అమరావతిలోనూ అవధాన పీఠం?

చంద్రబాబుకు అనుకూల పంచాగ శ్రవణం చేసారో లేదా అవధాన సరస్వతీ పీఠం బ్రాంచ్ అంటూ అమరావతిలో కూడా స్థలం కోసం ఓ దరఖాస్తు చేస్తారో?

కార్పొరేట్ కంపెనీల మాదిరిగానే వుంటాయి యోగాశ్రమాలు, పీఠాలు, ఆశ్రమాలు కూడా. రాష్ట్రానికి ఓ బ్రాంచ్ వుంటుంది. వాటి పేరు చెప్పి, అవకాశం, మాట పలుకుబడి వున్నవారు వీలయినంత తక్కువ రేటుకు ప్రభుత్వ భూమి సంపాదించుకుంటారు. దానికి ఆశ్రమం అని, సేవ అని, వేద విద్య అనీ, యోగవిద్య అనీ ఇలా రకరకాల పేర్లు, ప్రొఫైల్ వుండనే వుంది.

హైదరాబాద్ లోని చాలా ఖరీదైన కీలక ప్రాంతంలో, హైటెక్స్ కు వెళ్లే జంక్షన్ కు అతి సమీపంలో వుంది శతావధాని మాడుగుల నాగఫణి శర్మ అవధాన సరస్వతీ పీఠం. ఈ పీఠం కార్యకలాపాలు ఏమిటో, అంత ఖరీదైన ప్రభుత్వ స్థలం చంద్రబాబు హయాంలో నాగఫణి శర్మకు ఎలా ఇచ్చారో వివరాలు మనకు తెలియదు. ఇవ్వడమైతే ఇచ్చేసారు. అందులో ఆయన ఇల్లు, సరస్వతి ఆలయం, ఓ సభా మండపం నిర్మించుకున్నారు. సభా మండపాన్ని అద్దెకు ఇస్తారు. మామూలు రోజుల్లో అక్కడ ఏ కార్యక్రమం జరిగే దాఖలా అయితే వుండదు.

ఇప్పుడు సదరు నాగఫణిశర్మ మొన్న ఉగాది నాడు అమరావతిలో పంచాంగ శ్రవణం చేసారు. నిజానికి అవధానం చేసే వారికి జ్యోతిష్య శాస్త్రం, ముహుర్త శాస్త్రం, పంచాంగ రచన తెలిసి వుండాలనీ లేదు. వుండకూడదని లేదు. పంచాంగం చేతిలో పట్టుకుంటే కాస్త బుర్రలో గుంజు వున్న ఎవరైనా పంచాంగ శ్రవణం చేసేయవచ్చు. అది వేరే సంగతి.

ఇంతకీ మాడుగుల నాగఫణి శర్మ ఏమన్నారు. అమరావతిని ఎవరూ కదల్చలేరు. ఎందుకంటే అటు కనకదుర్గమ్మ తల్లి, ఇటు అమరేశ్వరుడు దానికి రక్షగా వున్నారు. అందువల్ల అమరావతిని కదల్చలేరు. అంటే మరి మిగిలిన ప్రాంతాలకు ఈ అమ్మ..అయ్య..రక్షగా వుండరా? కేవలం అమరావతికి మాత్రమే వుంటారా? లేదా విశాఖకు సింహాద్రి అప్పన్న రక్షకుడిగా వుండరా?

రాజధాని రాజకీయాల్లోకి దేవుళ్లను లాగడం అంటే ఇదే. నాగఫణిశర్మకు చంద్రబాబు అంటే అభిమానం వుండడంలో అభ్యంతరం లేదు. అనుమానం లేదు. ఎందుకంటే కోట్ల ఖరీదైన స్థలం ఆయనకు లభించింది చంద్రబాబు వల్లనే. బహుశా అందుకే చంద్రబాబుకు అనుకూల పంచాగ శ్రవణం చేసారో లేదా అవధాన సరస్వతీ పీఠం బ్రాంచ్ అంటూ అమరావతిలో కూడా స్థలం కోసం ఓ దరఖాస్తు చేస్తారో?

పెద్దలు ఓ మాట అంటే దాని వెనుక అర్ధం, పరమార్థం వేరే వుంటాయి.

15 Replies to “అమరావతిలోనూ అవధాన పీఠం?”

  1. Swamylaki lands ఇవ్వటం ప్రోత్సాహం ఇవ్వడం తప్పు కాదు గాని తరువాత abi హిందూ మతానికి మతం సేవ కి ఎంత వరకు ఉపయోగ పడుతున్నారో చూడాలి. ప్రజలకి అందుబాటు లో యజ్ఞాలు యాగాలు చేస్తూ ప్రవచనాలు చేస్తూ వాళ్ళు దేవుని సేవ కి జీవితం అర్పణం చెయ్యాలి అప్పుడే దానికి సార్థకత

  2. వైజాగ్ స్వాములోరికి స్థలాలు ఇచ్చినప్పుడు ఏమి రాయలేదు ఎందుకు వెంకటరావు ..

  3. అమరావతి ని ఎవరు కదలచలేరు .. అయన అన్నది నిజమే కదా .. ఏమి నీకు తెలీదా మనం ఎంత ప్రయత్నం చేసిన .. మనల్నే కదిల్చేసారు జనాలు అని ..

  4. మహా మేత చెల్లి విమల రెడ్డి కి వైజాగ్ లో వొందల ఎకరాలు చర్చి , ఇల్లు నిర్మాణానికి జగన్ రెడ్డి ఇచ్చాడు కదా అది రాయలేదు ? అలాగే వైజాగ్ లో వీసా రెడ్డి కూతురికి అక్రమంగా 150 ఎకరాలు ఎవరి సొమ్ము అని రాసిచ్చాడు జగన్ రెడ్డి ?

  5. మాడు పగిలిన గు–ల తీరదు అంటే మాడుగుల! ఆశ్రయం ఇచ్చిన చేతిని కరవాలని చూసే అభినవ నాడీఝంగుడితడు

Comments are closed.