ఒక్కొక్కటి వదిలించుకుంటున్న పవన్?

హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్ని పూర్తిచేసి, కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని పవన్ డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది

పవన్ కల్యాణ్ చేతిలో లెక్కప్రకారం 3 సినిమాలున్నాయి. ఈ 3 కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడీ సినిమాలన్నింటినీ ఒక్కొక్కటిగా వదిలించుకునే పనిలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపై ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితం కానున్నారు.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మొదలుపెట్టారు పవన్. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. ఈ సినిమాను ఇక ముందుకు తీసుకెళ్లకూడదని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఓవైపు రాజకీయాల్లో కొనసాగుతూ, మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ కు కాల్షీట్లు కేటాయించడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదనే విషయాన్ని పవన్ గ్రహించారు.

ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను కూడా పవన్ కల్యాణ్ పక్కనపెట్టారు. రామ్ తళ్లూరి నిర్మాతగా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. సినిమాను కూడా అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమా సెట్స్ పైకి రావడం కష్టమనే విషయాన్ని ఒక సందర్భంలో నిర్మాత ప్రస్తావించారు. అదే ఇప్పుడు నిజమైంది.

ఈ లెక్కన చూసుకుంటే, హరిహర వీరమల్లు పార్ట్-2 కూడా రావడం కష్టమే. పైకి చెప్పకపోయినా, పవన్ సౌలభ్యం కోసమే ఈ సినిమాను ఆఖరి నిమిషంలో 2 భాగాలు చేశారు. దాదాపు 90శాతం పూర్తయిన మొదటి భాగానికే పవన్ కాల్షీట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి. ఇక రెండో భాగం రాదనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే ఈ సినిమాల్ని ఆపేయాలంటే తెరవెనక చాలా సర్దుబాట్లు చేయాల్సి ఉంటుంది. మైత్రీ నిర్మాతలు ఆల్రెడీ పవన్ కు కోట్ల రూపాయలిచ్చారు. అటు దర్శకుడు, హీరోయిన్ కు అడ్వాన్సులిచ్చారు. ఆ లెక్కలు తేలాల్సి ఉంది. ఇటు రామ్ తళ్లూరి కూడా పవన్ కు అడ్వాన్స్ ఇచ్చారు. తన సొంత డబ్బు పవన్ కు ఇచ్చానని, బయట నుంచి ఫైనాన్స్ తీసుకురాలేదని ఆయన స్పష్టం చేశారు. పవన్ అది కూడా సెటిల్ చేయాల్సి ఉంది. మరోవైపు పవన్-ఏఎం రత్నం మధ్య లావాదేవీలు మరింత జటిలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా ఏళ్ల కిందటి ప్రాజెక్టు ఇది.

మొత్తానికి హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్ని పూర్తిచేసి, కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని పవన్ డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే, పవన్ కెరీర్ లో చివరి సినిమా ఓజీ అవుతుంది.

27 Replies to “ఒక్కొక్కటి వదిలించుకుంటున్న పవన్?”

  1. పవన్ గారు. మన వల్ల నిర్మాతలు ఎదవ కూడదు. స్వంత వాళ్ళకి మొదట న్యాయం వెయ్యండి . కొన్ని రోజులు సినిమాలకి కేటాయించి ఇంకొన్ని రోజులు ప్రజా సేవ కు ఇలా చెయ్యాలి . 15 రోజులు ప్రజలు 15 రోజులు సినిమాలు అప్పుడు ఎవరికి నష్టం ఉండదు

    1. ఆరోగ్య సమస్యలు వలన డిలే అవుతున్నట్లున్న యి.నిన్న కర్నూలు సభలో కూడా ఆరోగ్య గురుంచి ప్రస్తావించాడు.

  2. సిన్సియర్ రిక్వెస్ట్…. కలిసి కాపురం చెయ్యకపోయినా, మీ నాలుగో పెళ్ళాన్ని మాత్రం వదిలి0చుకోవద్దు సార్. ఈరోజు కాకపోతే రేపు మీకు ఆ సుఖం అందిస్తుంది.. ఎంతైనా A1 పెళ్ళాం సార్ అది

  3. బాబ్బాబు..నీతో కాపురం చేయకున్నా, అతి మంచితనం ఉన్న మీ నాలుగో A1పెళ్ళాన్ని మాత్రం వదిలించుకోవద్దు ప్లీజ్ ప్లీజ్..

    ముందు ముందు సర్ది చెప్పి కాపురానికి పంపించే భాద్యత మాది..

    లేక

  4. బాబ్బాబు..నీతో కాపురం చేయకున్నా, అతి మంచితనం ఉన్న మీ నాలుగో A1పెళ్ళాన్ని మాత్రం వదిలించుకోవద్దు ప్లీజ్ ప్లీజ్..

    ముందు ముందు సర్ది చెప్పి కాపురానికి పంపించే భాద్యత మాది..

  5. ఇందులో కూడా బాలినేని ఆశలు ఆడి ఆశలేనా?? పవన్ కల్యాణ్ తో సినిమా తీస్తా అన్నాడు గా బాలినేని

  6. జ*గన్ రె*డ్డి అనే ఒక మామూలు అతను మాత్రం ఇంట్లో దాక్కుని బయటకి రావడం లేదు..

    ఎంఎ*ల్ఏ జీ*తం మాత్రం నొక్కేస్తున్నాడు, సిగు లేకుండా.

    పవన్ నీ చూసి, భయం తో దయపర్ లో మూ*త్రం పోసుకుంటున్నాడు అని జనాలు అనుమానం.

    1. ఒరేయ్ లుచ్చా ఈ కతేంటి నీవు రాసిన విమర్శ ఏమిటీ, జగన్కి ఈ వ్యాసానికి సంభంధం ఏమైనా వుందా, ఆయన పవన్ సినిమా ల గురించి రాస్తే నీవు జగన్ ఎమ్మెల్యే జీతం గురించి చెబుతావు. నీకు తెలుసా ఆయన జీతం తీసుకోలేదని, కావాలంటే సహచట్టం ద్వారా తెలుసుకోరా జీతం తీసుకొంటున్నాడా లేదా అని

    1. ఎలా ఓడిపోతాడు? మీ దద్దమ్మ గాడు బెంగుళూరు లో కూర్చుంటే పార్టీ పడకేస్తుంది, ఆ తర్వాత పార్టీ ఉంటుందో లేదో

  7. Pawan Kalyan is a mass hero. He can continue doing films along with politics. He is Deputy CM of Andhra Pradesh. I admire Pawan Kalyan garu a lot. He is a very active and robust politician and a very successful film actor. He is the undisputed hero of the telugu film masses. His popularity and image will remain intact if he works in both films and politics. It is a wonderful combination wherein he can retain his popularity among the masses and we all wish him great success.

Comments are closed.