మ్యాడ్ 2 ఇరవై కోట్ల లాభాలు

తొలి నాలుగైదు రోజుల్లో తీసుకున్న అడ్వాన్స్ లు వెనక్కు వస్తే, మిగిలిన రన్ లాభాలకు మరింత నెంబర్ ను యాడ్ చేస్తుంది.

అదృష్టం అంటే చిన్న సినిమా పెద్ద హిట్ కావడం. పెద్ద సినిమా పెద్ద హిట్ అయినా పెద్దగా లాభాలు రావడం కష్టం. కానీ చిన్న సినిమా పెద్ద హిట్ అయితే డబ్బులు కుప్పలు తెప్పలుగా పడతాయి. సరైన ఫన్ జానర్ సినిమాకు సీక్వెల్ వస్తే, జనం ఎలా ఎగబడతారు అన్నది ప్రూవ్ చేస్తోంది మ్యాడ్ 2. మ్యాడ్ సినిమా చిన్నగా వచ్చి మంచి వసూళ్లు తెచ్చుకుంది. ఆ వసూళ్లను బేస్ చేసుకుని మ్యాడ్ 2 ను విడుదల చేసారు.

మ్యాడ్ 2 కు గట్టిగా 20 కోట్లు ఖర్చు అయింది. విడుదల టైమ్ కే 15 కోట్లు టేబుల్ ప్రాఫిట్ చేసుకున్నారు. నాన్-థియేటర్, థియేటర్ విక్రయాల ద్వారా. థియేటర్ హక్కులు విక్రయించకుండా జస్ట్ రిలీజ్ చేయించారు సితార సంస్థ రెగ్యులర్ బయ్యర్ల ద్వారా. ఇప్పుడు సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చాయి. కానీ సినిమాకు కలెక్షన్లు బాగున్నాయి. రూరల్ లో అంత లేకున్నా, అర్బన్ లో చాలా బాగుంది. దాంతో దాదాపు ఫస్ట్ వీకెండ్ లో 15 కోట్ల మేరకు షేర్ వసూలు చేసింది. అమ్మకాలతో పోల్చుకుంటే మరొక అయిదు కోట్లు రెండు స్టేట్స్ లో వసూలు చేయగలిగితే చాలు. మండే కూడా అర్బన్ ఏరియాల్లో బాగానే వుంది.

అంటే తొలి నాలుగైదు రోజుల్లో తీసుకున్న అడ్వాన్స్ లు వెనక్కు వస్తే, మిగిలిన రన్ లాభాలకు మరింత నెంబర్ ను యాడ్ చేస్తుంది. అంటే ఎలా లేదన్నా ఈ చిన్న ప్రాజెక్ట్ మీద ఇరవై కోట్ల వరకు లాభాలు రావచ్చు.

గమ్మత్తేమిటంటే చూసి వచ్చిన వారు యావరేజ్ సినిమా అనే అంటున్నారు. కానీ చూసేవాళ్లు చూస్తూనే వున్నారు. ఎంటర్టైన్‌మెంట్, యూత్ ఫుల్, సీక్వెల్ ఈ ఫ్యాక్టర్లు అన్నీ థియేటర్ పుల్లింగ్ కు గట్టిగా పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.

2 Replies to “మ్యాడ్ 2 ఇరవై కోట్ల లాభాలు”

Comments are closed.