగుణంగా అన్ని రాష్ట్రాలలో నియోజకవర్గాల సంఖ్యను పెంచడం రెండోపద్ధతి. ఈ రెండు పద్ధతులలో కూడా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.

ఈ దేశం ఎప్పుడైతే కుటుంబ నియంత్రణ తమ జాతీయ అవసరంగా భావించిందో, ఆ సమయంలో దక్షిణాది రాష్ట్రాలే దానిని పాటించాయి. అందుకు మూల్యం చెల్లిస్తున్నట్లుగా ఇప్పుడు ఆ రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది.

మధ్యేమార్గంగా ఏ ఒక్క రాష్ట్రం కూడా సంఖ్యాపరంగా ప్రాధాన్యాన్ని కోల్పోకుండా దామాషా ప్రకారం మాత్రమే ఎంపీ నియోజకవర్గాల సంఖ్యను పెంచితే ఎవరికీ వ్యతిరేకత ఉండదనే అభిప్రాయం ప్రజలలో వ్యక్తం అవుతుంది. నిర్దిష్టంగా జనాభా అత్యంత ఎక్కువగా ఉండే ఒక రాష్ట్రాన్ని కొలబద్దలాగా తీసుకొని అక్కడ జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్యను పెంచి, దానిని ప్రాతిపదికగా పెట్టుకోవాలి.

ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో స్థానాలు రెట్టింపు చేయవలసి వస్తే దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలలో కూడా జనాభాతో సంబంధం లేకుండా ఎంపీ నియోజకవర్గాలు రెట్టింపు చేస్తూ పోవాలి. అలా జరిగినప్పుడు మాత్రమే అన్ని రాష్ట్రాలకు సమన్యాయం సాధ్యమవుతుంది.

బిజెపి తమకు బలం ఉన్న రాష్ట్రాలలో సీట్ల సంఖ్య పెరిగేలా అడ్వాంటేజీ తీసుకోవడానికి డి లిమిటేషన్ లు కుట్రపూరితంగా అమలు చేస్తున్నదనే అపకీర్తిని మూటకట్టుకోకుండా ఉంటుంది. పారదర్శకంగా అందరికీ న్యాయం జరిగేలా చేయడం అంటే.. కచ్చితంగా రాష్ట్రాల మధ్య దామాషా ప్రకారం సీట్ల సంఖ్యను పెంచడం ఒక్కటే మార్గమని నిపుణులు కూడా సూచిస్తున్నారు.

14 Replies to “డీలిమిటేషన్: దామాషా సూత్రమే దక్షిణాదికి న్యాయం!”

  1. ఇంతకు దామాషా పై రాయలేదు..అసలు విషయం లేకుండా నీ రొడ్డ కొట్టుడు సోది ఎందుకు?

  2. ప్రశ్నించడం వేరు, విమర్శించడం వేరు అని ఎవరైనా చెప్పండయ్యా ???…సస్పెండ్ చేయడం శాఖ పరం గ చర్యలు వేయించడం వేరు P0l!CE C@&E పెట్టడం వేరు….సదురు meo ఎం మాటాడడో కూడా పూర్తి గ చెప్పండయ్యా….ప్రభుత్వ ఉద్యోగుల పని ప్రభుత్వం హామీ లు అమలు చేయడం మీద ఉండాలి కానీ తనకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం కాదు అని కూడా చెప్పండయ్యా

  3. దామాషా పద్దతిలో అంటే ,సంఖ్య పెరిగి, జీతభత్యాలు, సౌకర్యాలు పెరిగి భారత ఆర్థిక వ్యవస్థ పై పెనుభారం పడుతుంది తప్పితే ఉపయోగం శూన్యం . ఇప్పుడు ఉన్న 540 ఎంపీలే అధికం, ప్రతి ఎలక్షన్స్ పోటీలో ఉండి గెలిచిన కొత్త ఎంపీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నరు, మధ్య తరగతి, దిగువ వర్గాలు అలాగే ఉన్నాయి. నీతి , నిజాయితీ అనేది ఉంటే రాజకీయాల్లో పనికి రారు అనే ముద్ర బలంగా ఉండడంతో అందరూ అవినీతి వైపు తమ గమ్యాన్ని నిర్దేశించుకుంటున్నారు.

  4. మతాల వారీగా కూడా జనాభా లెక్కలు తీస్తే అసలు నిజాలు బయటకి వస్తాయి.

    99 శాతం గొర్రె బిడ్డ లు హిందువులు అని చెప్పుకుని దొం*గ బతుకులు బతుకుతూ , అసలైన ద*ళిత హిందు*వులు కి చెందాల్సిన అవకాశాలు తాము అనుభవిస్తూ వుంటారు.

    జగ*న్ రె*డ్డి క్రైస్త*వుడు. అయినా రికా*ర్డుల్లో హిం*దూ మ*తం అని అబ*ద్ధం అని వుంటది. అతను కూడా రెడ్డి తోక వేసుకుని హిందూ మతం వలన వచ్చిన డాంబి*కం వదులుకోకుండా హిం*దూ డ్రామా లు వేస్తూ వుం*టారు.

  5. నేడు సభలో ఉన్న కాస్త ప్రాతినిధ్యానికే మన మాటకు విలువలేకుండా చేశారు, అది తగ్గితే మన పరిస్థితి అరణ్యరోదనే. ఇప్పటికే వనరులన్నీ దోచుకెళ్లి ఆ కొద్ది రాష్ట్రలకే పంచుతున్నారు, ఇంక భవిష్యత్తు లో దానికి అడ్డూ అదుపూ ఉండదు. బయటకు చెప్పుకునేది జాతీయ వాదం, అమలుపరిచేది ప్రాంతీయ వాదం. ఇప్పుడు నోరువిప్పక పోతే అది దిద్దుకోలేని చారిత్రాత్మక తప్పిదం, భవిష్యత్తు తరాలు వీళ్లని ఎప్పుడూ క్షమించవు.

Comments are closed.