చిన్న తెర మీద తిరుగు లేని విజయాలు సాధించిన యాంకర్ ప్రదీప్, ఇప్పుడు హీరోగా నిలదొక్కుకోవాలని రెండో ప్రయత్నం చేస్తున్నారు. అదే… అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. పది రోజులు ముందుగా ట్రైలర్ విడుదల చేశారు. సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్న కుర్రాడు ఓ ఊరికి వెళ్లి అక్కడ పడిన ఇబ్బందులు, సివిల్ ఇంజనీర్‌ను పెద్ద మేస్త్రీ అనుకునే జనం, ఆ ఊరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన అమ్మాయి. ఇటు ఊరిలో ఇరుక్కోవడం, అటు ప్రేమలో ఇరుక్కోవడం… ఇదీ సినిమా లాక్ పాయింట్. మిగిలిన సినిమా ఆ కథే.
ట్రైలర్ కట్ నార్మల్ గానే వుంది. ప్రదీప్ లాంటి బడ్డీ అప్ కమింగ్ హీరో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాల దృష్టిలో పడాలి. సినిమా మీద ఆసక్తి కలగాలి అంటే ఈ మాత్రం కంటెంట్ సరిపోదు. అంతకు మించి కావాలి. ఇటు ఫన్ అయినా పక్కన సత్య వున్నాడు కనుక ఓకె. కానీ కేవలం సత్య తోడుతో ఎంతకని పుల్ చేస్తాడు హీరో అన్నది పాయింట్.
తొలి సినిమాతో ప్రదీప్ ఓకే అనిపించుకున్నాడు. కాస్త గ్యాప్ ఇచ్చి, మళ్లీ సినిమా చేస్తున్నప్పుడు తప్పకుండా సమ్ థింగ్ డిఫరెంట్, సమ్ థింగ్ మోర్ అని చూడాలి. ఈ సినిమా బాగుండవచ్చు, విడుదల తర్వాత జనాలకు నచ్చవచ్చు. అది వేరే విషయం. కానీ ముందుగా పుల్లింగ్ ఫ్యాక్టర్, అట్రాక్షన్ గట్టిగా ఉండాలంటే ఈ సబ్జెక్ట్ సరిపోవడం, దానికి ఈ ట్రైలర్ కట్ సరిపోవడం మీద కాస్త సందేహం ఉందని చెప్పాలి.
ఇంట్రెస్ట్ ఉంటే నా డీపీ చూడండి
ఎదో పాపం కష్టం పడుతున్నాడు. వీలైతే ఎంకరేజ్ చెయ్యి.