తెలుగుదేశం జెండా.. అడిగి.. తీసుకుని మరీ..!

తెలుగుదేశం కానీ, బాలయ్య కానీ దగ్గరకు తీయకపోయినా, తాము దగ్గరగానే వున్నాము అనే సందేశం అభిమానుల్లోకి పంపడానికా?

డెవిల్ అనే సినిమా చేసారు నందమూరి కళ్యాణ్ రామ్. మంచి వైవిధ్యమైన పీరియాడిక్ సినిమా. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయింది. ఎందుకు మిస్ ఫైర్ అయింది. నిర్మాత ఎందుకు నష్టపోయారు అంటే టాలీవుడ్ లో ఓ రీజన్ ను స్ప్రెడ్ చేసారు. ఎన్నికల ముందు విడుదలయింది ఆ సినిమా. ఆ టైమ్ లో గ్రేట్ ఆంధ్ర ఇంటర్వూలో, మీ ఓటు ఎవరికి అనే ప్రశ్న ఎదురయింది కళ్యాణ్ రామ్ కు. ఆ ప్రశ్నకు ఆయన సులువుగా సమాధానం చెప్పవచ్చు. మా ఓటు ఇంకెవరికి, మా తాత పార్టీ తెలుగుదేశం వుంది కదా అని. కానీ అలా చెప్పలేదు. తను, తన సోదరుడు ఎన్టీఆర్ మాట్లాడుకుని డిసైడ్ అవుతాము అనేట్లు సమాధానం ఇచ్చారు.

ఆ ప్రశ్న అడగడం తప్పు అని, అందువల్లే తెలుగుదేశం అభిమానులు ఆ సినిమాకు దూరమై, సినిమా ఆడలేదని అంటారు టాలీవుడ్ లో తెలుగుదేశం అనుకూల జనాలు చాలా మంది. అనవసరంగా ఓ ప్రశ్న వల్ల నిర్మాత నష్టపోయారు అనడం ఎక్కువగా వినిపించింది. అంతే తప్ప కళ్యాణ్ రామ్ సమాధానం తప్పు అనరు.

కట్ చేస్తే, ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే సినిమా చేస్తున్నారు కళ్యాణ్ రామ్, ఈ నెలలో విడుదల. ఈ నేపథ్యంలో పాట విడుదలకు నరసరావుపేటకు వెళ్లారు. అక్కడ ఫ్యాన్స్ భారీ ఊరేగింపు తీసారు. బాలయ్య- ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ ల కాంబో ఫ్లెక్సీలు కట్టారు. ఈ టైమ్ లో ఎవరో కార్యకర్త తెలుగుదేశం జెండా పట్టారు. అది చూసి, ఓపెన్ టాప్ లో వున్న కళ్యాణ్ రామ్ అడిగి మరీ ఆ జెండా తీసుకున్నారు. కాసేపు దాన్ని గాలిలో ఊపారు. తరువాత ఇచ్చేసారు.

అంటే తన తప్పును కరెక్ట్ చేసుకుంటున్నట్లా? తెలుగుదేశం కానీ, బాలయ్య కానీ దగ్గరకు తీయకపోయినా, తాము దగ్గరగానే వున్నాము అనే సందేశం అభిమానుల్లోకి పంపడానికా? లేక సినిమా హిట్ కావాలని ప్రయత్నమా?

23 Replies to “తెలుగుదేశం జెండా.. అడిగి.. తీసుకుని మరీ..!”

  1. మొత్తనికి ఆ విదంగా అప్పట్లొ పుల్ల వేసాను అంటావ్! ఇక ఇప్పుడు జనసెన మీద పడ్డావ్!!

  2. ఆ జండా ఎపిసోడ్ సరిగ్గా సినిమా రిలీజ్ ముందు భలేగా ప్లాన్ చేశారు. జనాలు అంత వెర్రి వెధవలు అని వీళ్ళ ఉద్దేశం కాబోలు.

  3. పార్టీ మీద ఒక సామాన్య కార్యకర్త “అంజిరెడ్డి తాత” లాంటి వారికి ఉన్నంత కమిట్మెంట్ కూడా లేదు ఈనాయాళ్ళకి.. So just leave them డా..

    ఈడు పెంచి పోషించిన చెంచాగాళ్ళే సొంత”ఇంటి ఆడపడచు” ని అనరాని మాటలతో అవమానించి, ఏడిపిస్తే, ఏమీ అనలేని చవట సన్నాసులు.. తూ… ఎందుకురా మీరు?? అవసర0 లో ప్రత్యర్థులకి ఉపయోగపడే మీరు.. ఉన్నా లేనట్టే

  4. కళ్యాణ్రామ్ అండ్ కో ఫార్టీ వాళ్లు ఏమి చేసినా అది వాళ్ళ సావిషయము సొంత విషయం . ఏమి చేయాలో ఏం చేయకూడదు వాళ్లకి బాగా తెలుసు . మధ్యలో నీ లొల్లి ఏమిటి ? నువ్వేమైనా అరిచే వాడివా తీర్చే వాడివే ? డెవిల్ సినిమా తీశాడు ఆర్థికంగా నష్టపోయాడు నువ్వేమైనా ఆదుకున్నావా

    లేదు కదా ? అటువంటి అప్పుడు వాళ్ల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం నీకు ఏముంది ?

    ముందు మీ గ**** కడుక్కోండి తర్వాత ఇతరుల గుద్దలు కడుగుదురు గాని .

  5. మరి మావయ్య టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలి కదా అక్కడే ఉంది లాజిక్

Comments are closed.